తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కరోనాతో మరో ఏడుగురు మృతి - coronavirus deaths

corona
కరోనా పంజా

By

Published : Apr 6, 2020, 8:48 AM IST

Updated : Apr 6, 2020, 11:07 PM IST

20:15 April 06

మహారాష్ట్రలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు.  దీంతో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 52కు చేరింది.

19:42 April 06

మహారాష్ట్రలో కొత్తగా 120 కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 120 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 868కు చేరుకున్నట్లు వెల్లడించారు.

19:33 April 06

సీఎం ఇంటి సమీపంలోని టీషాపు నిర్వహకుడికి కరోనా పాజిటివ్​

మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం 'మాతోశ్రీ' సమీపంలోని టీ షాపు నిర్వహకుడికి కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపాలిటీ సిబ్బంది టీ స్ఠాల్​తో పాటు చుట్టు పక్కల రసాయనాలను స్ప్రే చేశారు. పాజిటివ్​ వచ్చివ వ్యక్తిని కలిసిన వారిని సైతం అధికారులు క్వారంటైన్​  చేశారు.

18:52 April 06

భారత్​లో కరోనా మరణాలు 111కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  దేశంలో వైరస్​ యాక్టివ్​ కేసులు 3,851 ఉన్నట్లు వివరించింది. కరోనా నుంచి 318 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,281కు చేరుకున్నట్లు ప్రకటించింది. గత 24గంటల్లో 704కేసులు, 28మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

18:50 April 06

కేరళలో కొత్తగా 13 కరోనా కేసులు

కేరళలో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 327కు చేరుకున్నట్లు సీఎం పినరయ్​ విజయన్​ ప్రకటించారు. అత్యవసర వైద్య సేవల కోసం తమ రాష్ట్రానికి వచ్చే వారి కోసం తమ సరిహద్దులను తెరుస్తున్నట్లు వెల్లడించారు.

18:45 April 06

హరియాణాలో మరో 11మందికి కరోనా

హరియాణాలో మరో 11మందికి కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 87కు చేరుకుంది.

18:37 April 06

తమిళనాడులో కొత్తగా 50 మందికి కరోనా 

  • తమిళనాడులో కొత్తగా 50 మందికి కరోనా పాజిటివ్
  • ఇప్పటివరకు 621 కరోనా కేసులు నమోదు
  • బాధితుల్లో 48 మంది నిజాముద్దీన్ నుంచి వచ్చినవారే
  • తమిళనాడులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతి

18:26 April 06

కరోనా దెబ్బకు మరో టోర్నీ రద్దు

ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావానికి మరో టోర్నీ బలైంది. వచ్చే నెల్లో దిల్లీ వేదికగా జరగాల్సిన ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ రద్దయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

18:21 April 06

తమిళనాడులో మరో 50 కేసులు..

ఇవాళ మరో 50 కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య తమిళనాడులో 621కి చేరింది. ఇందులో 570 తబ్లీగీ జమాత్​కు చెందినవారేనని స్పష్టం చేసింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. 

17:21 April 06

జమ్ముకశ్మీర్​లో 109కి చేరుకున్న కేసులు

జమ్ముకశ్మీర్​లో కరోనా కేసులు 109కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 103 ఉన్నట్లు వెల్లడించారు.  అందులో కశ్మీర్​లో 85 కేసులు, జమ్ములో 18 ఉన్నట్లు వివరించారు. ఇవాళ ఇప్పటి వరకు మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు.

16:57 April 06

  • కరోనా వైరస్​ విషయంలో తప్పుడు, సంచలన సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • మూఢనమ్మకాలు, వదంతులతో కరోనాపై చేస్తున్న పోరాటం బలహీనపడుతుంది: ఉపరాష్ట్రపతి
  • భౌతిక దూరం నిబంధన విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు: ఉపరాష్ట్రపతి
  • వైద్య సేవలందిస్తున్న వారి భద్రత విషయంలో రాజీ పడకూడదు: ఉపరాష్ట్రపతి

16:49 April 06

'నిత్యావసర సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేవు'

  • ఆహార వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేవు: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్​ సెక్రటరీ లవ్​ అగర్వాల్‌
  • ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు: లవ్‌ అగర్వాల్‌
  • దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి: లవ్‌ అగర్వాల్‌
  • గత 13 రోజుల్లో 1340 వ్యాగన్ల ద్వారా చక్కెర సరఫరా: లవ్‌ అగర్వాల్‌
  • 958 వ్యాగన్ల ద్వారా ఉప్పు సరఫరా: లవ్‌ అగర్వాల్‌
  • కరోనా కేసుల్లో 76 శాతం పురుషులకే వస్తున్నాయి: లవ్‌ అగర్వాల్‌
  • కరోనా మృతుల్లో 63 శాతం వృద్ధులు ఉంటున్నారు: లవ్‌ అగర్వాల్‌
  • జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రాలకు మరో రూ.3 వేల కోట్లు విడుదల: లవ్‌ అగర్వార్‌
  • జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఇప్పటికే రూ.1100 కోట్లు విడుదల చేశాం: లవ్‌ అగర్వాల్‌
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల రవాణా: లవ్‌ అగర్వాల్‌
  • 13 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 1.3 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమ రవాణా: లవ్‌ అగర్వాల్‌
  • 8 రాష్ట్రాలకు ఇప్పటివరకు 1.32 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయింపు: లవ్‌ అగర్వాల్‌

