తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై 'అమ్మ, నాన్న, ఓ ఏడేళ్ల అమ్మాయి' పోరు - రాజస్థాన్

కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. రాజస్థాన్​ బిల్వాడాలోని దంపతులు ఏడేళ్ల కుమార్తెను ఇంట్లో వదిలేసి ప్రాణాంతక వైరస్​ కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా వేళ బిల్వాడాను దేశానికి మోడల్​గా నిలపడంలో ఆ భార్యాభర్తల కృషి ఎనలేనిది.

Corona Warrior: Husband in medical service, wife in police and 7-yr-old daughter locked up at home
తండ్రి వైద్య సేవలో.. తల్లి పోలీసు విధుల్లో.. కూతురు?

By

Published : Apr 16, 2020, 2:45 PM IST

కరోనాపై పోరులో తల్లి, తండ్రి, ఓ కూతురు!

రాజస్థాన్​లోని బిల్వాడా పట్టణం మొన్నటి వరకు కరోనా హాట్​స్పాట్​ ప్రాంతం. ఇప్పుడు అక్కడ వైరస్​ పాజిటివ్​ కేసులు భారీగా తగ్గాయి. పట్టణంలో కరోనా తగ్గుముఖం పట్టడంలో వైద్య సిబ్బంది, పోలీస్​ శాఖ కృషి ఎనలేనిది. ఈ యుద్ధంలో ఓ కుటుంబం చేస్తున్న సేవ ఆదర్శంగా నిలుస్తోంది. వారు అందించిన తోడ్పాటు బిల్వాడాను కరోనా ఫ్రీ పట్టణం వైపు అడుగులు వేయిస్తోంది.

రాజస్థాన్​ బిల్వాడాకు చెందిన దిల్​కుశ్​ సింగ్, సరోజ్​ కన్వర్ భార్యాభర్తలు. స్థానిక మహాత్మా గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్​ వార్డులో వైద్య కార్యకర్తగా పని చేస్తున్నారు. అదే పట్టణంలో సరోజ్​ కన్వర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తమ ఏడేళ్ల కుమార్తె దీక్షితను ఒంటరిగా ఇంట్లో వదిలి కరోనాపై పోరాటం సాగిస్తున్నారు.

కుమార్తెకు సోకకుండా జాగ్రత్తలు

ఈ జంట అత్యంత ప్రమాదకరమైన వైరస్​తో పోరాడుతున్న తరుణంలో తమ బిడ్డకు సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు అర్థరాత్రి తర్వాత ఇంటికి చేరుకుంటున్న తండ్రి కనీసం ఆ పాపను తాకడం లేదు. గత 15 రోజులుగా అయితే దిల్​కుశ్​ సింగ్ ఇంటికే రావడం లేదు.

చిన్న పిల్ల అయినా ఎంతో సహకారం

ఉదయం విధులకు వెళ్తున్న తల్లికి దీక్షిత ఎంతో సహకరిస్తుంది. తల్లి తనని ఇంట్లో పెట్టి తాళం వేసినా.. ఆ చిన్నారి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా చదువుకోవడం, టీవీ చూడడం చేస్తూ తల్లి కోసం ఎదురు చూస్తుంది. తండ్రి ఇంటికి రాకపోవడం వల్ల నిత్యం ఫోన్​లోనే మాట్లాడుతుంది.

ఇదీ చదవండి:భారత గబ్బిలాల్లో కరోనా వైరస్‌

ABOUT THE AUTHOR

...view details