తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో 3వేలకు చేరువలో కరోనా కేసులు - cabinet meet

corona
కరోనా పంజా

By

Published : Apr 15, 2020, 8:40 AM IST

Updated : Apr 15, 2020, 11:44 PM IST

23:32 April 15

మహారాష్ట్రలో 3వేలకు చేరువలో కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. రోజుకు వందల్లో కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 232 మందికి కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య  2,916కు పెరిగింది. అలాగే తొమ్మిది కొత్త మరణాలు సంభవించగా.. మొత్తం మృతులు 187కు చేరుకున్నారు.

తాజాగా సంభవించిన తొమ్మిది మరణాల్లో పుణెలో ఆరుగురు, ముంబయిలో ఇద్దురు, అకోలా జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే తాజాగా వైరస్​ నుంచి మరో 36 మంది కోలుకోగా.. మొత్తం సంఖ్య 295కు చేరింది. 

20:31 April 15

మధ్యప్రదేశ్​లో మొత్తం కరోనా కేసులు 938కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య 53కి పెరిగింది. 

20:24 April 15

మహారాష్ట్రలో మరో 232 కేసులు ...

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ మరో 232 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 2916కు చేరింది. ఇప్పటివరకు 295 మంది కోలుకున్నారు. ఇవాళ మరో 9 మరణాలతో.. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 187కి చేరింది.  

20:19 April 15

జీ-20 దేశాల పెద్ద మనసు...

ప్రపంచ పేద దేశాలకిచ్చిన రుణాల వసూలును తాత్కాలికంగా నిలిపివేసేందుకు అంగీకరించాయి జీ-20 దేశాలు. కొవిడ్​-19 వైరస్​పై పోరులో ఆయా దేశాలకు మద్దతుగా నిలవనున్నట్లు స్పష్టం చేశాయి. 

20:13 April 15

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో కరోనా తీవ్రంగా ఉంది. ఈ నగరంలో కేసులు 591కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 

20:05 April 15

ఎగుమతులు ప్రారంభం..

లాక్​డౌన్​ 2.O.కు సంబంధించి కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం.. ఎగుమతులు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ ప్రధాన ఉత్పత్తులైన బియ్యం, మాంసం, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్​ ఆహారపదార్థాల ఎగుమతులు ప్రారంభించింది.   

20:05 April 15

ఉపరాష్ట్రపతి సూచనలు...

లాక్‌డౌన్‌ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన

రైతులు, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ఉపరాష్ట్రపతి

రైతులతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలి: వెంకయ్యనాయుడు

రైతుల నుంచే వ్యవసాయ ఉత్పత్తులు కొనే ఏర్పాట్లు చేయాలి: ఉపరాష్ట్రపతి

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశమైన ఉపరాష్ట్రపతి 

లాక్‌డౌన్ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ

రైతులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర మంత్రి

19:58 April 15

ఆ జర్నలిస్టు అరెస్టు..

నిన్న జరిగిన బాంద్రా ఘటనకు సంబంధించిన టీవీ జర్నలిస్టును అరెస్టు చేశారు ముంబయి పోలీసులు. రైళ్లు పునఃప్రారంభం అవుతాయని తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు ముంబయి జోన్​-IX డీసీపీ అభిషేక్​ తెలిపారు. 

బాంద్రాలో మంగళవారం భారీ ఎత్తున వలస కార్మికులు రోడ్లపైకి వచ్చారు. లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉన్నందును వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. 

19:38 April 15

ఇరాన్​లో రెట్టింపు మరణాలు!

అధికారికంగా ఇప్పటివరకు ఇరాన్​లో 4777 మంది కరోనా కారణంగా మరణించారు. ఇవాళ మరో 94 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. అధికారికంగా ప్రకటించిన వాటికంటే దేశంలో రెట్టింపు మరణాలు నమోదై ఉండొచ్చని పార్లమెంట్​ రిపోర్టు వెల్లడించింది. ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడం గమనార్హం. 

19:35 April 15

జమ్మూలో మరో 22 మందికి..

  • జమ్ముకశ్మీర్​లో ఇవాళ మరో 22 మందికి కరోనా సోకింది. ఇక్కడ మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 300కు చేరింది.
  • ఉత్తరాఖండ్​లో ఇవాళ ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. మొత్తం కేసులు 37 వద్ద స్థిరంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
  • చండీగఢ్​లో ఇప్పటివరకు 21 మందికి వైరస్​ సోకింది.

19:33 April 15

బ్రిటన్​లో మరో 761 మరణాలు..

