తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో ఒక్కరోజే 478 కరోనా కేసులు.. 8 మరణాలు - undefined

corona
కరోనా పంజా

By

Published : Apr 23, 2020, 8:59 AM IST

Updated : Apr 23, 2020, 9:41 PM IST

21:39 April 23

ముంబయిలో మరో 478 కరోనా కేసులు..

మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉన్న ముంబయిలో కొవిడ్​ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం మరో 478 మంది కరోనా బారినపడగా నగరంలో మొత్తం కేసుల సంఖ్య 4232కు చేరింది. మరో 8 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 168కి చేరింది. 

20:38 April 23

మహారాష్ట్రలో ఒక్కరోజే 778 కరోనా కేసులు.. 14 మరణాలు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 778 కేసులు నమోదు కాగా.. 14 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 6,427కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 283కు పెరిగాయి.

20:17 April 23

లాక్​డౌన్​ నిబంధనలపై కేంద్రం క్లారిటీ..

లాక్​డౌన్​ నిబంధనలపై సామాజిక మాధ్యమాలు, మీడియాలో తప్పుడు సమాచారం  ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగికి కరోనా నిర్ధరణ ఆయితే ఆ ఫ్యాక్టరీని సీజ్​ చేయడం,  సీఈఓపై కేసు నమోదు చేసే నిబంధన లేదని వివరణ ఇచ్చింది.

20:09 April 23

మధ్యప్రదేశ్​లో మరో వంద మందికి కరోనా  

మధ్యప్రదేశ్​లో మరో వంద మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర అరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,695కు చేరినట్లు వెల్లడించాయి. అలాగే రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 81మంది మృతి చెందినట్లు పేర్కొన్నాయి.

19:48 April 23

కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్

  • లాక్‌డౌన్‌ వేళ కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
  • కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని న్యాయవాది అహ్మద్ అయూబీ పిటిషన్‌
  • లాక్‌డౌన్ వల్ల పేదలు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారన్న పిటిషనర్

19:26 April 23

మరో 5లక్షల కరోనా నిర్ధరణ కిట్లకు భారత్​ ఆర్డర్​

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధరణ పరీక్షలను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో మరో 5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్ల సరఫరాకు  దక్షిణ కొరియాకు చెందిన  కంపెనీతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఒప్పందం కుదుర్చుకుంది.

19:14 April 23

పుణెలో కరోనాతో మరొకరు మృతి  

మహారాష్ట్ర పుణెలో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో పుణెలో మొత్తం మరణాల సంఖ్య 61కి చేరినట్లు వెల్లడించారు.  

19:11 April 23

అండమాన్​ నికోబార్​ దీవుల్లో కొత్తగా 5 కేసులు

అండమాన్​ నికోబార్​ దీవుల్లో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11కు చేరుకుంది.

19:02 April 23

ముంబయి ధారవిలో పెరుగుతున్న కేసులు

ప్రపంచంలోనే అతిపెద్ద మురికి వాడల్లో ఒకటైన ముంబయిలోని ధారవిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ ప్రాంతంలో 25కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 214కు పెరిగాయి.

18:36 April 23

కేరళలో 10...

కేరళలో కొత్తగా 10కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 447కు చేరింది. ఇందులో 129 యాక్టివ్​ కేసులున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తెలిపారు.

17:38 April 23

దేశంలో 686కు చేరిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాలు 686కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 16,689 ఉండగా.. 4, 324 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,700కు పెరిగినట్లు వివరించింది. 

గత 24 గంటల్లో 1,229 కరోనా కేసులు నమోదైనట్లు, 34 మంది  చనిపోయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

17:36 April 23

కర్ణాటకలో 18 కొత్త కేసులు

కర్ణాటకలో మరో 18 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 445కు చేరుకుంది. అందులో 17మంది చనిపోగా.. 141మంది  వైరస్​ నుంచి కోలుకున్నారు.

17:31 April 23

జమ్ముకశ్మీర్​లో 20 కొత్త కేసులు

జమ్ముకశ్మీర్​లో 20 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి. జమ్ము డివిజన్​లో ఒక కేసు, కశ్మీర్​ నుంచి 19 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం కేసులు 427కు చేరుకున్నట్లు చెప్పారు.

