చైనాలో ప్రారంభమై ప్రపంచదేశాలకు విస్తరిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 151 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మహమ్మారి నివారణకు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, థియేటర్లు, వేడుక మందిరాలు మూతపడుతున్నాయి.
దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణాలు నమోదయ్యాయి. అనుమానితులు 5,700 మందికి పైగా పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది మంత్రిత్వ శాఖ.
ఆయా రాష్ట్రాల్లో కేసులు ఇలా..
దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. దిల్లీలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 16, కేరళలో 27, కర్ణాటకలో 11 మంది బాధితులున్నారు. జమ్ముకశ్మీర్‌లో 3, లద్దాఖ్‌లో 8, తెలంగాణలో 6, రాజస్థాన్‌లో 4, హరియాణాలో 17, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఒక్కో కేసు నమోదైంది.
కేరళకు చెందిన ముగ్గురితో సహా దేశవ్యాప్తంగా 14 మందిని డిశ్చార్జి చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం నుంచి అఫ్గానిస్థాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, ఐరోపా సమాఖ్య, టర్కీ, యూకే ప్రయాణికులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
తమిళనాడులో రెండో కేసు