యూకేలో ఇవాళ మరో 761 మంది కొవిడ్​ కారణంగా మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 12 వేల 868కి చేరింది. కొత్తగా 4 వేల 603 మందికి వైరస్​ సోకింది. 

19:19 April 15

డౌన్​లోడ్లలో ఆరోగ్య సేతు రికార్డు..

కరోనా వైరస్​పై సమాచారం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఆరోగ్య సేతు' యాప్​ డౌన్​లోడ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 13 రోజుల్లోనే 5 కోట్ల మంది డౌన్​లోడ్​ చేసుకున్నట్లు నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ వెల్లడించారు. ప్రపంచంలోనే అతి వేగంగా ఒక యాప్​నకు ఇన్ని డౌన్​లోడ్లు రావడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

'' టెలిఫోన్​ వినియోగదారుల సంఖ్య 5 కోట్లకు చేరేందుకు 75 సంవత్సరాలు పట్టింది. రేడియోకు 38 ఏళ్లు, టెలివిజన్​కు 13 ఏళ్లు, ఇంటర్నెట్​కు 4 సంవత్సరాలు, ఫేస్​బుక్​కు 19 నెలలు, పోకే​మాన్​ గో- 50 మిలియన్ల డౌన్​లోడ్లకు 19 రోజులు పట్టింది. భారత ప్రభుత్వం రూపొందించిన యాప్​- ఆరోగ్య సేతు 13 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే రికార్డు.''

          -అమితాబ్​ కాంత్​, నీతి ఆయోగ్​ సీఈఓ

ఈ యాప్​ను ప్రతి ఒక్కరూ డౌన్​లోడ్​ చేసుకోవాలని.. జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగంలో కోరారు భారత ప్రధాని మోదీ.

19:01 April 15

హాట్​స్పాట్​ల జాబితా విడుదల..

దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల జాబితా విడుదల చేసిన కేంద్రం

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచన

సద్వినియోగం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లను కోరిన కేంద్రం

ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

28 రోజుల పాటు ఒక్క కేసు నమోదు కానిపక్షంలో గ్రీన్‌జోన్‌లోకి హాట్​స్పాట్

హాట్‌స్పాట్ జిల్లాలు, కంటైన్మెంట్ జోన్ల వివరాలను రాష్ట్రాలకు పంపిన కేంద్రం

18:58 April 15

ముంబయిలో ఇవాళ మరో 183 కరోనా కేసులు వెలుగుచూశాయి. 2 కొత్త మరణాలతో నగరంలో మృతుల సంఖ్య 113కు చేరింది. మొత్తం కేసులు 1936గా ఉన్నాయని బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ తెలిపింది. 

18:49 April 15

కొవిడ్​ బాధితులకు ప్లాస్మా పద్ధతిలో చికిత్స...

కరోనా తీవ్రంగా ఉన్న బాధితులకు ట్రయల్​ ప్రాతిపదికన ప్లాస్మా పద్ధతిలో చికిత్స అందించేందుకు దిల్లీ సిద్ధమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి.. కొవిడ్​ బాధితులకు చికిత్స అందించాలని దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ తెలిపారు.  

ప్లాస్మా పద్ధతిలో క్లినికల్​ ట్రయల్స్​ను దిల్లీ ఐఎల్​బీఎస్​లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

18:42 April 15

కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న కారణంగా కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒకే కరోనా కేసు నమోదైందని వెల్లడించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 387కు చేరగా.. 167 యాక్టివ్​ కేసులే ఉన్నట్లు తెలిపారు. 

తమిళనాడులో మరో 2 మరణాలు..

తమిళనాడులో ఇవాళ మరో 38 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1242కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విజయ్​భాస్కర్​ తెలిపారు.

పంజాబ్​లో మరో ఇద్దరు కరోనా బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 186కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. 

18:15 April 15

అమెరికాపై రష్యా ఫైర్​

డబ్ల్యూహెచ్​ఓకు నిధులు నిలిపివేసిన అమెరికాపై రష్యా మండిపడింది. గడ్డు పరస్థితుల్లోనూ అగ్రరాజ్యం స్వార్థపూరిత వైఖరి కనబరిచిందని విమర్శించింది. 

