తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 217మందికి కరోనా నెగెటివ్​ - coronavirus death toll

corona
కరోనా న్యూస్​

By

Published : Apr 3, 2020, 8:56 AM IST

Updated : Apr 3, 2020, 11:01 PM IST

22:32 April 03

ఇటలీ నుంచి వచ్చిన వారు...

ఇటలీ నుంచి వచ్చి ఐటీబీపీ క్వారంటైన్​ కేంద్రంలో ఉన్న 217మందికి వైరస్​ నెగెటివ్​గా తేలింది. స్వదేశానికి వచ్చిన 14రోజులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

21:05 April 03

మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఆ మహమ్మారి కారణంగా నేడు ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 67 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 26కు, కేసుల సంఖ్య 490కి చేరింది. 

21:00 April 03

మహారాష్ట్రలో 490కి చేరిన కేసులు

మహారాష్ట్రలో మరో 67 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 490కి చేరుకుంది.

20:56 April 03

కరోనాపై ఇజ్రాయెల్, భారత ప్రధానులు  ఫోన్​లో సంభాషణ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్​లో సంభాషించుకున్నారు. కరోనా వైరస్​ను అరికట్టడంలో  సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై  ఇద్దరు చర్చించుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

20:53 April 03

  • రాజ్యసభకు జరగాల్సిన ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదని చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.
  • మార్చి 30న పూర్తి కావాల్సిన ఎన్నికల ప్రక్రియ అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు ఈసీ వెల్లడి.
  • ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితి నుంచి బయట పడిన తర్వాత కొత్తగా ఎన్నికల తేదీలు ప్రకటించనున్నట్లు ప్రకటన.
  • మొత్తం 55 సీట్లకు గాను 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
  • ఆంద్రప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌ 2, మధ్యప్రదేశ్‌ 3, మణిపూర్‌ 1, రాజస్థాన్‌ 3, గుజరాత్‌ 4, మేఘాలయ 1 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

20:28 April 03

గుజరాత్​లో కరోనాతో వృద్ధుడి మృతి

గుజరాత్​లో కరోనాతో వృద్ధుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజా మరణంతో రాష్ట్రంలో వైరస్​ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

20:16 April 03

భారత్​లో కరోనా మరణాలు 62కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 2,322 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 162 మంది డిశ్చార్జ్​ అయినట్లు సంబంధిత శాఖ వివరించింది. గత 24 గంటల్లో 478కేసులు నమోయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,547కు చేరుకున్నట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

20:14 April 03

కర్ణాటకలో పోలీసులపై రాళ్లు రువ్విన వైనం.. స్వల్ప గాయాలు

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా జన సమూహాలను కేంద్రం నిషేధించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హుబ్లీలోని మంతూర్ మసీదులో శుక్రవారం ప్రార్థనలను పోలీసులు నిషేధించారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన కొందరు  పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నలుగురు  పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

20:06 April 03

తక్షణమే లక్ష పీపీఈ కిట్లను కేంద్రం అందించాలి: దిల్లీ సర్కారు

దిల్లీలో వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే లక్ష పీపీఈ కిట్లు, 50వేల పరీక్ష కిట్లు,  200 వెంటిలేటర్లు అందిచాలని దిల్లీ సర్కారు కోరింది. 

19:57 April 03

కరోనా సంక్షోభం నేపథ్యంలో పలు రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కరోనా విపత్తను ఎదుర్కొనేందుకు రూ. 17,287.08 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం 14 రాష్ట్రాల్లో  రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేటాయించిన రూ .6,195.08 కోట్లను కూడా ఇందులోనే కలిపినట్లు  కేంద్రం తెలిపింది.

19:41 April 03

రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి కింద రూ.11,092 కోట్లను అన్ని రాష్ట్రాలకు విడుదల చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2020-21 సంవత్సరానికి ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌లో మొదటి విడతలో భాగంగా రాష్ట్రాల వాటాను కేంద్రం విడుదల చేసింది. 

19:34 April 03

యూపీలో మరో 38 మందికి కరోనా పాజిటివ్​

ఉత్తర్​ప్రదేశ్​లో మరో 38మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 134కు చేరింది.

