తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు సున్నా

CORONA
కరోనా

By

Published : Apr 13, 2020, 8:30 AM IST

Updated : Apr 13, 2020, 10:54 PM IST

21:27 April 13

డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్వైన్​ ఫ్లూతో పోల్చితే కొవిడ్-19 పది రెట్లు ప్రమాదకరమైందని అభిప్రాయపడింది.

21:25 April 13

'మహా' విపత్తు

మహారాష్ట్రలో కొత్తగా 352 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,334కు చేరింది. ఇప్పటివరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 

21:19 April 13

న్యూయార్క్​లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వైరస్​ సోకి ఇప్పటివరకు 10 వేల మందికిపైగా మరణించారు. 

20:05 April 13

మరో 150 కేసులు...

ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 150 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయి నగరంలోనే మృతుల సంఖ్య 100కు చేరగా.. కేసుల సంఖ్య 1549కి పెరిగింది.

19:40 April 13

717 మంది బలి...

బ్రిటన్​లో కరోనా ధాటికి మరో 717 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 11,329కి చేరింది.

17:59 April 13

24 గంటల్లో 51 మంది మృతి...

దేశంలో గత 24 గంటల్లో కరోనా ధాటికి 51 మంది మృతి చెందగా.. 905 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 9352కు చేరగా.. మృతుల సంఖ్య 324కు పెరిగింది.

17:16 April 13

  • ప్రధానికి మరో లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
  • ఆహార భద్రతా చట్టానికి అనుగుణంగా పేదలకు ఆహార సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సోనియా.
  • ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు చేయూత అందించేందుకు అమలు చేస్తోన్న ఉచిత సరఫరా పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగించాలని కోరిన సోనియాగాంధీ.
  • రేషన్ కార్డులు లేని వారికి కూడా 10 కేజీల ఆహార సరఫరా అందించాలని సోనియా సూచన.
  • లాక్​డౌన్​ పరిస్థితుల్లో వలస కూలీల వద్ద ఆహార భద్రత కార్డులు ఉండే అవకాశం లేనందున... వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు.
  • ప్రస్తుత పరిస్థితి ఎన్నో కుటుంబాలను ఆహార అభద్రత స్థితిలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేసిన సోనియా.

17:11 April 13

6 వారాలకు సరిపడా టెస్టింగ్‌ కిట్లు: కేంద్రం

దేశంలో గడిచిన 24 గంటల్లో 796 కరోనా పాజిటివ్‌ కేసులు, 35 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,152కి చేరింది. మరణాల సంఖ్య 308కి చేరిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 857 మంది కరోనా బారి నుంచి కొలుకుని డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.

ఇప్పటి వరకు 2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కు చెందిన అధికారి రమణ్‌ ఆర్‌ గంగా ఖేద్కర్‌ వెల్లడించారు. టెస్టింగ్‌ కిట్ల విషయంలో సరిపడా స్టాక్‌ ఉందని, ప్రస్తుతం మరో ఆరు వారాలకు సరిపడా కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చైనా నుంచి తొలివిడతగా బయల్దేరిన టెస్టింగ్‌ కిట్లు ఈ నెల 15 కల్లా భారత్​ చేరుకుంటాయని చెప్పారు. గతంలో కరోనా కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య లారీల రవాణాకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.

16:49 April 13

'ఆ జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు సున్నా'

దేశంలో 15 రాష్ట్రాల్లో గతంలో కేసులు నమోదైన 25 జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా ఒక్క కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, జిల్లాల్లోని కమాండ్​ సెంట్రల్​ చర్యల వల్ల కరోనా నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ తెలిపారు.

చైనా నుంచి రావాల్సిన కరోనా పరీక్ష కిట్లు ఈనెల 15న భారత్​ చేరుకుంటాయని భారతీయ వైద్య పరిశోధన మండలి అధికారి రామన్​ ఆర్​ గంగాఖేద్కర్​ తెలిపారు. 

16:18 April 13

తమిళనాడులో ఈనెల 30 వరకు లాక్​డౌన్ పొడిగింపు

దేశవ్యప్తంగా విధించిన లాక్​డౌన్​ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్​డౌన్​ పొడిగిస్తున్నాయి. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు పొడిగించగా.. తాజాగా తమిళనాడు ఈనెల 30 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 

16:13 April 13

'ఇప్పటి వరకు 2 లక్షల మందికి కరోనా పరీక్షలు'

కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ తెలిపారు. మరో 6 వారాలపాటు పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 2లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

కేంద్ర తీసుకున్న చర్యలతో ప్రజలందరికీ నిత్యావసరాలు అందుతున్నాయని.. నిత్యావసరాల రంగాల్లో పనిచేసే కూలీలు, కార్మికులను అడ్డుకోవద్దని సూచించారు. అన్ని జన్​ధన్​ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసినట్లు తెలిపారు.  

