తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2020, 8:31 AM IST

Updated : Apr 12, 2020, 10:46 PM IST

ETV Bharat / bharat

సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం

CORONA
కరోనా

22:36 April 12

క్వారంటైన్​ భవంతి నుంచి దూకేశాడు!

కరోనాతో క్వారంటైన్​ కేంద్రంలో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల ఓ వ్యక్తి.. అదే భవంతిలోని ఏడో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో ఆదివారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

22:29 April 12

బంగాల్​లోనూ మాస్కు తప్పనిసరి:

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ, దిల్లీ రాష్ట్రాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది.

22:15 April 12

పెరిగిన వైరస్​ ప్రభావిత ప్రాంతాలు.. 

దిల్లీ ప్రభుత్వం.. కరోనా కేసుల ఆధారంగా వైరస్​ ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తోంది. తాజాగా వాటి సంఖ్య 43కు చేరింది. ఆగ్నేయ దిల్లీలో అత్యధికంగా 12 జోన్లు ఉన్నాయి. ఇప్పటికే 33 హాట్​స్పాట్లనూ వెల్లడించింది కేజ్రీవాల్​ ప్రభుత్వం. ఈ జోన్లలో 100 శాతం లాక్​డౌన్​ అమలు చేయడమే కాకుండా ప్రజలకు ర్యాపిడ్ బ్లడ్​​ టెస్టులు చేయనున్నారు.

21:13 April 12

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం

లాక్​డౌన్ ఆంక్షల సడలింపు విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రోజుకు కొద్ది గంటల చొప్పున మద్యం దుకాణాలు, మద్యం తయారీ కేంద్రాలు తెరిచేందుకు అనుమతిచ్చింది.

20:46 April 12

మహారాష్ట్రలో మరో 221

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. నేడు మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 221 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,982కు చేరింది.

19:43 April 12

బ్రిటన్​లో​ 10వేలు దాటిన కరోనా మరణాలు!

బ్రిటన్​లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇంగ్లాండ్​లో గడిచిన 24 గంటల్లో 657 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం మరణాల సంఖ్య 9,875గా వెల్లడించింది. అయితే.. ఇందులో స్కాట్లాండ్​, వేల్స్​, ఉత్తర ఐర్లాండ్​కు సంబంధించిన తాజా గణాంకాలను కలపలేదని అధికారులు తెలిపారు. మొత్తం మరణాల సంఖ్యను త్వరలోనే విడుదల చేయనన్నట్లు స్పష్టం చేశారు.  

ఐరోపా దేశాలనై ఇటలీ, స్పెయిన్​లో కరోనా కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదవుతున్న సమయంలో బ్రిటన్​లో పెరగటం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే ఐరోపాలో అత్యధిక మరణాలు ఉన్న దేశంగా నిలస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.  

19:05 April 12

'ఇప్పటి వరకూ 1.25 కోట్ల సిలిండర్లు బుక్​ చేశారు'

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వినియోగదారులు ఈ నెలలో ఇప్పటివరకూ 1.25కోట్ల గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో గ్యాస్‌కు కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే 85లక్షల సిలిండర్లను వినియోగదారులకు అందించామని..  లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కూడా చాలా చోట్ల రెండు రోజుల్లోనే డెలివరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

19:02 April 12

మహారాష్ట్రలో పరీక్షల రద్దు!

మహారాష్ట్రలో 10వ తరగతి భూగోళ శాస్త్రం పేపర్​ పరీక్షను రద్దు వేసింది ప్రభుత్వం. 9, 11వ తరగతి రెండో సెమిస్టర్​ పరీక్షలనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  

18:55 April 12

ఉత్తరాఖండ్​లో వరుసగా నాలుగో రోజు కరోనా సున్నా

ఉత్తరాఖండ్​లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 35 మంది వైరస్​ బారినపడి చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.  

పంజాబ్​లో..

పంజాబ్​లో మొత్తం కేసుల సంఖ్య 170కి చేరింది. ప్రస్తుతం 135 మంది చికిత్స పొందుతుండగా.. 23 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. 

18:49 April 12

హరియాణాలో 181కి చేరిన కరోనా కేసులు

హరియాణాలో కరోనా కేసుల సంఖ్య 181కి చేరింది. ఇందులో 149 యాక్టివ్​ కేసులు కాగా.. 30 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇద్దరు మరణించినట్లు తెలిపింది. 

18:20 April 12

నా జీవితాంతం వారికి రుణపడి ఉంటా: బోరిస్​

తన జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ అన్నారు. కరోనా వైరస్ చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన ఆయన ఇటీవలే డిశ్చార్జ్‌ అయ్యారు. ‘కేవలం వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పను. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను’ అని బ్రిటన్‌లోని సెయింట్ థామస్‌ ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి చెప్పినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అంతక ముందు బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. అయితే వ్యాధి తీవ్రత పెరగడంతో గతవారం ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు.