16:11 April 06

దేశంలో గత 24గంటల్లో 693 కరోనా కేసులు, 30 మరణాలు సంబంధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 3666 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు  వెల్లడించింది. కరోనా కారణంగా 291 మంది చనిపోయినట్లు స్పష్టం చేసింది. మొత్తం కేసుల్లో 1445 కేసులు మర్కజ్​ ప్రార్థనలకు సంబంధం ఉన్నవారేనని వివరించింది.

15:56 April 06

కేంద్ర మంత్రుల పనితీరు భేష్​

కేంద్ర మంత్రి మండలితో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్​లో సమావేశమయ్యారు.  కరోనాపై పోరులో మంత్రుల బాగుందని ప్రశంసించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. భవిష్యత్​లోనూ ఇలాగే పనిచేయాలని ప్రధాని సూచించినట్లు వివరించింది. ఇది పంటల కోత కాలంలో కావడం వల్ల రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు చెప్పింది.  

15:37 April 06

కరోనా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంట్​ సభ్యుల వేతనాల్లో 30శాతం కోత విధించనున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జావడేకర్​ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్​ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్​ 1నుంచి ఏడాది పాటు ఈ కోత ఉంటుందన్నారు. పార్లమెంట్​ సభ్యుల జీతం, భత్యాలు, పెన్షన్‌ను సవరించే చట్టాన్ని 1954 లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందిన్నారు జావడేకర్.  

ప్రధాని మోదీతో పాటు ఎంపీలందరి జీతాల్లో ఏడాదిపాటు కోత ఉంటుందని స్పష్టం చేశారు జావడేకర్‌. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు.  రెండేళ్లపాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రద్దుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

15:10 April 06

పంజాబ్​లో మరొకరికి కరోనా పాజిటివ్​

పంజాబ్​లో మరొకరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిజాముద్దీన్​ ప్రార్థనలకు వెళ్లివచ్చిన దంపతుల కుమారుడికే తాజాగా వైరస్​ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. దంపతులు ఇది వరకే బారిన పడి చికిత్స పొంతున్నారు.

15:02 April 06

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

కరోనాపై పోరాటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర గురించి ఎంత ఎంత చెప్పుకున్నా తక్కువే. పశ్చిమ బంగాల్​ కుమార్​పుర్​లో  పారిశుధ్య కార్మికుల గొప్పతనాన్ని గుర్తించి స్థానికులు వారిని సన్మానించారు. 

14:19 April 06

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర మండలి సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, హోం మంత్రి అమిత్​ షా సహా ఇతర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు.  

కేంద్ర మంత్రి మండలి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం కావడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కరోనాపై మంత్రులతో ప్రధాని  మోదీ ప్రత్యేకంగా చర్చించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. భవిష్యత్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

14:15 April 06

కర్ణాటకలో మరో 12 కొత్త కేసులు  

కర్ణాటకలో మరో 12 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్త కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 163కు చేరుకున్నట్లు వెల్లడించారు.

14:12 April 06

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ ఫోన్​ సంభాషణ

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మొర్రిసన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు. కరోనాపై ఇరు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడుకున్నారు.  