17:49 April 15

400 జిల్లాల్లో కరోనా లేదు: హర్షవర్ధన్​

కరోనా పట్ల వెంటనే అప్రమత్తమైన దేశాల జాబితాలో భారత్​ ముందువరుసలో ఉంటుందని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్​. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా డబ్ల్యూహెచ్ఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి. జనవరి 7న తొలుత కరోనా నిర్ధరణ అయిన వెంటనే.. భారత్​ ముందస్తు నివారణ చర్యలు వేగంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. జనవరి 8 నుంచే నిపుణులతో సమీక్షలు నిర్వహించామని..  హెల్త్​ అడ్వైజరీ జారీ చేశామని ఆయన వెల్లడించారు. 

దేశంలోని దాదాపు 400 జిల్లాలకు అసలు కరోనా వ్యాపించలేదని.. సమగ్ర చర్యల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కరోనాపై పోరులో రాబోయే 2-3 వారాలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు హర్షవర్ధన్​.   

17:36 April 15

ఉత్తర్​ప్రదేశ్​లో ఇవాళ మరో ముగ్గురు కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. బాధితుల సంఖ్య 727కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.  

17:31 April 15

కర్ణాటకలో మరొకరు మృతి..

బెళగావిలో 80 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతిచెందగా.. కర్ణాటకలో మొత్తం మరణాల సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 279 మందికి కొవిడ్​-19 వైరస్​ సోకగా.. 80 మంది కోలుకున్నారు. 

17:22 April 15

దేశంలో కరోనా మరణాల సంఖ్య 392కు చేరింది. కేసుల సంఖ్య 11 వేల 933కు చేరగా.. ప్రస్తుతం 10 వేల 197 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 1343 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. 

17:01 April 15

1076 కొత్త కేసులు...

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1076 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

బంగాల్​లో గత 24 గంటల్లో 12 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 132కు చేరినట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. ఇప్పటివరకు బంగాల్​లో ఏడుగురు మరణించారు. 

హిమాచల్​ ప్రదేశ్​లో 33 కరోనా కేసులుండగా.. 12 మంది కోలుకున్నారు. మరొకరు మరణించారు. ప్రస్తుతం రాాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 16గా ఉంది.  

త్రిపురలో తొలి కరోనా బాధితుడిని డిశ్చార్జి చేశారు. వరుసగా 3 పరీక్షల్లో కరోనా నెగిటివ్​గా వచ్చిన కారణంగా ఆయనను పంపించేేశారు.  

రాజస్థాన్​లో ఇవాళ 41 కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 1046కు చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

హరియాణాలో మరో ఆరుగురు వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 190కి చేరింది. ఇక్కడ ఇద్దరు మృతిచెందారు. 

గుజరాత్​లో మరో 56 కేసులతో బాధితుల సంఖ్య 695కు చేరింది. మృతుల సంఖ్య 30గా ఉంది. 

అసోంలో ఇప్పటివరకు 32 మందికి కరోనా సోకింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

16:49 April 15

'వెయ్యేళ్లకోసారి అలా సాధ్యం..'

చైనాలో చేసిన పరిశోధనల ప్రకారం... కరోనా గబ్బిలాల్లో ఒకదానినుంచి మరొకదానికి సోకినట్లు తేలిందని ఐసీఎంఆర్​ శాస్త్రవేత్త గంగాఖేడ్కర్​ తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. గబ్బిలాల నుంచి పాంగోలిన్లకు, వాటి నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు.  

ఐసీఎంఆర్​ కూడా దీనిని పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రెండు రకాలున్నాయని.. గబ్బిలాలకు కరోనా వైరస్​ను మనుషులకు వ్యాపింపజేసే సామర్థ్యం లేదని గంగాఖేడ్కర్​ తెలిపారు. అయితే.. వెయ్యి సంవత్సరాలకొకసారి ఇలా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఆయన మీడియాకు వెల్లడించారు. 

16:41 April 15

170 జిల్లాలు హాట్​స్పాట్​లు..

దేశవ్యాప్తంగా 170 జిల్లాల్ని కరోనా హాట్​స్పాట్​లుగా ప్రకటించింది కేంద్రం. దేశంలో మొత్తం జిల్లాల్ని హాట్​స్పాట్​, హాట్​స్పాట్​యేతర, గ్రీన్​జోన్లుగా విభజించింది. హాట్​స్పాట్​యేతర ప్రాంతాలుగా మరో 207 జిల్లాలను పేర్కొంది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. ఏప్రిల్‌ 20 తర్వాత హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా సామూహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి చేరలేదని  స్పష్టం చేశారు. కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

16:30 April 15

రైల్వే ద్వారా అత్యవసరాల సరఫరా..

