దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. భారత పర్యటనకు వచ్చిన 16 మంది ఇటలీ పౌరులకు, వారితో ఉన్న డ్రైవర్‌కు ఇప్పటికే వైరస్ నిర్ధరణ కాగా.. వారితో మమేకమైన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ఒకరు, ఆగ్రాకు చెందిన ఆయన బంధువులు ఆరుగురు, తెలంగాణాలో ఒకరికి కరోనా సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన పేటీఎంకు చెందిన గురుగ్రామ్ ఉద్యోగికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఇంటి నుంచే పనిచేయాలని పేటీఎం సంస్థ తమ ఉద్యోగులను కోరింది.
అదనపు ల్యాబ్‌ల ఏర్పాటుకు సిద్ధం
రాజస్థాన్‌లో పర్యటించిన ఇటలీ వాసులకు కరోనా నిర్ధరణ కాగా వారు 215 మందితో కలిసి తిరిగినట్లు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ చెప్పారు. వారిలో 93 మంది నుంచి నమూనాలను తీసుకుని పంపించగా 51 మందికి కరోనా లేదని తేలింది. 41 మందికి ఫలితాలు రావాల్సి ఉన్నట్లు వైద్య అధికారులు చెప్పారు. దిల్లీలో కరోనా సోకిన వ్యక్తి కలిసిన 88 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లిడించారు. ఈ మేరకు 19 ప్రభుత్వ, ఆరు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. అవసరమైతే.. దిల్లీలోని లేడీ హర్డింగే ఆసుపత్రి, ఎల్ఎన్జేపీ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధరణ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు.
హోలీకి ప్రముఖులు దూరం
వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా హోలీకి దూరంగా ఉండనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ కూడా హోలీ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఆదేశించారు.
సరిహద్దు, చెక్ పోస్ట్‌ల వద్ద స్క్రీనింగ్ ఏర్పాట్లు