19:29 April 03

వ్యవసాయ కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు

వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. రైతులు, వ్యవసాయ కూలీలు, పంట సేకరించే వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. మార్కెట్ నిర్వాహకులు, పంట కోతల యంత్రాలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు.

19:22 April 03

యూపీ నుంచి దిల్లీ ప్రార్థనలకు వెళ్లిన 1,203మంది గుర్తింపు

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన ప్రార్థనలకు వెళ్లిన 1,203 మందిని గుర్తించినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వారిలో 897మంది నమూనాలకు కరోనా పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు. 47మంది కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయినట్లు వివరించారు.  

19:16 April 03

ఒడిశాలో  మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​

ఒడిశాలో మరో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 9కి చేరినట్లు అధికారులు తెలిపారు.

18:56 April 03

ముంబయి ఎయిర్​పోర్టులో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్​ఎఫ్​ జవాన్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. 

మరోవైపు బిహార్​లో కొవిడ్​-19 కేసుల సంఖ్య 29కి చేరగా.. ఒకరు మృత్యువాతపడ్డారు.

18:52 April 03

కరోనా వైరస్​ కారణంగా బ్రిటన్​లో ఇవాళ ఒక్కరోజే 684 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మృతుల సంఖ్యలో చైనా(3,322)ను అధిగమించి 3,605కు చేరింది.

18:31 April 03

పరిస్థితులను బట్టి కర్ఫ్యూ పొడగింపు

రాష్ట్రంలో వైరస్​ తీవ్రతను బట్టి ఈ నెల 14 తర్వాత కూడా కర్ఫ్యూ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం అమరీందర్​ సింగ్​ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

18:22 April 03

మహిళా జన్​ధన్​ ఖాతాల్లో కేంద్రం ఒకరికి రూ. 500 చొప్పున జమ చేయనుంది. మొదటి విడత కింద మొత్తం రూ. 4.07 కోట్లను జమ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.  

18:10 April 03

కేరళలో 9 కొత్త కేసులు

కేరళలో మరో 9 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో ఆ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 295కు చేరింది.

18:05 April 03

మధ్యప్రదేశ్​లో మరో 10 కేసులు నమోదు

మధ్యప్రదేశ్​లో తాజాగా 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 129కు చేరింది.

17:54 April 03

కరోనా నుంచి కోలుకోని బ్రిటన్​ ప్రధాని

కరోనా బారిన పడ్డ బ్రిటన్​ ప్రధాని జాన్సన్​ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అయన ఐసోలేషన్​లోనే ఉంటూ  చికిత్స పొందుతున్నారు.

17:32 April 03

అసోంలో మరో 4 కేసులు

అసోంలో మరో నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20కి చేరింది.

17:18 April 03

ఉచిత కరోనా పరీక్షల పిటిషన్​పై సుప్రీం విచారణ  

కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.  

పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.  

ల్యాబ్‌ల్లో ఉచితంగా పరీక్షలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీకి చెందిన పిటిషనర్ శశాంక్ వాదించారు.  

కరోనా పరీక్షలకు రూ.4,500 చెల్లించే స్థోమత పేదలకు లేదని పిటిషనర్​ పేర్కొన్నారు.

పరీక్షలు చేసే ల్యాబ్‌ల సంఖ్యను వేగంగా పెంచేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశాడు.

17:16 April 03

ఇరాన్​లో మరో 134మంది మృతి  

ఇరాన్​లో కరోనా కారణంగా మరో 134మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజా మరణాలతో మృతుల సంఖ్య 3,294కు చేరుకుంది.

17:06 April 03

అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై గవర్నర్లతో చర్చించారు. లాక్​ డౌన్​ కారణంగా ఒక్కరు కూడా ఆకలిలో అలమచించొద్దన్నారు రాష్ట్రపతి కోవింద్​. డాక్టర్లు, నర్సులపై జరుగుతున్న దాడులపై ఆయన దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. కరోనాపై యుద్ధంలో భౌతిక దూరంలో విషయంలో రాజీపడొద్దన్నారు.

16:46 April 03

తమిళనాడులో కొత్తగా 102 కరోనా కేసులు  

తమిళనాడులో తాజాగా 102 కరోనా కేసుల నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 411కు చేరుకుంది.