కరోనా కారణంగా రైళ్ల సేవలు నిలిచిపోయాయి. అయితే.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా చేరవేయాల్సిన అత్యవసరాలను సరఫరా చేసేందుకు భారతీయ రైల్వే పార్శిల్​ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం.. ఇవి 65 రూట్లలో నడుస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్​ 14 వరకు 507 రైళ్లను నడిపినట్లు స్పష్టం చేసింది. 

ఈ లాక్​డౌన్​ కాలంలో దాదాపు 20 వేల 400 టన్నుల సరుకులు సరఫరా చేసినట్లు తెలిపిన రైల్వే బోర్డు.. దీని ద్వారా 7.54 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. 

16:12 April 15

కరోనాపై కేంద్రం మీడియా సమావేశం...

దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేశాం: కేంద్రం

దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా విభజించాం: లవ్‌ అగర్వాల్‌

హాట్‌స్పాట్‌ జిల్లాలు, హాట్‌స్పాట్‌ యేతర జిల్లాలు, గ్రీన్‌ జోన్‌ జిల్లాలుగా విభజన: లవ్‌ అగర్వాల్‌

గడిచిన 24 గంటల్లో యూపీలో 70 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు: లవ్‌ అగర్వాల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 727 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది: లవ్‌ అగర్వాల్‌

కరోనా కొత్త కేసుల కోసం శోధించనున్న ప్రత్యేక బృందాలు.. అనంతరం పరీక్షల నిర్వహణ

16:07 April 15

రాజస్థాన్​లో ఇవాళ 41 కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 1046కు చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

హరియాణాలో మరో ఆరుగురు వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 190కి చేరింది. ఇక్కడ ఇద్దరు మృతిచెందారు. 

గుజరాత్​లో మరో 56 కేసులతో బాధితుల సంఖ్య 695కు చేరింది. మృతుల సంఖ్య 30గా ఉంది. 

అసోంలో ఇప్పటివరకు 32 మందికి కరోనా సోకింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

15:56 April 15

ఛత్తీస్​గఢ్​లో ఓ 3 నెలల పసికందు బాగోగులు చూస్తున్నారు ఎయిమ్స్​ రాయ్​పూర్​ నర్సులు. ఆ పాప తల్లికి కరోనా సోకగా అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పసిపాపను ఆడిస్తున్నారు వైద్య సిబ్బంది.   

15:29 April 15

ఓ వ్యక్తి కొవిడ్​ బారిన పడ్డారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన వైద్య సిబ్బందిపై కొందరు రాళ్లదాడి చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మొరాదాబాద్​లో జరిగింది. ఇంకా కొందరు డాక్టర్లు అక్కడే ఉన్నారని, తామంతా గాయపడ్డామని తెలిపాడు అంబులెన్స్​ డ్రైవరు. 

ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్​ఎస్​పీ అమిత్​ పాఠక్​​ తెలిపారు.  

15:07 April 15

దిల్లీ హైకోర్టు పరిధిలో కార్యకలాపాలు నిలిపివేత..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మే3 వరకు పొడిగించిన నేపథ్యంలో.. అప్పటివరకు తమ పరిధిలోని న్యాయస్థానాల కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది దిల్లీ హైకోర్టు.

15:04 April 15

మహారాష్ట్రలో మరో 117 కేసులు..

దేశంలో కరోనా తీవ్రంగా మహారాష్ట్రలో ఇవాళ మరో 117 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో 66, పుణెలో 44 మంది కొత్తగా వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 2801కి చేరింది. 

15:00 April 15

18 ఏళ్ల కనిష్ఠానికి డబ్ల్యూటీఐ చమురు ధరల సూచీ..

కరోనా దెబ్బకు ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ముడిచమురు ధరలు కూడా పతనమవుతున్నాయి. తాజాగా ముడి చమురు ధరల సూచీ డబ్ల్యూటీఐ 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. బ్యారెల్​ ధర 19 డాలర్లకు చేరింది. కరోనాతో క్రూడ్​ డిమాండ్​ తగ్గడమే దీనికి ప్రధాన కారణం. 

14:49 April 15

మళ్లీ తగ్గిన మరణాలు..

స్పెయిన్​లో మరోసారి కరోనా మరణాలు తగ్గాయి. ఇవాళ మరో 523 మంది కొవిడ్​ కారణంగా చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 3 వేల 500 మందికిపైగా వైరస్​ సోకగా.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 77 వేల 600 దాటింది. 

బెల్జియంలో మృతుల సంఖ్య 4 వేల 440కి చేరింది. ఇవాళ మరో 283 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు. 

