కర్ణాటక కలబురిగికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారులు మాత్రం దీనిని పూర్తిగా ధ్రువీకరించలేదు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా కరోనాపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని సూచించారు. చనిపోయిన వ్యక్తి నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపించినట్లు వివరించారు.
కర్ణాటకలో కరోనా అనుమానితుడు మృతి..?
13:07 March 11
కర్ణాటకలో కరోనా అనుమానితుడు మృతి..?
ఇదీ జరిగింది
ఫిబ్రవరి 29న దుబాయ్ నుంచి వచ్చిన అతడి మృతికి కరోనానే కారణమని అనుమానిస్తున్నారు. పరీక్షల అనంతరం ఈ సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది
దుబాయ్ నుంచి వచ్చాక దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు ఆ వృద్ధుడు. జిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ప్రత్యేక వార్డులో చికిత్స అందించిన వైద్యులు... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపారు. తర్వాత కలబురిగి తిరిగి తీసుకెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు.
భారత్లో కరోనా కారణంగా ఇప్పటివరకు ఎవరూ మరణించలేదు. 60 మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.