దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్ర, దిల్లీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 3,721 మందికి వైరస్ సోకింది. 24 గంటల వ్యవధిలో 62మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య మొత్తంగా 1,35,796కు చేరింది. 6283 మంది మహమ్మారికి బలయ్యారు.
దిల్లీలో ఉద్ధృతంగా కరోనా
దేశ రాజధానీ దిల్లీలో కరోనా ఉద్ధృతంగా మారింది. ఒక్కరోజులో 2,909 వైరస్ బారినపడ్డారు. మరో 58మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 62,655కు పెరిగింది. చనిపోయినవారి సంఖ్య 2,223కు చేరింది.
తమిళనాడు విలవిల
తమిళనాడులో ఒక్కరోజులో 2,710 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 62,087కి పెరిగింది . కొత్తగా 37మంది కొవిడ్-19తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 794కు పెరిగింది.
మరో 563 మందికి..
గుజరాత్లో 24 గంటల్లో 563మంది వైరస్ బారినపడ్డారు. మరో 21మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 27,880కి పెరిగింది. మరణాలు 1685కు చేరాయి.
బంగాల్ పెరుగుతున్న కేసులు
బంగాల్లో ఒక్కరోజులో 413మందికి కొవిడ్-19 నిర్ధరణ అయింది. కొత్తగా 14మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 14,358కు పెరిగింది. మృతుల సంఖ్య 569కి చేరింది.
రాజస్థాన్‌లో కొత్తగా ఏడుగురు..