14:45 April 15

కాంగ్రెస్​ కౌన్సిలర్​కూ కరోనా...

గుజరాత్​లో ఓ కాంగ్రెస్​ కౌన్సిలర్​కు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో నిన్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే వైరస్​ బారినపడ్డారు. ప్రజాప్రతినిధులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

14:44 April 15

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. డబ్ల్యూహెచ్​ఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. కొవిడ్​ నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. 

14:32 April 15

ఐరోపాలో 10 లక్షలు దాటిన కేసులు...

ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఒక్క ఐరోపాలోనే కొవిడ్​-19 కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా.. లక్షా 26 వేల మందికిపైగా మరణించారు. 

14:22 April 15

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐపీఎల్​ నిరవధికంగా వాయిదా పడినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

13:55 April 15

డబ్ల్యూహెచ్​ఓకు అమెరికా నిధులు నిలిపివేయడంపై చైనా స్పందించింది. డొనాల్డ్​ ట్రంప్​ నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది.

13:36 April 15

'సీఎంకు కరోనా లక్షణాల్లేవ్​'

స్వీయ నిర్బంధంలో ఉన్న గుజరాత్​ ముఖ్యమంత్రికి కరోనా లక్షణాలు లేనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముందు జాగ్రత్త చర్యగా.. బయటివ్యక్తిని ఆయన నివాసంలోకి అనుమతించట్లేదని సీఎం కార్యదర్శి వెల్లడించారు. వారం రోజుల పాటు.. ముఖ్యమంత్రి వేరెవరినీ కలవరని కలవరని సీఎం కార్యాలయం ప్రకటన వెలువరించింది.  

ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఓ శాసనసభ్యునికి కరోనా సోకగా రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే సీఎంకు కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు.  

13:34 April 15

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి లేఖ...

లాక్​డౌన్​ 2.O. తాజా మార్గదర్శకాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా లేఖ రాశారు. లాక్​డౌన్​ నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయాలని కోరారు.  

13:23 April 15

వలస కూలీల వేతనాల పిటిషన్​పై సుప్రీం విచారణ..

  • వలస కూలీలకు వేతనాలు చెల్లించాలని దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • వలస కూలీలకు వేతనాలు, రక్షణ కల్పించాలని పిటిషన్ వేసిన స్వామి అగ్నివేశ్
  • కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్
  • ఎప్పటికప్పుడూ రాష్ట్రాలతో చర్చిస్తూ కేంద్రం ఆదేశాలు ఇస్తుందని తెలిపిన ఎస్‌జీ
  • సొలిసిటర్ జనరల్ వాదనలను రికార్డుల్లోకి తీసుకున్న సుప్రీంకోర్టు
  • పిటిషన్‌పై విచారణను ముగించిన జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం

13:22 April 15

వైద్య సిబ్బంది రక్షణ పిటిషన్​పై సుప్రీం విచారణ...

నర్సులు, వైద్య సిబ్బంది రక్షణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

వైద్య సిబ్బంది రక్షణ, భద్రత కోసం ప్రొటోకాల్ రూపొందించాలని పిటిషన్

పిటిషన్ వేసిన యునైటెడ్ నర్సెస్, ఇండియన్ ప్రొఫెషనల్ నర్సెస్ అసోసియేషన్లు

ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సొలిసిటర్ జనరల్

ఫిర్యాదు అందిన 2 గంటల్లో సిబ్బందికి పరిష్కారం చూపిస్తామని తెలిపిన ఎస్‌జీ

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ హామీతో విచారణ ముగించిన సుప్రీంకోర్టు

13:04 April 15

మరో 17 కేసులు..

కర్ణాటకలో ఇవాళ మరో 17 మందికి కరోనా సోకినట్లు వెల్లడించారు ఆరోగ్య మంత్రి శ్రీరాములు. వీరిలో 9 మంది మైసూరు ఫార్మా కంపెనీలో పనిచేసేవారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 277 మందికి వైరస్​ సోకగా.. 75 మంది కోలుకున్నారు. చిక్కబళ్లాపురకు చెందిన ఓ 69 ఏళ్ల వ్యక్తి ఇవాళ మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. 

12:56 April 15

పాకిస్థాన్​లో 6 వేలకు చేరువలో కేసులు..

దాయాది దేశం పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 6 వేలకు చేరువైంది. ఇవాళ మరో 272 మందికి వైరస్​ సోకగా.. బాధితుల సంఖ్య 5 వేల 988కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అమల్లో లాక్​డౌన్​ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. 