16:42 April 03

మరో 360మంది విదేశీయులపై కేంద్రం చర్యలు  

దిల్లీలోని జమాత్ ప్రార్థనల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిపోయిన మరో 360 మంది విదేశీయులపై బ్లాక్‌లిస్టింగ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొనున్నట్లు కేంద్రం తెలిపింది.

16:24 April 03

దేశంలో 24 గంటల్లో 336కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్​ సెక్రటరీ లవ్​ అగర్వాల్​ తెలిపారు. తబ్లీగీ జమాత్‌ ద్వారా రెండ్రోజుల్లో 647 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ 647 కేసులు 14 రాష్ట్రాల్లో వెలుగుచూసినట్లు పేర్కొన్నారు. అలాగే గత 24గంటల్లో 8వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

16:19 April 03

రూ. 925 కోట్ల విరాళం  

విద్యుత్ మంత్రిత్వ శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పని చేసే సెంట్రల్​ పబ్లిక్​ సెంట్రీ ఎంటర్​ప్రైజెస్( సీపీఎస్​ఈ) పీఎం కేర్స్​ నిధికి రూ. 925 కోట్ల విరాళం ప్రకటించింది.  

15:50 April 03

సుప్రీంకోర్టు అధికారుల విరాళం

సుప్రీంకోర్టు అధికారులు పీఎం కేర్స్​ నిధికి భారీ విరాళం ప్రకటించారు. రూ. 1,00,61989ను కరోనా పోరాడేందుకు కేంద్రానికి సాయం చేయనున్నట్లు ప్రకటించారు. 

15:43 April 03

రూ. 1000 కోట్ల నిధి ఏర్పాటు

ఉత్తర్​ప్రదేశ్​లో ల్యాబ్ సదుపాయాలను పెంచడం, వెంటిలేటర్లు, ముసుగులు, శానిటైజర్ల సేకరణ కోసం రూ .1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం  పారిశ్రామిక వేత్తలు సాయం చేయాలని కోరుతోంది.

15:30 April 03

కరోనాపై పోరుకు మరో 30వేల మంది వైద్యులు సిద్ధం

కరోనాపై పోరాడేందుకు 30వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, వలంటీర్ల, సాయుధ దళాల వైద్య సేవలను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 

15:21 April 03

స్పెయిన్​లో​ కరోనా వైరస్​ విజృంభిస్తోంది. వరుసగా రెండోరోజు వైరస్​ సోకి 900 మందికిపైకి మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

14:58 April 03

వైద్య సిబ్బంది, పోలీసులు పరస్పరం అభినందన

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అమలు చేస్తున్న లాక్​డౌన్​ను విజయవంతం చేయడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​ భోపాల్‌లోని నర్మదా ట్రామా సెంటర్‌ వద్ద పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చప్పట్లు కొడుతూ పరస్పరం అభినందించుకున్నారు.

14:37 April 03

కరోనా సోకిన వారికి ఆహారం, మందులను అందించడానికి రోబోలను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు సర్కారు. చెన్నై ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో రోబోలను ప్రవేశపెట్టారు. 

14:25 April 03

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

భువనేశ్వర్‌, భద్రక్‌ నగరాల్లో ఒడిశా ప్రభుత్వం షట్‌డౌన్​ను ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 నుంచి 48 గంటలపాటు షట్‌డౌన్​ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. 

ఆరోగ్య సేవలు, ఔషధ దుకాణాలు తప్ప ఏవీ ఉండవని స్పష్టం చేసింది.

14:22 April 03

ఒడిశాలో 6కు చేరిన కేసులు

ఒడిశాలో 6వ కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.

14:17 April 03

బోటు ద్వారా నిత్యావసర వస్తువుల అమ్మకం

లాక్​డౌన్​ నేపథ్యంలో కేరళలోని కొన్ని కుబుంబాలు అలప్పుజా ప్రాంతంలోని నీటి మధ్యలో చిక్కుకున్నాయి. అయితే ఆ కుటుంబాలకు 50ఏళ్ల వ్యక్తి బోటు సాయంతో నిత్యావసర వస్తువులను విక్రయిస్తూ వారి అవసరాలను తీరుస్తున్నారు.

