భారత్లో కొవిడ్ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6535 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్కరోజులో 6,535 కేసులు, 146 మరణాలు - health ministry
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,45,380కి చేరుకుంది.
ఒక్కరోజులో 6,535 కేసులు, 146 మరణాలు
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1695 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 52667కి చేరింది. గుజరాత్లో 888, మధ్యప్రదేశ్లో 300 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.