మొబైల్ ఫోన్ల ద్వారా వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించే ప్రమాదముందని, ఆసుపత్రుల్లో వాటి వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని ఎయిమ్స్-రాయ్‌పుర్ వైద్యులు సూచించారు. ఈ మేరకు డా.వినీత్‌కుమార్ పాఠక్ బృందం బీఎంజే గ్లోబల్ హెల్త్ పత్రికకు వ్యాసం అందించింది.
మొబైల్ ఫోన్లూ వైరస్ వాహకాలే. వాటి ఉపరితల భాగాలు అత్యంత ప్రమాదకరం. వాటిపై ఉండే వైరస్ నేరుగా మొహానికి, నోటికి, కళ్లకు అంటుకునే ప్రమాదముంది. తమ విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సగటున ప్రతి పదిహేను నిమిషాల నుంచి రెండు గంటలకు ఒకసారి ఫోన్లను వినియోగిస్తుంటారు. వారు తమ చేతులను ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా, ఫోన్లను ముట్టుకోవడం ద్వారా వైరస్ మళ్లీమళ్లీ అంటుకునే ప్రమాదముంది.