17:16 April 23

బంగాల్​లో 334కు చేరిన కరోనా కేసులు

బంగాల్​లో గత 24గంటల్లో 58 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 334కు చేరుకుంది.

16:24 April 23

దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి కరోనా పరీక్షలు  

దేశంలో ఇప్పటివరకు 5 లక్షల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రెండు వారాలుగా 78 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని వివరించింది. గడిచిన 28 రోజులుగా 12 జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదని పేర్కొంది. లాక్​డౌన్​లో కరోనా నిర్ధరణ పరీక్షలు 24రెట్లు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కేసులు మాత్రం 16 రెట్లు పెరిగినట్లు పెర్కొంది.

16:07 April 23

లాక్​డౌన్​ నుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు

లాక్​డౌన్​ సడలింపులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా పలు సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ, ఎలక్ట్రికల్‌ దుకాణాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పుస్తక విక్రయాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చని తాజా సడలింపుల్లో చెప్పింది. రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ యూనిట్ల కార్యకలాపాలు, మొబైల్‌ పాయింట్లకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

16:00 April 23

వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవాలి

కరోనా కట్టడికి పోరాడుతున్న  వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించుకోవాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి జావడేకర్​ అన్నారు. కరోనా నియంత్రణకు పాటుపడుతున్న వారిపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు.  వారి రక్షణ కోసమే అర్డినెన్స్​ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 

15:29 April 23

స్పెయిన్​లో 22వేలు దాటిన కరోనా మరణాలు

స్పెయిన్​లో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా ఆ దేశంలో 440 మరణాలు సంభవించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య  22,157కు పెరిగింది. స్పెయిన్​లో ఇప్పటివరకు కరోనా కేసులు  213,000కు చేరుకున్నాయి.

14:49 April 23

కరోనాతో ఆరు నెలల చిన్నారి మృతి

చండీగఢ్​ లో కరోనాతో ఆరు నెలల చిన్నారి మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. 

14:43 April 23

రాజస్థాన్​లో మరో 49మందికి కరోనా

రాజస్థాన్​లో మరో 49మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్​ కేసుల సంఖ్య 1937కు చేరింది. 

14:15 April 23

ఇండిగో ఉద్యోగులకు...

ఈ నెల ఇండిగో ఉద్యోగుల వేతనాల కోత నిర్ణయాన్ని ఆ సంస్థ వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఇండిగో సీఈఓ రొనోజోయ్​ దత్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్​ కమిటీ సభ్యులు, సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్లు స్వచ్ఛందంగా తమ వేతనాల్లో కోతకు ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.

13:24 April 23

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్​ పెంపు నిలిపివేత

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డీఏ, పింఛన్​దారులకు చెల్లించే డీఆర్​ పెంపును 2020 జనవరి 1 నుంచి నిలిపి వేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

12:46 April 23

పేదలకు రూ. 31,235 కోట్లు సాయం: కేంద్రం

ప్రధానమంత్రి గరిబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద 33 కోట్ల మందికి పైగా పేదలకు రూ. 31,235 కోట్లు ఆర్థికసాయం చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మహిళా జనధన్ ఖాతాదారులకు రూ.10,025 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రాలకు 1,09,227 మెట్రిక్‌ టన్నుల పప్పుదినుసులు సరఫరా అయ్యాయని వెల్లడించింది.

12:26 April 23

కరోనా వ్యాక్సిన్ తయారీలో 'ఆక్స్‌ఫర్డ్' మరో అడుగు

  • కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు వేసిన బ్రిటన్​కు చెందిన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు
  • ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌పై నేటి నుంచి క్లినికల్ ట్రయల్స్
  • దాదాపు 500 మందిపై జరగనున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలు
  • నేటి నుంచి మనుషులపై పరీక్షించనున్నట్లు తెలిపిన బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి
  • ఇప్పటికే మెర్స్‌కి వ్యాక్సిన్ రూపొందించి పరీక్షలు పూర్తిచేసిన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ

12:24 April 23

కర్ణాటకలో 16 కొత్త కేసులు

కర్ణాటకలో మరో 16 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 443కు చేరుకుంది. అందులో 17మంది చనిపోగా.. 141మంది  వైరస్​ నుంచి కోలుకున్నారు.

12:12 April 23

బిహార్​లో మరో 4 పాజిటివ్​ కేసులు

బిహార్​లో మరో 4 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో కేసుల సంఖ్య 147కి చేరింది. 

11:45 April 23

ప్రతి కుటుంబానికి రూ.7500 అందించాలి: సోనియా

వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దేశంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా ప్రభావం, పరిణామాలపై నేతలతో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ చర్చిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా రైతులు, కూలీలు, వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. గత మూడు వారాల్లో వైరస్​ ఉద్ధృతి పెరిగిందని వివరించారు. వాణిజ్య, వ్యాపారాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అనేక మంది జీవితాలు చిన్నాభిన్నయ్యాయన్నారు సోనియా. లాక్​డౌన్​ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రతి కుటుంబానికి అత్యవసర సాయం కింద రూ.7,500 అందించాలన్నారు. సమష్టిగా కరోనాపై పోరాడాల్సిన సమయంలో ద్వేషం, మతం అనే వైరస్​ వ్యాప్తికి భాజపా పాల్పడుతోందన్నారు సోనియా. 

లాక్​డౌన్​పై పోరాటంలో విజయం సాధించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారం ఎంతో కీలకమన్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.

10:47 April 23

ప్రతి కుటుంబానికి రూ.7500 అందించాలి: సోనియా

వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దేశంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా ప్రభావం, పరిణామాలపై నేతలతో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ చర్చిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా రైతులు, కూలీలు, వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. గత మూడు వారాల్లో వైరస్​ ఉద్ధృతి పెరిగిందని వివరించారు. వాణిజ్య, వ్యాపారాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అనేక మంది జీవితాలు చిన్నాభిన్నయ్యాయన్నారు సోనియా. లాక్​డౌన్​ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రతి కుటుంబానికి అత్యవసర సాయం కింద రూ.7,500 అందించాలన్నారు. 

10:27 April 23

రాష్ట్రాలకు మరోసారి ఐసీఎంఆర్‌ సూచనలు

కరోనా నిర్ధరణకు కేవలం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేయాలని రాష్ట్రాలకు ఐసీఎంఆర్​ సూచించింది.  ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు చేయొద్దని పేర్కొంది. ముక్కు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్‌ ఆధారంగా మాత్రమే పరీక్షలు చేయాలని వివరించింది. రోగనిరోధక శక్తి తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్టులు చేయాలని స్పష్టం చేసింది. ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్ల స్థానంలో యాంటీ బాడీ టెస్టింగ్‌ కిట్లు ఉపయోగించకూడదని ఆదేశించింది. రాష్ట్రాలన్నీ ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్‌ను అనుసరించాలని పేర్కొంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య పరిశోధన మండలి జారీ చేసింది. 

10:21 April 23

వైద్య సిబ్బంది రక్షణ ఆర్డినెన్స్‌ను స్వాగతించిన ఉపరాష్ట్రపతి

వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రాణాలు ఎదురొడ్డి పోరాడుతున్న వారిపై దాడులు శోచనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం మరింత భద్రత కల్పించగలదని ఆశిస్తున్నామన్నారు.

09:41 April 23

రాజస్థాన్​లో మరో 47మందికి కరోనా

రాజస్థాన్​లో మరో 47మందికి కరోనా సోకినట్లు  ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,935కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 27మంది మృతి చెందినట్లు వెల్లడించారు.

08:59 April 23

ఆర్డినెన్సుకు ఆమోదం

వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపేలా కేంద్రం ఈ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. దాడులకు పాల్పడితే రూ.5 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం కల్పించేలా 'జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897'కి సవరణ చేయనున్నారు. 

08:56 April 23

కరోనా పంజా: 24 గంటల్లో 41 మరణాలు

దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1409 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 21,393
  • యాక్టివ్ కేసులు: 16,454
  • మరణాలు: 681
  • కోలుకున్నవారు: 4,257
  • వలస వెళ్లిన వారు: 1
Last Updated : Apr 23, 2020, 9:41 PM IST

For All Latest Updates

TAGGED:

corona

ABOUT THE AUTHOR

...view details