తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా లాక్​డౌన్​తోనే కరోనాకు అడ్డుకట్ట' - corona deaths in india

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించటం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నట్టు, పరీక్షల సామార్థ్యాన్ని కూడా పెంచినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6.36 శాతంగా ఉంటే భారత్​లో మాత్రం 2.89గా ఉందని తెలిపింది.

'లాక్​డౌన్​తో దేశంలో కరోనాకు అడ్డకట్ట వేయగలిగాం'

By

Published : May 27, 2020, 10:10 PM IST

దేశంలో లాక్​డౌన్​ విధించటం వల్ల బహుళ ప్రయోజనాలు కలిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా కరోనా విజృంభించకుండా అడ్డుకట్ట పడిందని వెల్లడించింది.

"లాక్​డౌన్​ వల్ల బహుళ ప్రయోజనాల కలిగాయి. ముఖ్యంగా కేసులు పెరగకుండా నియంత్రించగలిగాం. కరోనా కట్టడికి తీసుకున్న పలు కార్యక్రమాల వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు, కేసులు పెరగకుండా నివారించగలిగాం."

-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,337 మంది మృతిచెందగా... లక్షా 51వేల 767 మంది వైరస్​ బారినపడ్డారు.

లాక్​డౌన్​ సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆన్​లైన్​ ట్రైనింగ్​, వెబినార్స్​ ద్వారా మానవ వనరుల సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవటం, కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుకోవటం వంటిని చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆరోగ్య సేతుతో వైరస్​ బాధితులను గుర్తించటం ద్వారా దేశంలో సాంకేతికతను పెంచుకున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 27 నాటికి 1,58,747 ఐసోలేషన్​ పడకలు, 20వేల 355 ఐసీయూ పడకలు, 69వేల 076 ఆక్సిజన్​తో కూడిన పడకలతో మొత్తం దేశవ్యాప్తంగా 930 కొవిడ్​ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది ఆరోగ్యశాఖ. అలాగే 2,362 కొవిడ్​ హెల్త్​ సెంటర్లు, మరో 10,341 నిర్బంధ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 113.58 లక్షల ఎన్​-95 మాస్కులు, 89.84 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పరీక్షా సామర్ధ్యం పెంచటానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్​లతో మొత్తం 624 ల్యాబోరేటరీలకు అనుమతినిచ్చినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ మరణాల రేటు 6.36 శాతంగా ఉంటే, దేశంలో 2.86 శాతంగా ఉందని పేర్కొంది.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు...

రాష్ట్రం నేటి కేసులు మొత్తం కేసులు మొత్తం మరణాలు
మహారాష్ట్ర 2,190 56,948 1,897
తమిళనాడు 817 18,545 133
గుజరాత్​ 376 15,205 938
దిల్లీ 792 15,000 303
రాజస్థాన్​ 109 7,645 172
మధ్యప్రదేశ్​ 237 7,261 330

ABOUT THE AUTHOR

...view details