తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: మహారాష్ట్రలో కొత్తగా 811మందికి వైరస్

corona
కరోనా

By

Published : Apr 25, 2020, 8:46 AM IST

Updated : Apr 25, 2020, 11:02 PM IST

22:27 April 25

15 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లకు కరోనా పాజిటివ్​

దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ బలగాలకు చెందిన 15 మంది జవాన్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. అందులో ఒక అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​, నలుగురు హెడ్​కానిస్టేబుళ్లు సహా వారిని కలిసిన ఓ పౌరుడికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. 

21:17 April 25

రాజస్థాన్​లో 2083కు చేరిన కరోనా కేసులు

రాజస్థాన్​లో కరోనా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. ఈరోజు కొత్తగా 49కి పాజిటివ్​ కేసులు నమోదాయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2083కి చేరగా.. మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 

20:57 April 25

హరియాణాలో కరోనా..

హరియాణాలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 287కు చేరింది.

20:46 April 25

మహారాష్ట్రలో కొత్తగా 811 మందికి

మహారాష్ట్రలో కొత్తగా 811మందికి కరోనా సోకింది. 24 గంటల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తంగా మరణాల సంఖ్య 323కు పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7,628మందికి చేరింది. 

20:27 April 25

గుజరాత్​లో 3వేలు దాటిన కేసులు​

గుజరాత్​లో కొత్తగా 256మందికి కరోనా సోకింది. తాజా బాధితుల్లో అహ్మదాబాద్​లోనే 182 మంది ఉన్నారు. 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 133కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3071కి చేరింది.

20:09 April 25

కొత్త కేసుల్లేవ్​!

ఉత్తరాఖండ్​లో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48 పాజిటివ్​ కేసులు ఉన్నాయి.

20:07 April 25

బంగాల్​లో 38 కేసులు..

బంగాల్​లో తాజాగా 38 కరోనా పాజిటివ్​ కేసులు నమోద్యయాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 541కి చేరింది. 423 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి.

19:54 April 25

పుణెలో తగ్గుతున్న మరణాల రేటు...

పుణెలో కరోనా మరణాల రేటు తగ్గుముఖం పడుతోంది. వారంలో 9.18 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింది. ఈ జిల్లాలో శుక్రవారం వరకు మొత్తం కేసుల సంఖ్య 980గా ఉండగా... 64 మంది వైరస్​ బారిన పడి చనిపోయారు.

19:44 April 25

మార్పుల్లేవ్​...

మే 3 వరకు విధించిన లాక్​డౌన్​లో ఎలాంటి సడలింపులు ఇవ్వట్లేదని స్పష్టం చేసింది మహారాష్ట్ర. దుకాణాలు తెరిచే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన ఆదేశాల్లో కొంత గందగోళం నెలకొందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం మోదీతో సమావేశం అనంతరం స్పష్టత తెచ్చుకుంటామన్నారు.

19:20 April 25

దిల్లీలో ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరవొచ్చు..

కంటెయిన్​మెంట్​ జోన్ల బయట ఉండే రెసిడెన్సియల్​ ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది దిల్లీ ప్రభుత్వం. అయితే సామాజిక దూరం, మాస్కుల వాడకం తప్పనిసరి చేసింది.

19:13 April 25

మధ్యప్రదేశ్​లో కరోనా:

మధ్యప్రదేశ్​లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 99 పాజిటివ్​ కేసులు నమోదవగా... మొత్తం బాధితుల సంఖ్య 1,945కు చేరింది. ఇప్పటివరకు 99 మంది చనిపోయారు.

19:02 April 25

కర్ణాటకలో 26 కేసులు..

కర్ణాటకలో గత 24 గంటల్లో 26 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 500కు చేరింది. ఇందులో 158 కోలుకోగా.. 18 మంది చనిపోయారు. 324 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి.

18:51 April 25

తమిళనాడులో 66 కేసులు...

తమిళనాడులో గత 24 గంటల్లో 66 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1821కి చేరింది.

17:53 April 25

భారత్​లో కరోనా కేసులు:

దేశవ్యాప్తంగా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం.. కరోనా కేసులు 24,942కు చేరాయి. ఇందులో 5,210 మంది కోలుకోగా.. 779 మంది మరణించారు. 18,953 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి.

17:04 April 25

భౌతిక దూరానికి తిలోదకాలు...

కర్టాటక దావనగెరె జిల్లా హన్నాలిలో భాజపా ఎమ్మెల్యే, ఎంపీ.. ఆశ వర్కర్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎలాంటి భౌతిక దూరం పాటించలేదు. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్​ అవుతోంది.

