రాంచీలో మూడు కొత్త కేసులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32కు పెరిగింది.
20:46 April 17
రాంచీలో మూడు కొత్త కేసులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32కు పెరిగింది.
20:22 April 17
మధ్యప్రదేశ్‌లో 146 కేసులు
మధ్యప్రదేశ్‌లో ఈరోజు 146 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 69కి పెరిగింది.
20:02 April 17
గుజరాత్లో 1,099
గుజరాత్లో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 1,099కి పెరిగింది. మృతుల సంఖ్య 41కిచేరింది.
20:00 April 17
యూపీలో 44 కొత్త కేసులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈరోజు నమోదైన 44 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 849కి చేరింది.
19:44 April 17
ముంబయిలో 2,120కి చేరిన కేసులు
దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్రబిందువైన ముంబయిలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2,120కి పెరిగింది. మృతుల సంఖ్య 121కి పెరిగింది.
19:14 April 17
తమిళనాడులో 56 కేసులు
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,323కి పెరిగింది. ఈరోజు కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి.
19:10 April 17
పంజాబ్‌లో 14 కొత్త కేసులు
పంజాబ్‌లో ఇవాళ 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 211కు పెరిగింది. 13మంది ప్రాణాలు కోల్పోయారు.
19:08 April 17
పుణెలో 44ఏళ్ళ వ్యక్తి మృతి
కరోనా సోకి పుణెలో 44 వ్యక్తి మృతిచెందాడు. జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 49కి చేరింది.
18:59 April 17
బ్రిటన్‌లో 14,500 దాటిన మరణాలు
బ్రిటన్‌లో ఒక్క రోజులో 847 కరోనా మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య 14,500 దాటింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,000కు చేరువైంది.
18:17 April 17
బంగాల్లో కొత్తగా 22 కేసులు
బంగాల్లో ఇవాళ 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 255కు పెరిగింది. వైరస్ సోకి ఇప్పటి వరకు 10 మంది మరణించారు.
18:09 April 17
కేరళలో ఒకే ఒక్క కేసు
కరోనాను విజయవంతంగా ఎదుర్కొంటున్న కేరళలో ఈరోజు కేవలం ఒక్కటే పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం 395 కేసులకు గాను, ప్రస్తుతం 138 మంది ఆస్పత్రులలో ఉన్నారు. మిగతా వారందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
18:04 April 17
ధారావీలో 100కుపైగా కరోనా కేసులు
మహారాష్ట్ర ధారావీ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య 101కి పెరిగింది. కొత్తగా 15 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
17:35 April 17
13,835కు పెరిగిన కేసులు
దేశంలో కరోనా మృతుల సంఖ్య 452కు పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. వైరస్ బారి నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,767 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 1,076 కొత్త కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి.
17:07 April 17
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22,00,000కు చేరువైంది. మృతుల సంఖ్య 1,47,000 వేలు దాటింది. ఇప్పటి వరకు 5,57,000 మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
17:02 April 17
స్పెయిన్‌లో 19,500కు పైగా మృతులు
స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య 19,500 దాటింది. వైరస్ బాధితుల సంఖ్య 1,85,000కు చేరింది.
16:32 April 17
కరోనా సోకిన వారిలో 80శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు కేసుల రెట్టింపునకు 3 రోజులు పడితే, ఇప్పుడు 6.2 రోజలు పడుతుందని పేర్కొంది. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ రోజులే పడుతోందని వెల్లడించింది.
వీలైనంత త్వరగా కరోనాకు వ్యాక్సీన్‌కు తీసకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్య ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. బీసీజీ, ప్లాస్మా థెరపీ, మోనోక్లోనో యాంటీ బాడీస్‌పై ప్రయోగాలు వేగవంతం చేసినట్లు చెప్పారు.
15:37 April 17
కశ్మీర్లో ఐదో మరణం..
కరోనా కారణంగా కశ్మీర్లో ఈరోజు మరొకరు మృతి చెందారు. వైరస్ సోకి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
15:31 April 17
బిహార్‌లో రెండో మరణం
కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తి ఇవాళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇది రెండో మరణం. ఇప్పటివరకు 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15:08 April 17
రాజస్థాన్‌లో మరో వ్యక్తి మృతి
కరోనా సోకి రాజస్థాన్‌లో మరో వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కొత్తగా 62 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 1,193కు పెరిగింది. మృతుల సంఖ్య 17కు చేరింది.
