దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 61కి చేరినట్టు తెలుస్తోంది. తాజాగా కేరళలో 8, కర్ణాటక 3, పుణెలో 3 కేసులు నమోదైనట్టు సమాచారం.
కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం దేశంలో ఇప్పటి వరకు 50 మందికి వైరస్ సోకినట్టు వెల్లడించింది. మిగతా కేసులను తిరిగి పరీక్షిస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులు పాజిటివ్‌గా తేలితే.. బాధితుల సంఖ్య 61కి చేరుతుంది.
కేరళలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోథియేటర్లు మూసివేయనున్నారు.శబరిమలకు రావాలన్న ఆలోచనను భక్తులు ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిదని సూచించారు.
ప్రాణాంతక కరోనా వైరస్ చికిత్స కోసం హెచ్ఐవీ ఎయిడ్స్ మందులనువినియోగించారు రాజస్థాన్‌లోని ఎస్ఎమ్ఎస్ వైద్యులు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన ఇటలీ దంపతులకు ఈ విధింగా చికిత్స అందించారు. బాధితుల ఆరోగ్యం మెరుగుపడినట్టు స్పష్టం చేశారు.