16:51 April 25

ఒకే కుటుంబంలో...

ఉత్తర్​‌ప్రదేశ్‌లోని ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా వైరస్‌ సోకింది. దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ ఇస్లామిక్‌ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి గత నెల సంత్‌కబీర్‌నగర్‌లోని ఇంటికి వచ్చాడు. అతడికి వైరస్‌ లక్షణాలు కనిపించడం వల్ల కొద్ది రోజుల క్రితం కరోనా నిర్ధరణ పరీక్షలు జరిపారు. అతడికి పాజిటివ్‌ రిపోర్టు రాగా, అతని కుటుంబసభ్యులతో పాటు బంధువులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో వాళ్లందరికీ పరీక్షలు చేయగా 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

16:35 April 25

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా కేసులు 1778కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య 26కు పెరిగింది.

15:49 April 25

దిల్లీలో 92 కరోనా హాట్‌స్పాట్‌లు

దేశ రాజధాని నగరంలో 92 కరోనా హాట్‌స్పాట్లు ఉన్నాయని.. దిల్లీ మొత్తం ఒక హాట్‌స్పాట్‌ కాదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. దిల్లీలో ఆరుగురికి ప్లాస్మా థెరఫీ నిర్వహించామన్నారు. సానుకూల ఫలితాలు వస్తున్నట్టు చెప్పారు. దిల్లీలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏదైనా ఈ నెల 30 తర్వాతే చెప్పగలమని పేర్కొన్నారు.

15:06 April 25

ఉత్తర బంగాల్​లో లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం.. మమతా సర్కార్​కు లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు కొన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపింది మోదీ సర్కారు.​

15:00 April 25

విమాన సేవలపై...

నేపాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అక్కడి ప్రభుత్వం విమాన సర్వీసులపై నిషేధం పొడిగించింది. మే 15 వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్ని నిలిపివేయనున్నట్టు తెలిపింది.

14:42 April 25

వాటికి అనుమతి లేదు: కేంద్ర హోంశాఖ

కరోనా తీవ్రతతో విధించిన లాక్‌డౌన్‌ వేళ సెలూన్లు తెరిచేందుకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్రం హోంశాఖ స్పష్టం చేసింది. కేవలం వస్తువుల విక్రయానికే అనుమతిచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన ఆదేశాల్లో ఏ రకమైన రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను కూడా తెరిచేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు.  

13:58 April 25

కరోనా వేళ వైద్యం అందించేందుకు వినూత్నంగా ఒక బస్సును మొబైల్​ క్లినిక్​గా మార్చింది కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్​ఆర్​సీటీసీ). 

13:26 April 25

ఔషధాలతో దిల్లీకి...

చైనాలోని షాంఘై నగరం నుంచి స్పైస్‌జెట్‌ కార్గో విమానం ఔషధాలతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకుంది. దాదాపు 18 టన్నుల ఔషధాలు, అత్యవసర వస్తువులను దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చింది. 

13:16 April 25

జూన్​ 30 వరకు...

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న నేపథ్యంలో జూన్‌ 30 వరకు ఎక్కడా ప్రజలు గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

12:55 April 25

మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 394 కొత్త కేసులు; 18 మరణాలు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 6817 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 301 మంది మృత్యువాతపడ్డారు. 

12:30 April 25

కర్ణాటకలో కొత్తగా 15 

కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఈ రోజు కొత్తగా మరో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 489 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. వారిలో 153 మంది కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

11:04 April 25

బిహార్​లో 11..

బిహార్​లో కొత్తగా 11 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 225కు చేరింది.

10:27 April 25

ఉత్తర్​ప్రదేశ్​లో 43...

ఉత్తర్​ప్రదేశ్​లో మరో 43 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,664కు చేరింది. మృతుల సంఖ్య 25గా ఉంది.

10:10 April 25

రాజస్థాన్​లో మరో 25...

రాజస్థాన్​లో మరో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2059కి చేరగా మృతుల సంఖ్య 32కు పెరిగింది.

08:43 April 25

కరోనా విజృంభణ- ఒక్కరోజులో 57 మంది మృతి

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గత 24 గంటల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,429 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 24,506
  • యాక్టివ్ కేసులు: 18,668
  • మరణాలు: 775
  • కోలుకున్నవారు: 5,062
  • వలస వెళ్లిన వారు: 1
Last Updated : Apr 25, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details