14:57 April 17
ఆర్బీఐపై మోదీ ప్రశంసలు
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతాని ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్రవ్య లభ్యతను పెంచడానికి ఇవి దోహదపడతాయని ట్వీట్ చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మేలు జరుగుతుందని, డబ్లూఎంఏ పరిమితులు పెంచడం అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరం అని స్పష్టం చేశారు.
14:22 April 17
కరోనాపై పోరులో మోదీ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదని చెప్పారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. ప్రజలకు తక్కువ ఇబ్బందులు ఎదురయ్యోలా, రాబోయే రోజుల మంచిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపేతానికి ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు మోదీ సంకల్పానికి బలం చేకూర్చేలా ఉన్నాయని ప్రశంసించారు షా.
14:15 April 17
మహారాష్ట్రలో మరో 34 కేసులను గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 3,236కు పెరిగింది.
13:48 April 17
మహారాష్ట్రలో మరో 288 కేసులు
దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 3,204కి చేరింది. ఇవాళ కొత్తగా 288 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 194కి పెరిగింది.
13:23 April 17
తమిళనాడులో...
తమిళనాడులో జల్లికట్టు నిర్వహణ కోసం ఏకంగా 2వేల మంది లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
12:54 April 17
పుణెలో మరొకరు మృతి..
కరోనా బారినపడి పుణెలో మరో వ్యక్తి మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 48కి చేరింది.
12:42 April 17
కర్ణాటకలో 350కి పైగా..
కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 353కి చేరింది. ఈరోజు కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు.
12:32 April 17
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా కేసులు రోజురోజుకు మరిన్ని పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 155 కేసులు నమోదయ్యాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 842కు పెరిగింది. మృతుల సంఖ్య 47కు చేరింది.
11:53 April 17
కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారాసెటమాల్‌తో తయారయ్యే ఫార్ములేషన్ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
11:32 April 17
కేంద్రమంత్రుల సమావేశం
దిల్లీలోని నిర్మాణ్ భవన్లో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్షవర్ధన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్ హాజరయ్యారు.
11:12 April 17
గుజరాత్లో 1,000 దాటిన కేసులు
గుజరాత్లో మరో 92 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,021కి చేరింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
10:58 April 17
రాజస్థాన్‌లో 1,169కి పెరిగిన కేసులు
రాజస్థాన్‌లో ఈరోజు కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల సంఖ్య 1,169కి పెరిగింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు.
10:54 April 17
దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1640కి చేరింది. మృతుల సంఖ్య 38కి పెరిగింది.
10:45 April 17
10:33 April 17
ఆర్‌బీఐ గవర్నర్ ప్రెస్‌మీట్ హైలైట్స్:
శక్తికాంత దాస్ భరోసా
10:28 April 17
10:24 April 17
10:18 April 17
10:14 April 17
10:08 April 17
ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఆర్‌బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంత దాస్. దేశ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని,
పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
09:56 April 17
కేంద్రం అనేక మార్గదర్శకాలు
09:46 April 17
అగ్రరాజ్యం కొత్త రికార్డ్
అమెరికాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 4,591 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 33 వేలు దాటింది. 6లక్షల 62 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు.
09:24 April 17
చైనా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వుహాన్‌లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను ఒక్కసారే 1,290 మేర పెంచింది. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 3,869కి చేరింది. ఇది ఇప్పటివరకు ప్రకటించినదానికన్నా 50శాతం అధికం.
మృతుల సంఖ్యలో చైనా ప్రభుత్వం ఒక్కసారిగా ఈ మార్పు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే... లెక్కింపులో పొరపాట్లు జరగడం, కొన్ని కేసుల్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వుహాన్ అధికార యంత్రాంగం ఓ సోషల్ మీడియా పోస్టులో వివరించింది.
09:12 April 17
మరికాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం
కరోనా కారణంగా భారీగా పతనమవుతున్న రూపాయి విలువ, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లాక్డౌన్ విధించిన తర్వాత తొలిసారి ప్రసంగించనున్నారు.
08:30 April 17
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,007 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.