18:14 April 12

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్​ ప్రధాని

కరోనా బారినపడి కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్​ అయినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

18:07 April 12

కర్ణాటకలో 232కు చేరిన కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 232కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 54 మంది కోలుకున్నట్లు స్పష్టం చేసింది. 

18:02 April 12

తమిళనాడులో మరో 106 కరోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 106 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1075కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీలా రాజేశ్​ తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. 

17:39 April 12

సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించండి: కేంద్రం

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక ఆశ్రయాలు, శిబిరాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం దృష్టి పెట్టాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని సూచించింది.  

17:33 April 12

కేరళాలో కరోనా తగ్గుముఖం.. నేడు రెండే కేసులు

దేశంలో తొలికేసు నమోదైన కేరళాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ పకడ్బందీ చర్యలతో వైరస్​ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. నేడు కేవలం రెండే కేసులు నమైదనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. ఒక్క రోజులోనే 36 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 194 యాక్టివ్​ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 179 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు.  

17:21 April 12

దేశవ్యాప్తంగా 8,500 చేరువలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా మరో 91 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 8,447కు చేరింది. ఇప్పటి వరకు 273 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 7409 ఆక్టివ్​ కేసులు ఉండగా, 764 మంది కోలుకున్నారు. ఒకరు దేశం నుంచి వెళ్లిపోయారు.  

17:11 April 12

13 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఔషధాలు

హైడ్రాక్సీక్లోరోక్విన్​ మాత్రలను అందించాలని వివిధ దేశాల నుంచి వస్తున్న వినతులు కేంద్రం పరిశీలిందని ప్రభుత్వ ప్రతినిధి కేఎస్​ ధత్వాలియా తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన నిల్వలపై అంచనాకు వచ్చిన కేంద్రం... 13 దేశాలకు ఈ ఔషధాలను అందించేందుకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు.  

16:58 April 12

పుణెలో క్వారంటైన్​కు 30 మంది నర్సులు

మహారాష్ట్ర పుణెలోని రక్బిహాల్​ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ 45 ఏళ్ల నర్సు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె ఇటీవలే సెలవుపై వెళ్లి రాగా.. లక్షణాలు బయటపడ్డాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగా ఆమె పని చేసిన వార్డుల్లోని 30 మంది నర్సులను క్వారంటైన్​కు తరలించారు.  

16:39 April 12

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 34 మంది మృతి

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు.  

16:36 April 12

601 ఆస్పత్రుల్లో 1.05 లక్షల పడకలు సిద్ధం: కేంద్రం

దేశవ్యాప్తంగా మొత్తం 601 ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  ఏప్రిల్​ 9వ తేదీ సమాచారం మేరకు 1,100 పడకలు అవసరమైతే 85వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రస్తుతం 1,671 పడకలు అవసరం కాగా లక్షా 5వేల పడకలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 

16:30 April 12

సగటున రోజుకు 584 మందికి కరోనా

గడిచిన ఐదు రోజుల్లో సగటున రోజుకు 15,747 నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. అందులో సగటున రోజుకు 584 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ఐసీఎంఆర్​ అధికారి డా. మనోజ్​ మర్హేకర్​ తెలిపారు. 

16:20 April 12

'కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నాం'

కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా పరీక్షల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం. దేశంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయి. 80శాతం కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయి. ఆస్పత్రులు, ఐసోలేషన్‌ కేంద్రాల సంఖ్యను పెంచుకుంటున్నాం’ అని తెలిపారు.

16:16 April 12

1.87 లక్షల మందికి కరోనా పరీక్షలు: కేంద్రం

  • ఇప్పటివరకు సుమారు లక్షా 87 వేల మందికి కరోనా పరీక్షలు చేశాం: కేంద్రం
  • కరోనా పరీక్షల కేంద్రాల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నాం: కేంద్రం
  • 80 శాతం కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయి: కేంద్ర వైద్యశాఖ
  • గిడ్డంగుల్లో వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల నిల్వకు ఇబ్బంది లేవు: కేంద్రం
  • నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలపై ఆంక్షలు లేవు: కేంద్రం
  • ఇప్పటివరకు 716 మంది కరోనా నుంచి కోలుకున్నారు: కేంద్రం

16:10 April 12

24 గంటల్లో 909 కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 909 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

  • 151 ప్రభుత్వ, 68  ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నాం: కేంద్ర వైద్యశాఖ
  • ప్రైవేట్‌ ఆస్పత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నాం: కేంద్రం
  • కరోనా పరీక్షల కేంద్రాల సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నాం: కేంద్రం
  • కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు అనుమతి: కేంద్రం
  • కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది: కేంద్రం

15:40 April 12

హైడ్రాక్సీక్లోరోక్విన్​ అందరికీ మంచిది కాదు: దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్​

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వినియోగం అందరికీ మంచిది కాదని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. 'కొవిడ్‌-19 నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కొంతమేర పనిచేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అవి బలంగా లేవు. కొవిడ్‌-19తో బాధపడే వారికి చికిత్స అందించేందుకు సహాయకారిగా ఉంటుందని మాత్రం ఐసీఎంఆర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ కాంబినేషన్‌లో ఔషధాల వినియోగించడం ద్వారా కొవిడ్‌-19 బాధపడేవారు కాస్త కోలుకున్నారని  చైనా, ఫ్రాన్స్‌లలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, అవి కూడా అంత విశ్వసనీయంగా లేవు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాలు వినియోగించడం అందరికీ మంచిది కాదు. కొన్నిసార్లు అది గుండెపోటుకు దారితీయొచ్చు. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి' అని తెలిపారు.