దేశంలో ఇప్పటివరకు 107 మంది కరోనా బారిన పడి మరణించగా.. మరో 1446 మంది కోలుకున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పాక్​లో ఇప్పటివరకు 73 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించిటన్లు పేర్కొన్నారు. 

12:46 April 15

లాక్​డౌన్​ 2.O. మార్గదర్శకాలు

లాక్​డౌన్​కు సంబంధించిన నూతన మార్గదర్శకాలను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. ఆంక్షలు అమల్లో ఉండేవేంటో, కేంద్రం వేటికి అనుమతి ఇచ్చింది.. వేటికి నిరాకరించింది.. ఏ ఏ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయో తెలుసుకోండి. 

12:37 April 15

భారీగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం...

ఆహార పదార్థాల ధరలు భారీగా పతనమైన కారణంగా.. దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 1 శాతానికి తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 2.26 శాతంగా ఉంది.  

12:33 April 15

ఆ పిటిషన్​ విచారణకు సుప్రీం నో....

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఒక ప్రాంతానికి ఉద్దేశించి ఉన్నందున దిల్లీ హైకోర్టుకు వెళ్లాలని జస్టిస్​ ఎన్​.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. 

  • పిటిషన్ దాఖలు చేసిన దిల్లీ సఫాయి కరమచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ హర్మన్‌సింగ్
  • పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపిన సొలిసిటర్ జనరల్
  • వైద్యులు, సిబ్బంది రక్షణకు కూడా చర్యలు తీసుకున్నామని తెలిపిన ఎస్‌జీ
  • పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక రక్షణ సామగ్రి ఇచ్చినట్లు తెలిపిన ఎస్‌జీ
  • డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్

12:24 April 15

కరోనా బాధితురాలు ఆత్మహత్య...!

ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల ఆ మహిళ.. తీవ్ర మనోవేదనకు గురై ఆసుపత్రి బాత్​రూమ్​లో గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిబ్బంది చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

12:20 April 15

కర్ణాటకలో మరొకరు మృతి..

చిక్కబళ్లాపురకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందగా.. కర్ణాటకలో కొవిడ్​ మరణాల సంఖ్య 11కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు వెల్లడించారు.  

12:13 April 15

ఆ ఆసుపత్రిని మూసేసిన చైనా...

చైనాలో క్రమంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో వుహాన్​లో నిర్మించిన కొవిడ్​ ప్రత్యేక ఆసుపత్రి మేక్​షిఫ్ట్​ను ప్రభుత్వం మూసివేసింది. ఈ 1000 పడకల ఆసుపత్రిని 10 రోజుల్లోనే నిర్మించడం విశేషం. 

తొలుత చైనాలో రోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం రెండంకెలను దాటట్లేదు. దాదాపు అక్కడ వైరస్​ను నివారించినట్లు సమాచారం. ఫలితంగా.. అక్కడ సాధారణ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఆ దేశం కఠిన చర్యలు అమలు చేసింది. వుహాన్​లో జనవరి 23 నుంచి అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్​డౌన్​ను ఏప్రిల్​ 8న ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.  

12:06 April 15

స్వీయ నిర్బంధంలోకి గుజరాత్​ సీఎం...

గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎం ఇటీవల నిర్వహించిన సమావేశానికి హాజరైన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమానికి ఇతర మంత్రులు కూడా హాజరు కావటం వల్ల రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

11:53 April 15

ఇండోర్​లో మరో 117 మందికి...

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఒక్క నగరంలోనే ఇవాళ మరో 117 కేసులు వెలుగుచూశాయి. ఇక్కడ మొత్తం బాధితుల సంఖ్య 544కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ఇప్పటికే 37 మంది మరణించారు. 

11:48 April 15

మరో ఆరుగురికి...

మేఘాలయలో మొట్టమొదటి కరోనా బాధితుని నుంచి మరో ఆరుగురికి కరోనా సోకినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా. వీరంతా ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, సహాయకులని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు పేర్కొన్నారు. మరో ఆరు నమూనాలను తిరిగి పరీక్షించనున్నట్లు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఆ తొలి కరోనా బాధితుడు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే మేఘాలయలో మొదటి కరోనా మరణం.  

11:41 April 15

రాష్ట్రాల సీఎస్​లతో రాజీవ్​ గౌబా వీడియో కాన్ఫరెన్స్​..