14:11 April 03

నిర్మానుష్యంగా జామా మసీద్​ ప్రాంగణం

ఎప్పుడూ ముస్లింల ప్రార్థనలతో రద్దీగా ఉండే జామా మసీద్​ ప్రాంగణం లాక్​డౌన్​ కారణంగా నిర్మానుష్యంగా మారింది.

14:04 April 03

43మంది క్వారంటైన్​

ఎలాంటి అనుమతి లేకుండా కశ్మీర్​ నుంచి జమ్ములోని పూంచ్​ జిల్లాకు కాలినడకన వెళ్తున్న 43మందిని పోలీసులు నిర్బంధ కేంద్రానికి తరలించారు.

13:54 April 03

హరియాణాలో మరో 8మందికి కరోనా పాజిటివ్​

హరియాణాలో మరో 8మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 43కు చేరుకున్నట్లు వెల్లడించారు. అలాగే 13మంది డిశ్చార్జ్​ అయినట్లు పేర్కొన్నారు.

13:47 April 03

మాస్కులు, శానిటైజర్ల బ్లాక్‌ మార్కెట్‌పై విచారణ

  • మాస్కులు, శానిటైజర్ల బ్లాక్‌ మార్కెట్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • బ్లాక్ మార్కెట్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ
  • బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • మాస్కులు, శానిటైజర్ల ధరలపై ప్రచారం చేయాలన్న సుప్రీంకోర్టు
  • మార్చి 27న మాస్కులు, శానిటైజర్ల ధరలపై నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం
  • నోటిఫికేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలన్న సుప్రీంకోర్టు
  • ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

12:48 April 03

  • లాక్ డౌన్ నేఫథ్యంలో వలస కూలీలకు ప్రభుత్వాలు వేతనం చెల్లించాలంటూ సామాజిక కార్యకర్తలు హర్ష మాందర్, అంజలి భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
  • పిటిషన్ పై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ సుప్రీంకోర్టు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం విచారణ
  • లాక్ డౌన్ వేళ వలస కార్మికులకు పనులు లేక  పూట గడవడం లేదని.. వారందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్లు
  • తదుపరి విచారణ ఏప్రిల్ 7కి వాయిదా

12:42 April 03

ఉత్తర్​ప్రదేశ్​లో 172 కొత్త కేసులు

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 172 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అందులో 42మంది దిల్లీలోని నిజాముద్దీన్​లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

12:35 April 03

సైన్యం ఆధ్వర్యంలో ఆరు నిర్బంధ కేంద్రాలు  

సైన్యం ఆధ్వర్యంలో ఆరు నిర్బంధ కేంద్రాలను నడుపుతున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.  ఆయా కేంద్రాలకు 403 పీపీఎల్​ కిట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. మూడు కరోనా కేసులను దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపినట్లు వివరించింది. అలాగే మరో 15 నిర్బంధ కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. 

12:11 April 03

హిమాచల్​ ప్రదేశ్​ సొలాన్​ జిల్లాలో కరోనాతో ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చండీగఢ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు వెల్లడించారు.

11:59 April 03

ఉత్తర్​ప్రదేశ్​లో  మరో 34 కరోనా కేసులు నమోదు

ఉత్తర్​ప్రదేశ్​లో  మరో 34 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

11:55 April 03

పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సైన్యం

జమ్ముకశ్మీర్​లోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను కేంద్ర అందజేసింది.  పూంచ్​ జిల్లాలో ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా అర్మీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

11:26 April 03

దేశంలోని 40మంది ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సచిన్​, కోహ్లీ, యువరాజ్​, పీవీ సింధు, హిమదాస్, అజయ్​ ఠాకూర్​​ సహా  పులువురు వీసీలో పాల్గొన్నారు. కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో దేశంలోని పరిస్థితులపై వారితో చర్చించారు. భౌతిక దూరంపై ప్రజల్లో అవగాహన పెంచాలని క్రీడాకారులను మోదీ కోరారు. తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి క్రీడాకారుల సూచనలను సైతం మోదీ తీసుకున్నారు.

