దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15,968 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 465 మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటింది.
ఒక్కరోజులో 15,968 కరోనా కేసులు, 465 మరణాలు - COVID-19 LATEST NEWS
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 15,968 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 465 మంది కరోనా కాటుకు బలయ్యారు.
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి
అధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో..
- మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,39,010కు చేరింది. 6531 మంది ప్రాణాలు కోల్పోయారు. 69,631 మంది కోలుకున్నారు. 62,848 మంది చికిత్స పొందుతున్నారు.
- తమిళనాడులో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 64,603కు చేరింది. 833 మంది మృతి చెందారు. 28,431 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- దిల్లీలో కేసుల సంఖ్య 66602కు చేరింది. మొత్తం 2301 మంది ప్రాణాలు కోల్పోయారు. 39,313 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 24,988 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: 'భారత్- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?
Last Updated : Jun 24, 2020, 9:48 AM IST