16:02 April 13

ఆ రాష్ట్రంలో 5వ రోజూ కరోనా కేసులు సున్నానే

దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్​లో అసతు కొత్త కేసులు నమోదు కాకపోవటం గమనార్హం. వరుసగా 5వ రోజూ ఒక్క పాజిటివ్​ కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ తెలిపారు. 35 మంది కరోనా బారిన పడగా ఇప్పటి వరకు ఏడుగురు కోలుకుని డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. కరోనా వైరస్​ కట్టడికి మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తోంది రావత్​ ప్రభుత్వం. హల్ద్వాని ప్రాంతంలోని వల్లభ్​పురలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఆదివారం వల్లభ్​పురలో జనసంచారం అంధికంగా ఉండటమే కర్ఫ్యూకూ కారణంగా తెలుస్తోంది. 

15:35 April 13

వియాత్నం ప్రధానితో మోదీ చర్చ

వియాత్నం ప్రధానమంత్రి న్గుయెన్​ జువాన్​ ఫుక్​తో  ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. కరోనా వైరస్​ వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించిటనట్లు పీఎంఓ తెలిపింది. మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇరు దేశాలు కలిసిపనిచేస్తూ.. అవరమైన ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 

15:19 April 13

స్పెయిన్​లో 24 గంటల్లో 517 మంది మృతి

స్పెయిన్​లో కరోనా వైరస్​ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్యలో నేడు తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 517 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 17,489 కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1.70లక్షలకు చేరువలో ఉంది. 

15:03 April 13

హరియాణాలో 182 మందికి సోకిన వైరస్​

హరియాణాలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. ఇందులో ప్రస్తుతం 146 మంది చికిత్స పొందుతుండగా.. 34 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. పాజిటివ్​గా తేలిన వారిలో 10 మంది విదేశీయులు, 64 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా..ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,322 నమూనాలను పరీక్షలకు పంపారు. 2,796 నమూనాలు నెగిటివ్​గా తేలాయి. మిగతా 1,344 నమూనాల ఫలితాలు వెలువడలేదు. 

14:55 April 13

రాజస్థాన్​లో 847కు చేరిన కరోనా కేసులు

రాజస్థాన్​లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 43 మందికి పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 847కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 20 జైపుర్​, 11 భరత్​పుర్​, 7 జోధ్​పుర్​లో నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

14:23 April 13

రేపు ప్రధాని ప్రసంగం...

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటితో దేశవ్యాప్త లాక్​డౌన్​ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగిస్తారా లేదా అనే విషయంపై ప్రధాని రేపు స్పష్టత ఇవ్వనున్నారు.

13:05 April 13

ఇంట్లోనే ఉండి ఎంత సులువుగా మాస్కు తయారు చేసుకోవచ్చో చేసి చూపించిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ 

13:00 April 13

కర్ణాటకలో మరో 15...

కర్ణాటకలో ఈరోజు 15 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 247కు చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 59 మంది డిశ్చార్జ్​ కాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

12:28 April 13

కరోనా కలవరం...

మహరాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ఈ రోజు ఆ రాష్ట్రంలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 59 కేసులు ముంబయివే. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2064కు చేరింది.

11:46 April 13

రూ.5 కోట్ల విరాళం...

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ కరోనాపై పోరు కోసం స్వచ్ఛంద సంస్థ 'గివ్​ ఇండియా'కు రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు.

11:39 April 13

క్యూకట్టిన మద్యం ప్రియులు...

అసోం డిబ్రూగడ్​లోని ఓ మద్యం దుకాణం ముందు ప్రజలు బారులు తీరారు. లాక్​డౌన్​ వేళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.​

11:06 April 13

మరో ఇద్దరు...

గుజరాత్​లో కరోనా కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 కొత్త కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 538కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 26 మంది మృతి చెందారు.

10:38 April 13

815కు చేరిన కేసులు...

రాజస్థాన్​లో మరో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 815కు చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

10:00 April 13

.

మోదీ ప్రసంగం..

దేశంలో రేపటితో ముగియనున్న లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నేడు స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నేడు దీనిపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బంగాల్‌  రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

08:28 April 13

కరోనా పంజా: దేశంలో 308కి చేరిన మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • మొత్తం కేసులు: 9,152
  • యాక్టివ్ కేసులు: 7,987
  • కోలుకున్నవారు: 856
  • మరణాలు: 308
Last Updated : Apr 13, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details