14:00 April 06

వీడియోకాన్ఫరెన్స్‌లో విచారణ పిటిషన్​పై సుప్రీంకోర్టులో వాదనలు

  • వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ మార్గదర్శకాలపై సుమోటో కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే
  • కోర్టుల పనితీరుపై సలహాలు, సూచనలతో సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ పిటిషన్
  • కోర్టుల పనితీరులో సవరణలు తీసుకురావాల్సి ఉందన్న పిటిషనర్
  • దృశ్యమాధ్యమంలో విచారణలు జరుగుతున్నందున సవరణలు అవసరమన్న పిటిషనర్
  • వికాస్‌సింగ్ సలహాలు, సూచనలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయం
  • లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఈ అంశాలను పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ బొబ్డే ఉద్ఘాటన
  • భౌతిక దూరం పాటిస్తూనే రాజ్యాంగ పాత్రను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • కోర్టుల్లో గుమిగూడి జరిపే విచారణలను నిలిపివేశామని సీజేఐ ప్రకటన
  • సాంకేతికతను వినియోగించుకోవడంలో కోర్టులు చురుగ్గా ఉన్నయని సుప్రీంకోర్టు వివరణ
  • సమాచార, సాంకేతిక సంబంధాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వెల్లడి
  • వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుల విచారణపై మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
  • సామాజిక దూరం పాటించేలా మార్గదర్శకాలను అమలు చేయాలని సీజేఐ ఆదేశం
  • వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణపై హైకోర్టులకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం
  • వీడియోకాన్ఫరెన్స్ విచారణకు అన్ని కోర్టులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశం
  • వీడియోకాన్ఫరెన్స్ విచారణల్లో ఏ సందర్భంలోనూ సాక్ష్యాలు నమోదు చేయొద్దని సూచన
  • సాక్ష్యాలు నమోదు చేయాల్సి వస్తే ప్రిసైడింగ్ అధికారి నిర్ణయిస్తారని సుప్రీం వెల్లడి
  • హైకోర్టుల నిబంధనల ప్రకారం జిల్లా కోర్టులు విచారణలు జరపాలని ఆదేశం
  • వీడియో కాన్ఫరెన్స్ ఏ అప్లికేషన్ ద్వారా జరపాలన్నది హైకోర్టుల ఇష్టమన్న సుప్రీం
  • వీడియోకాన్ఫరెన్స్‌ల కనెక్టివిటీలో కోర్టులకు సహకారం అందించాలని ధర్మాసనం సూచన
  • సహకారం అందించేలా ఎన్ఐసీ అధికారులను కేటాయించాలని కోరిన సుప్రీం
  • లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత  సుమోటో కేసుపై తదుపరి విచారణ

12:47 April 06

గుజరాత్​ వడోదరలో కరోనాకు మరొకరు బలయ్యారు. వైరస్​ సోకి చికిత్స తీసుకుంటున్న 62ఏళ్ల మహిళ సోమవారం ఉదయం మరణించారు. దీంతో వడోదరలో కరోనా మరణాల సంఖ్య 2కు చేరుకున్నాయి.

12:41 April 06

ఒడిశాలో 500 పడకల కరోనా ఆస్పత్రి ప్రారంభం

భువనేశ్వర్​లో 500 పడకలతో ఏర్పాటు చేసిన కరోనా అస్పత్రిని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కేంద్ర మంత్రి ధర్మేంద్ర.  

12:32 April 06

భారత్​కు 2.9మిలియన్​ డాలర్ల సాయాన్ని ప్రకటించిన అమెరికా

యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటెల్ డెవలప్‌మెంట్ ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు భారతదేశానికి 2.9 మిలియన్​ డాలర్లను ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఆరోగ్య సాయం విషయంలో గత 20ఏళ్లలో భారత్​కు 3 బిలియన్ల డాలర్లను అందజేసింది అమెరికా.

12:20 April 06

భాజపా కార్యకర్తలకు ప్రధాని మోదీ సందేశం

  • కరోనా తీవ్రతను దేశ ప్రజలంతా అర్థం చేసుకున్నారు: మోదీ
  • కరోనా కట్టడికి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి: మోదీ
  • కరోనా కట్టడిని కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది: మోదీ
  • అన్ని రాష్ట్రాల సహకారంతో కరోనాపై పోరాడుతున్నాం: మోదీ
  • లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా సహకరించాలి: మోదీ
  • భారత్‌ తీసుకుంటున్న చర్యలను డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించింది: ప్రధాని
  • నిన్న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి దేశ ప్రజలంతా దీపాలు వెలిగించారు:
  • 130 కోట్లమంది ప్రజలు తమ సంకల్ప శక్తిని చాటారు: మోదీ
  • కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరం ఒక్కటవుదాం: మోదీ
  • కరోనాపై యుద్ధంలో విజయం మనదే: మోదీ
  • లాక్‌డౌన్‌ సమయంలో దేశ ప్రజలంతా పరిణితితో వ్యవహరిస్తున్నారు: మోదీ
  • క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రపంచదేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలిచింది: మోదీ
  • సంస్కారం అనేది మనందరి రక్తంలోనే ఉంది: మోదీ

12:06 April 06

భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కార్యకర్తలకు సందేశాన్ని ఇచ్చారు. భాజపా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా వైరస్​ కారణంగా ఇబ్బందుల్లో ఉందన్నారు మోదీ. ప్రపంచ మానవాళి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు ప్రధాని మోదీ.  

