తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానసికంగా కుంగదీస్తున్న కరోనా మహమ్మారి

కరోనాతో తీవ్ర మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాధి సోకుతుందేమోనన్న భయాలతో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. చివరకు ఇది ఆత్మహత్యలకు దారితీస్తోంది.

corona virus shrinking Mentally
మానసికంగా కుంగదీస్తున్న కరోనా

By

Published : Sep 14, 2020, 5:33 AM IST

కరోనాతో శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడం, ఆర్థిక సమస్యలు ఎదురవడం, వ్యాధి సోకుతుందేమోనన్న భయాలు కలుగుతుండడంతో చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. చివరకు ఇది ఆత్మహత్యలకు దారితీస్తోంది. లాక్​డౌన్ వల్ల కరోనా తగ్గుతుందనుకుంటే రోజు రోజుకూ పెరుగుతుండడంతో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.

"భవిష్యత్తు పై స్పష్టత లేకుంటే ఆందోళన అధికమవుతుంది. ఇది తీవ్ర నిర్ణయాల దిశగా ప్రేరేపిస్తుంది" అని దిల్లీకి చెందిన సైకో థెరపిస్టు అర్విందర్ సింగ్ తెలిపారు. ఈ కారణంగానే కొందరు తమకు తాముగా గాయాలు చేసుకుంటుండగా, మరికొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు.

ఉదాహరణకు గుజరాత్​లో 108 సేవల సంస్థకు ఏప్రిల్ నుంచి జులై వరకు వచ్చిన ఫోన్ కాల్స్​లో 90 కేసులు ఆత్మహత్యకు సంబంధించినవి. సుమారు 800 ఫోన్ కాల్స్ సొంతంగా గాయాలు చేసుకున్న సంఘటనలవి. వీటన్నింటికీ ఆర్థిక, మానసిక కుటుంబ సమస్యలే కారణం. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారని గుజరాత్​కు చెందిన మానసిక వైద్య నిపుణుడు ప్రశాంత్ భిమానీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details