  • కరోనాపై దిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్‌
  • వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌
  • మే 3 వరకు లాక్‌డౌన్‌ పటిష్ట అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
  • ఈనెల 20నుంచి ఇవ్వనున్న కొన్ని మినహాయింపులు తదితర అంశాలపై సమీక్ష

11:24 April 15

20 లక్షలు దాటిన కేసులు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు వైరస్​ బారిన పడ్డ వారి సంఖ్య 20 లక్షలు దాటింది. లక్షా 26 వేల 757 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 84 వేల 640 మంది కోలుకున్నారు. 

  • మొత్తం కేసుల్లో ఐరోపా దేశాల్లోనే కేసులు 9 లక్షల 37 వేలు దాటాయి. ఇక్కడ మరణాల సంఖ్య 83 వేల 730.
  • ఆసియాలో 3 లక్షల పైచిలుకు కేసులు, 11 వేల 700కుపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలోనే 26 వేల మందికిపైగా మరణించారు. దేశంలో కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.

భారత్​లో కరోనా కేసులు 11 వేల 439కి చేరాయి. ఇప్పటివరకు 1306 మంది కోలుకోగా... 377 మంది ప్రాణాలు కోల్పోయారు. 

11:10 April 15

జర్నలిస్ట్​పై కేసు...

ముంబయిలో ఓ టీవీ జర్నలిస్ట్​పై బాంద్రా పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. రైళ్ల సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని ఆ పాత్రికేయుడు తెలిపిన కారణంగానే.. బాంద్రాలో మంగళవారం సాయంత్రం వలస కార్మికులు భారీగా గుమికూడి ఉండొచ్చని వెల్లడించారు. 

ఈ ఘటనలో వేలమంది కార్మికులు రోడ్లపైకిరాగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. 

10:57 April 15

మరో 2 మరణాలు...

గుజరాత్​లో ఇవాళ మరో 56 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఇద్దరు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు గుజరాత్​లో మొత్తం బాధితుల సంఖ్య 695కు చేరగా... 30 మంది ప్రాణాలు విడిచారు.  

10:49 April 15

లాక్​డౌన్​ 2.0 మార్గదర్శకాలు...

మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. మే 3 వరకు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య ప్రజా రవాణాపై నిషేధం కొనసాగనుంది. మెట్రో, బస్సు సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 

ఇవి తప్పనిసరి...

  • బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు
  • బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమిగూడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే
  • వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి
  • మద్యం, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు పూర్తిగా నిషేధం

అవి బంద్​లోనే...

  • మే 3 వరకు సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు మూసివేత
  • మే 3 వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేత
  • విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు రద్దు
  • మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం

నిరాకరణ...

అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ

వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ

ప్రత్యేక మార్గదర్శకాలు...

  • హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్న ఆరోగ్యశాఖ
  • హాట్‌స్పాట్‌ జోన్లను ప్రకటించనున్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు
  • హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవు: కేంద్రం
  • నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు: కేంద్రం
  • మార్గదర్శకాలను రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగం అమలు చేయాల్సిందే: కేంద్రం
  • విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి: కేంద్రం

వీటికి అనుమతులు..

  • నిబంధనల మేరకు నిర్దేశిత పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు
  • రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి
  • ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీలకు అనుమతి
  • వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
  • వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
  • పంటకోత యంత్రాల రవాణాకు అనుమతులు
  • ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతులు
  • దాణా సరఫరా, ఆక్వా హేచరీస్‌కు అనుమతులు
  • అనాధ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
  • ఈ-కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి
  • గోదాములు, శీతల గోదాములకు అనుమతి
  • ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్‌, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి
  • నిర్మాణ రంగాల్లో...
  • గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి
  • భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
  • పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అందుబాటులో ఉన్న కూలీలతోనే పనులకు అనుమతి

కూలీలు....

  • ఏప్రిల్‌ 20 నుంచి ఉపాధి హామీ పనులకు అనుమతులు
  • ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలి
  • ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ

యథాతథం..

  • ఆస్పత్రులు, టెలీమెడిసిన్‌ సర్వీసులు యథాతథం
  • ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం
  • ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథం
  • బ్యాంకుల కార్యకలాపాలు యథాతథం
  • ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం
  • ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి

10:46 April 15

1000 దాటిన కేసులు..

రాజస్థాన్​లో ఇవాళ మరో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1034కు చేరినట్లు రాజస్థాన్​ అదనపు ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. అక్కడ ఇప్పటివరకు 11 మంది కొవిడ్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. జైపుర్​లో అత్యధికంగా 468 మందికి కరోనా సోకింది. 