ఈ కష్ట సమయాన్ని సవాల్​గా తీసుకొని కార్యకర్తలు దేశ సేవలో భాగం కావాలన్నారు మోదీ. సమగ్ర విధానంతో భారత్ ముందుకు పోతోందున్నారు.  డబ్ల్యూహెచ్​ఓ కూడా కరోనా నివారణకు భారత్​ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిందన్నారు. అన్ని దేశాలు ఒకేతాటి పైకి వచ్చి కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చారు. అందుకే  సార్క్ దేశాలు,  జీ20 సమావేశాల్లో భారతదేశం పాల్గొంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 

11:50 April 06

భారత ప్రభుత్వం​ చర్యలు భేష్​..

కరోనా వైరస్​ను ఎదుర్కోవడంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్​ చర్యలు బాగున్నాయన్నారు ఆర్​ఎస్​ఎస్​ జాయింట్ జనరల్ సెక్రటరీ మన్మోహన్ వైద్య. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు కూడా లభిస్తోందని స్పష్టం చేశారు.

11:43 April 06

డెయిరీలపై కరోనా ప్రభావం..

డెయిరీ ఫామ్​లపై కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా పడుతోంది.  డౌక్​డౌన్​ నేపథ్యంలో దాణా సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ లభించినా ఎక్కువ రేటు పలుకుతోంది డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు.  అలాగే కరోనా పశువుల డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. 

11:18 April 06

మహారాష్ట్రలో కరోనాతో మరొకరు మృతి చెందారు. 65ఏళ్ల వృద్ధుడు వాసి విహార్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

11:08 April 06

మహారాష్ట్రలో మరో 33మందికి సోకిన కరోనా

మహారాష్ట్రలో మరో 33మందికి  కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 781కి చేరుకున్నట్లు వెల్లడించింది.

11:05 April 06

గుజరాత్​లో మరో 16మందికి  కరోనా పాజిటివ్​

గుజరాత్​లో మరో 16మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 144కు చేరుకున్నట్లు పేర్కొన్నారు.

10:53 April 06

భోపాల్​లో కట్టుదిట్టంగా లాక్​డౌన్​

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లాక్​డౌన్​ పకడ్బందీగా అమలవుతోంది. భోపాల్​ జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్​ ప్రత్యేక దృష్టి సారించారు. లాక్​డౌన్​ అమలుపై ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం వల్ల ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టి వాహనాలను ఆపుతున్నారు. సరైన కారణం చెప్పని వారిని తిరిగి పంపిస్తున్నారు. దీంతో భోపాల్​ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

10:29 April 06

ఏప్రిల్ 8 నాటికి ఐసీఎంఆర్​కు సుమారు 7 లక్షల రాపిడ్​ కరోనా యాంటీబాడీ పరీక్ష కిట్లు అందనున్నాయి. అయితే వీటివి హాట్ స్పాట్లలో వినియోగించనున్నారు. ఐసీఎంఆర్‌కు దశలవారీగా ఈ రాపిడ్​ కిట్లను అందజేయనున్నారు. మొదటి దశలో భాగంగా 5 లక్షల కిట్లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్​ భావిస్తోంది.

10:25 April 06

హరియాణాలో మరో తొమ్మిది కరోనా కేసులు

హరియాణాలో మరో 9 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరందరూ దిల్లీ మర్కజ్​ ప్రార్థనలకు వెళ్లిన వారే అని వెల్లడించారు.

10:02 April 06

గాయని కనికా కపూర్ కరోనా వైరస్​ నుంచి కోలుకున్నారు. అమెకు ఆరోసారి చేసిన పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్​ అని వచ్చింది. దీంతో ఆమెను డిశ్చార్జ్​ చేస్తున్నట్లు లక్​నవూలోని సంజయ్​గాంధీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

09:56 April 06

ఉత్తరాఖండ్​లో మరో ఇద్దరికి సోకిన వైరస్​

ఉత్తరాఖండ్​ మరో ఇద్దరికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.

09:54 April 06

ఝార్ఖండ్​లో మరొకరికి కరోనా పాజిటివ్​

ఝార్ఖండ్​లో మరొకరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. నూతన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరుకున్నట్లు వెల్లడించారు.

09:50 April 06

భోపాల్​లో తొలి కరోనా మరణం

మధ్య ప్రదేశ్​ భోపాల్​లో తొలి కరోనా మరణం సంభవించింది. ఓ వృద్ధుడు వైరస్​ సోకి మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆధికారులు తెలిపారు. 

09:35 April 06

భారత్​లో కరోనా మరణాలు 109కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 3,666 ఉన్నట్లు వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి 291 మంది కోలుకున్నట్లు పేర్కొంది.

08:45 April 06

కరోనా పంజా: మధ్యప్రదేశ్​లో మరొకరు మృతి

కరోనా సోకి మధ్యప్రదేశ్​లో మరొకరు మరణించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 14కు చేరింది.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం... దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 274 మంది చికిత్స తర్వాత కోలుకున్నారు.

Last Updated : Apr 6, 2020, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details