11:19 April 03

లాక్‌డౌన్‌ను పాటిస్తే కరోనాను తరిమికొట్టగలం

లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కరోనాను తరిమికొట్టగలం: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌

భౌతిక దూరం పాటిస్తూనే ఇళ్లలో ఉండాలి: హర్షవర్దన్‌

వైద్యసిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు: హర్షవర్దన్‌

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది: హర్షవర్దన్‌

త్వరలోనే కరోనాను నియంత్రిస్తాం: హర్షవర్దన్‌

11:03 April 03

రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ ఇంట్లో కేంద్రమంత్రుల సమావేశం

కరోనాపై చర్చించేందుకు హోం శాఖ మంత్రి అమిత్​ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​ ఇంట్లో సమావేశమయ్యారు. 

10:52 April 03

గుజరాత్​లో 7 కొత్త కేసులు

గుజరాత్​లో కొత్తగా 7 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 95కు చేరింది.

10:32 April 03

దేశంలో కరోనా మరణాల సంఖ్య 56కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 2,088 ఉన్నట్లు పేర్కొంది. వైరస్​ నుంచి 156మంది కోలుకున్నట్లు వెల్లడించింది.  దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2301కు చేరుకున్నట్లు వివరించింది.

10:30 April 03

అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వీసీలో చర్చించనున్నారు.

10:15 April 03

రాజస్థాన్​లో మరో 14మందికి కరోనా పాజిటివ్​

రాజస్థాన్​లో కొత్తగా 14 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య మొత్తం 154కు చేరుకుంది. 

09:57 April 03

గుజరాత్​ వడోదరలో కరోనాతో 78ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు.

09:54 April 03

గోవాలో మరో పాజిటివ్​ కేసు

గోవాలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. అతడు ఇటీవల కెన్యా వెళ్లివచ్చినట్లు వెల్లడించాయి.

09:10 April 03

కరోనా చీకట్ల నుంచి వెలుగుల్లోకి...

దేశ ప్రజల్లో ఐకమత్య స్ఫూర్తి, నవోత్సాహం నింపి కరోనాపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు మరో కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏప్రిల్​ 5న ఇంటింటా ప్రకాశ్​ పర్వ్ జరపాలని కోరారు.

"ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు మీరు 9 నిమిషాలు కేటాయించాలి. ఇంట్లోని దీపాలన్నీ ఆర్పేయండి. బాల్కనీ లేదా ద్వారం వద్ద నిల్చుని... కొవ్వొత్తులు, దీపాలు లేదా టార్చ్ లైట్​ లేదా మొబైల్​ లైట్​ను 9 నిమిషాలపాటు వెలిగించండి. తద్వారా... అందరూ ఒకే సంకల్పంతో పోరాడుతున్నాం, మనం ఒంటరి కాదన్న సందేశం ఇద్దాం.

ఈ కార్యక్రమం కోసం ఎవరూ వీధుల్లోకి రావద్దు. ఎవరి ఇంట్లో వారే ఉండి మొబైల్​ లైట్లు వెలిగించాలి. సామాజిక దూరం పాటించే విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలి. కరోనా నియంత్రణకు సామాజిక దూరమే మేలైన మార్గం."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

09:00 April 03

దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. అందులోని ముఖ్యాంశాలు:

  • జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారు: ప్రధాని
  • భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారు: ప్రధాని
  • భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది: ప్రధాని
  • ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి: ప్రధాని
  • మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏం సాధిస్తారని ప్రజలు అనుకుంటున్నారు: ప్రధాని
  • ప్రతిఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే: ప్రధాని
  • లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా ఇంట్లోనే ఉన్నా ఎవరూ ఒంటరివారి కాదు: ప్రధాని

08:51 April 03

ఆపరేషన్​ కరోనా: దేశ ప్రజలకు మోదీ వీడియో సందేశం

ప్రధాని నరేంద్రమోదీ ఉదయం 9 గంటలకు దేశ ప్రజలకు వీడియో సందేశం అందించనున్నారు. కరోనాపై పోరాటం, లాక్​డౌన్​ పరిస్థితులపై ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. 

Last Updated : Apr 3, 2020, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details