15:20 April 12

స్పెయిన్​లో ఇవాళ మరో 619 మంది మృతి

స్పెయిన్​లో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇవాళ మరో 619 మంది ఈ వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 16,606కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య లక్షా 63వేలు దాటింది. 

14:48 April 12

రాజస్థాన్​లో మరో 96 మందికి కరోనా పాజిటివ్​

రాజస్థాన్​లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేడు మరో 96 మందికి పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 796కు చేరింది. 

14:19 April 12

మధ్యప్రదేశ్​ భోపాల్​లో కరోనాతో వ్యక్తి మృతి!

మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో ఆస్తమా వ్యాధితో బాధపడుతూ.. నిన్న ప్రాణాలు కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. అతనితో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భోపాల్​లో మొత్తం మృతుల సంఖ్య 2కు చేరింది. నేడు మరో ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. భోపాల్​లో వారితో మొత్తం కేసుల సంఖ్య 134కు చేరింది.  

13:10 April 12

కర్ణాటకలో మరో 11 మందికి కరోనా

కర్ణాటకలో మరో 11 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇందులో ఏడుగురు వైరస్​ సోకిన వారిని కలవగా.. ఒకరు విదేశాలకు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 226 మందికి కరోనా సోకింది. ఆరుగురు మరణించారు. 47 మంది వైరస్​నుంచి కోలుకున్నారు. 

12:45 April 12

మహారాష్ట్రలో నేడు 134 కరోనా కేసులు

మహారాష్ట్రలో నేడు మరో 134 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ముంబయిలో 113, రాయ్​ఘడ్​, అమ్రావతి, భీవండి, పింప్రి-చింద్వారాలో ఒక్కోకేసు, పుణెలో నాలుగు, మిరా భయాందర్​లో 7, నావి ముంబయి, థానె, వాసాయ్​ విరార్​లో రెండు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1895కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

12:35 April 12

ఝార్ఖండ్​లో కరోనాతో వ్యక్తి మృతి

కరోనా మహమ్మారి కారణంగా ఝార్ఖండ్​లో 60 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హింద్రిపిరికి  చెందిన అతను రెండు రోజుల క్రితం రాంచిలోని ఆస్పత్రిలో చేరగా వెంటిలేటర్​పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం మరణించాడని వెల్లడించారు. రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరింది. 17 మంది కరోనా బారినపడ్డారు. 

11:03 April 12

గుజరాత్​లో కరోనా కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోగా మరో 25 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 23కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య  493కు పెరిగింది.

10:52 April 12

రాజస్థాన్​లో మరో 51 మందికి కరోనా సోకినట్టు నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 751కి చేరింది.

10:30 April 12

  • ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా కేసులు
  • ఇప్పటికే లక్ష దాటిన మృతుల సంఖ్య
  • మహమ్మారి నుంచి కోలుకున్న 4 లక్షల మంది
  • కొవిడ్​-19 ధాటికి అమెరికా విలవిల
  • కేసులు, మృతుల జాబితాలో తొలిస్థానంలో అగ్రరాజ్యం
  • ఇప్పటికే అమెరికాలో 20 వేల మందికి పైగా మృతి
  • కరోనా నియంత్రణపై అమెరికా అధ్యక్షుడి కీలక నిర్ణయం
  • దేశవ్యాప్త విపత్తుగా ప్రకటించిన ట్రంప్
  • అమెరికా చరిత్రలో ఇలా చేయడం ఇదే తొలిసారి
  • భారత్​లో తన ప్రతాపాన్ని చూపిస్తున్న కరోనా
  • 8 వేలు దాటిన కేసులు, 273కు చేరిన మృతులు
  • గత 24 గంటల్లో 34 మంది మృతి
  • లాక్​డౌన్​ పొడిగించాలనే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు
  • మరో 2 వారాలు పొడిగించే అవకాశం
  • కేసులు భారీగా పెరగడం వల్ల ఆందోళన

09:29 April 12

మరో ఇద్దరు...

కరోనా ధాటికి తమిళనాడులో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 12కి చేరింది.

08:27 April 12

కరోనా పంజా: దేశంలో 273 మరణాలు- 7367 యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 273 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

  • మొత్తం కేసులు: 8,356
  • యాక్టివ్ కేసులు: 7,367
  • మరణాలు: 273
  • కోలుకున్నవారు: 715
  • నిన్నటి నుంచి కొత్తగా నమోదైన కేసులు: 909
Last Updated : Apr 12, 2020, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details