తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 లక్షలకు చేరువలో కేసులు, 15 వేలు దాటిన మరణాలు - CORONA DEATH TOLL

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 17,296 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 407 మంది కరోనా కాటుకు బలయ్యారు.

CORONA VIRUS
దేశంలో కరోనా పంజా

By

Published : Jun 26, 2020, 9:23 AM IST

Updated : Jun 26, 2020, 9:33 AM IST

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 17,296 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 407 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,47,741కు చేరింది. 6,931 మంది ప్రాణాలు కోల్పోయారు. 77453 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 70977కి చేరింది. 911 మంది మృతి చెందారు. 30067 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కేసుల సంఖ్య 73780కు చేరింది. మొత్తం 2429 మంది ప్రాణాలు కోల్పోయారు. 44765 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 26586 మంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్​లో వైరస్​ కేసుల సంఖ్య 29520 చేరింది. ఇప్పటి వరకు 1753 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6269మంది చికిత్స పొందుతున్నారు.
Last Updated : Jun 26, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details