10:30 April 15

వాళ్లను తీసుకురావాలి: రాహుల్​

కరోనా వైరస్​ కారణంగా వేలాది మంది భారత కార్మికులు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయారని అన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. తీవ్రమనోవేదనకు గురవుతున్న వారిని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యేక విమానాలను పంపించాలని ట్విట్టర్​ వేదికగా కోరారు. 

10:15 April 15

మేఘాలయలో తొలి కరోనా మరణం

దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. మేఘాలయలో కరోనా సోకిన ఒకే ఒక్క వ్యక్తి మరణించినట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా వెల్లడించారు. మృతుడు డాక్టర్​ కావడం గమనార్హం. 

10:11 April 15

న్యూయార్క్​లో 10 వేలు దాటిన మరణాలు..

అమెరికాలో కరోనా మరింత ప్రమాదకరంగా మారుతోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,129 మంది మరణించినట్లు జాన్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అగ్రరాజ్యంలో మొత్తం మృతుల సంఖ్య 26 వేలు దాటగా.. కేసులు 6 లక్షల 14 వేలను మించిపోయాయి. 

వైరస్​కు కేంద్ర బిందువుగా ఉన్న ఒక్క న్యూయార్క్​లోనే మృతుల సంఖ్య 10 వేలు దాటినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

10:07 April 15

ఏప్రిల్​ 20 నుంచి వాటికి అనుమతి...

  • ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు మండీలకు అనుమతి
  • ఆస్పత్రులు, టెలీమెడిసిన్‌ సర్వీసులు యథాతథం
  • ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం
  • ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథం
  • వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
  • వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
  • వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
  • విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
  • సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు మూసివేత
  • మే 3 వరకు స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేత
  • సామాజిక, రాజకీయ, క్రీడలు, మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు మూసివేత

10:01 April 15

మే 3 వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులు రద్దు

  • హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ
  • హాట్‌స్పాట్‌ జోన్లను ప్రకటించనున్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు
  • హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవు: కేంద్రం
  • నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు
  • మార్గదర్శకాలను రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగం అమలు చేయాల్సిందే: కేంద్రం
  • విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి: కేంద్రం
  • మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
  • అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ
  • వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
  • నిబంధనల మేరకు నిర్దేశిత పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు

09:36 April 15

లాక్​డౌన్​ మార్గదర్శకాలు విడుదల...

లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం... ఇవాళ దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

లాక్​డౌన్​ 2.0 మార్గదర్శకాలు విడుదల

  • లాక్​డౌన్​​ రెండో దఫా అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
  • కరోనా నియంత్రణే లక్ష్యంగా లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించడానికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఏప్రిల్​ 20 నుంచి కొన్ని నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ, మరికొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటి ప్రకారం...
  • మే 3 వరకు అంతర్రాష్ట్ర, అంతర్​ జిల్లాల మధ్య ప్రజా రవాణా నిషేధం అమల్లో ఉంటుంది. మెట్రో, బస్సు సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగుతాయి.
  • మే 3 వరకు సినిమా హాళ్లు, షాపింగ్​ మాల్స్, జిమ్​లు, స్పోర్ట్ కాంప్లెక్స్​లు, ఈత కొలనులు, బార్లు మూసే ఉంచాలి.
  • విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రైళ్లు మే 3 వరకు బంద్.
  • బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా.

09:35 April 15

ఇవాళ సాయంత్రం కేబినెట్​ భేటీ..

  • సాయంత్రం 5.30గం.కు కేంద్ర కేబినెట్ సమావేశం
  • ప్రధాని నివాసంలో భేటీకానున్న కేంద్ర మంత్రివర్గం

08:51 April 15

అమెరికాలో రికార్డు స్థాయి మరణాలు

అమెరికాలో కరోనా మహమ్మారి మరింత విజృంభించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,129 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో మొత్తం మృతుల సంఖ్య 25 వేలు దాటింది. మరో 6 లక్షల 5 వేల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

08:36 April 15

మహారాష్ట్రలో 3వేలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. 24 గంటల్లోనే 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,076 మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 11,439
  • యాక్టివ్ కేసులు: 9,756
  • కోలుకున్నవారు: 1,305
  • మరణాలు: 377
  • వలస వెళ్లిన వారు: 1
Last Updated : Apr 15, 2020, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details