కొవిడ్-19పై పోరు కోసం టీకా, ఔషధం అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు, వ్యక్తిగత రక్షణ సాధనాలను తయారుచేయనున్నట్లు తెలిపారు.
కరోనాకు టీకా అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీవో
కరోనాకు టీకా అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు డీఆర్‌డీవో ఛైర్మన్ జీ సతీశ్ రెడ్డి. వైరస్ నుంచి రక్షణ కోసం శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు, వ్యక్తిగత రక్షణ సాధనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
కొవిడ్-19కు టీకా అభివృద్ధి చేస్తున్నాం
సొంత ఫార్ములాలతో గ్వాలియర్, దిల్లీలోని ల్యాబ్‌ల్లో శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఇప్పటికే 5లక్షలకుపైగా సీసాలను పంపిణీ చేసినట్లు చెప్పారు సతీశ్ రెడ్డి. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వెబినార్‌లో ప్రసంగించారు.