తమిళనాడు చెన్నైలో ఓ వార్తా సంస్థకు చెందిన 39మందికి గురువారం కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సంస్థ ఖర్చులతోనే వారందరికీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చెన్నైకు చెందిన వారిని ఇంటి వద్ద నుంచే పని చేయమని ఆదేశాలు జారీ చేసింది ఆ సంస్థ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సెలవులు ఇవ్వకుండా సంస్థ కార్యాలయంలోనే వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
కోయంబేడు మార్కెట్లో కూరగాయలు కొన్న ఓ వ్యక్తికి తొలుత వైరస్ సోకిందని... అనంతరం ఇతరులకు వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు.