బ్రిటన్‌లో కొత్తగా 449 మరణాలు
కరోనా సోకి బ్రిటన్‌లో మరో 449 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు సంఖ్య 16,509కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 124,743కి పెరిగింది.
21:09 April 20
బ్రిటన్‌లో కొత్తగా 449 మరణాలు
కరోనా సోకి బ్రిటన్‌లో మరో 449 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు సంఖ్య 16,509కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 124,743కి పెరిగింది.
20:41 April 20
కర్ణాటకలో 400 మార్క్ దాటిన కేసులు..
కర్ణాటకలో మరో 18మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 408కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16మంది మృతి చెందారు. 12మందికి వైరస్ నయమైంది. 280 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
20:22 April 20
గుజరాత్లో మరో నలుగురు..
గుజరాత్లో వైరస్ కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 71కి చేరింది. రాష్ట్రంలో మరో 93మందికి కరోనా సోకింది. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1939కి పెరిగింది. 106మందికి వైరస్ నయమైంది.
20:14 April 20
'మహా'రాష్ట్రలో 466 కొత్త కేసులు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. గత 24 గంటల్లో 466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 4,666కి చేరింది. నేడు 9 మంది చనిపోవడం వల్ల మరణాల సంఖ్య 232కి చేరింది. మొత్తం 572 మంది ఇప్పటివరకు కోలుకున్నారు.
19:21 April 20
ధారవిలో పెరుగుతున్న కేసులు..
మహారాష్ట్రలోని ధారవిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 168కి చేరింది. 11 మంది ఇప్పటివరకు మృతి చెందారు.
18:54 April 20
తమిళనాడులో 43 కేసులు...
తమిళనాడులో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య మొత్తం 1,520కి చేరింది. ఇందులో 457 మంది కోలుకోగా.. మొత్తం 17 మంది చనిపోయారు.
18:43 April 20
బంగాల్లో 54 కేసులు..
బంగాల్లో మరో 54 కొవిడ్ కేసులు నమోదయ్యయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 339కి చేరింది. ఇందులో 245 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
18:36 April 20
కేరళలో 6 కేసులు..
కేరళలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 408కి చేరింది. ఇందులో 114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 21 మంది డిశ్చార్జి అయ్యారు.
18:28 April 20
ఉత్తరప్రదేశ్‌లోని 45 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..
కరోనా కట్టడి కోసం కీలక చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ సరిగ్గా పాటించని 40 జిల్లాల్లో.. ఇకపై కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. ఇటీవలె ప్రభుత్వం సర్వే చేయగా... మొత్తం 75 జిల్లాల్లో 40 జిల్లాల్లో ప్రజలు లాక్‌డౌన్ ఖాతరు చేయట్లేదని తేలిందట. ఫలితంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
18:18 April 20
రికార్డుల స్థాయిలో తగ్గిన కేసులు...
ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక్క కేసూ నమోదుకాలేనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,619 కేసులు నమోదవగా.. 71 మంది చనిపోయారు. 4,258 మంది కోలుకున్నారు. 50 మంది మాత్రమే ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
17:55 April 20
దేశంలో కరోనా కేసులు...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా వైరస్ బాధితుల సంఖ్య 17,656కి చేరింది. ఇందులో 2,841 మంది కోలుకోగా.. 559 మంది మరణించారు. ఇంకా 14,255 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
17:47 April 20
కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్
కరోనాపై పోరులో భాగంగా రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు రక్షణ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇందులో నియమాల ప్రకారం... ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను వ్యాప్తి చేయాలని ప్రయత్నించినా, ప్రభుత్వానికి సహకారం అందించకపోయినా వారు శిక్షార్హులు. ఇప్పటికే కేరళ, ఉత్తరప్రదేశ్ ఈ తరహా ఆర్డినెన్స్ జారీ చేశాయి.
కొంత మందిని క్వారంటైన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు, వైద్య బృందంపై.. పాదరాయణపురంలో దాడి జరిగింది. ఈ ఘటన చర్చనీయాంశం కావడం వల్ల అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న వారి రక్షణపైన ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
17:15 April 20
రాష్ట్రపతి కృతజ్ఞతలు...
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వేళ ప్రజల భద్రతను, దేశ బాధ్యతను తమ భూజాలపై మోస్తోన్న పోలీసులు, భద్రతా దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సేవ చేస్తోన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, సంఘ సంస్కర్తలు, వివిధ మత సంస్థలను కోవింద్ అభినందించారు.
16:19 April 20
16:18 April 20
15:20 April 20
గణనీయంగా తగ్గింది...
స్పెయిన్‌లో కరోనా మరణాల రేటు తగ్గింది. గత 24 గంటల్లో 400 కంటే తక్కువ మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
14:04 April 20
'మహా' విపత్తు
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,483కు చేరింది.
13:17 April 20
భారత్ సాయం...
కరోనాపై పోరులో మాల్దీవులకు భారత్ సాయమందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహమ్మారిపై ఇరుదేశాలు ఉమ్మడి పోరు సాగిస్తాయన్నారు.
11:46 April 20
ఇండోర్‌లో 897...
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కరోనాకు మరో ముగ్గురు బలయ్యారు. ఒక్క ఇండోర్ జిల్లాలోనే మృతుల సంఖ్య 52కు చేరింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 897కు పెరిగింది.
11:33 April 20
రూ.7 కోట్లు...
కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా హ్యుందాయ్ సంస్థ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 7 కోట్లు విరాళం ప్రకటించింది.
10:57 April 20
గుజరాత్లో 108
గుజరాత్లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 67కు పెరిగింది.
10:31 April 20
మణిపుర్ విజయం...
మణిపుర్ 'కరోనా ఫ్రీ' రాష్ట్రంగా అవతరించినట్లు సీఎం ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా బాధితులు కోలుకున్నారని... కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని ట్వీట్ చేశారు.
10:24 April 20
పరిస్థితి తీవ్రం....
దేశంలో ఇండోర్, ముంబయి, పుణె, జైపుర్, కోల్‌కతా సహా బంగాల్లో మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని హోంశాఖ పేర్కొంది.
10:14 April 20
మరో ముగ్గురు...
మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో మరో ముగ్గురు కరోనా బారినపడ్డారు. జిల్లాలో కేసుల సంఖ్య 76కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
09:19 April 20
రాష్ట్రాలకు కేంద్రం లేఖ
08:54 April 20
24 గంటల్లో 36 మరణాలు- 1,553 కొత్త కేసులు
దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,553 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.