తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలవరం: 24 గంటల్లో మహారాష్ట్రలో 552 కేసులు - భారత్​లో కరోనా వైరస్ వార్తలు

corona-live-updates
కరోనా లైవ్ అప్​డేట్స్​

By

Published : Apr 21, 2020, 8:07 AM IST

Updated : Apr 21, 2020, 10:22 PM IST

20:55 April 21

లాక్​డౌన్​ వేళ మరిన్ని మినహాయింపులు...

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్​డౌన్​ను​ అమలు చేయాలని ఆదేశించిన కేంద్రం.. తాజాగా కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

  • వయో వృద్ధులకు సేవలందించే 'కేర్​టేకర్స్'​కు బయటకు వెళ్లేందుకు అనుమతి.
  • ప్రీపెయిడ్​ మొబైల్​ కనెక్షన్లకు రీఛార్జీలు చేసే అధికారిక దుకాణాలకు అనుమతి. 
  • పట్టణ ప్రాంతాల్లో బ్రెడ్​ ఫ్యాక్టరీలు సహా పాల సంబంధిత ఉత్పత్తులు, పిండి, పప్పు మిల్లులు పనిచేసేందుకు అనుమతి.

20:45 April 21

మహారాష్ట్రలో 552 కేసులు..

మహారాష్ట్రలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 552 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది. ఇందులో 419 కేసులు ముంబయి నుంచే రావడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 251కి చేరింది. బాధితుల సంఖ్య 5,218కి చేరింది.

20:34 April 21

దిల్లీలో మరో 75మందికి వైరస్

దిల్లీలో మరో 75మందికి కరోనా సోకింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 2156కు పెరిగింది. మృతుల సంఖ్య 47గా ఉంది.

20:16 April 21

గుజరాత్​లో 13మంది మృతి..

వైరస్ కారణంగా గుజరాత్​లో మరో 13మంది నేడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 90కి చేరింది. రాష్ట్రంలో మరో 112మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 2178కి  పెరిగింది.

20:13 April 21

ముంబయిలో లాక్​డౌన్​ సడలింపులు రద్దు..

ముంబయి, పుణెల్లో లాక్​డౌన్ సడలింపులను రద్దు చేసింది మహారాష్ట్ర సర్కారు. రెండు నగరాల్లో సోమవారం ఎక్కువగా వైరస్ కేసులు నమోదయిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ముంబయి, పుణెలు కరోనా హాట్​స్పాట్​లుగా మారాయి.

19:51 April 21

మధ్యప్రదేశ్​లో 67 కేసులు...

మధ్యప్రదేశ్​లో కొత్తగా 67 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 1552కి చేరింది. ఇప్పటివరకు 80 మంది మృతిచెందారు.

19:35 April 21

ధారవిలో 12 కేసులు...

ముంబయిలోని మురికివాడ ధారవిలో తాజాగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 180కి చేరింది. ఒకరు వైరస్​ కారణంగా మృతి చెందారు.

19:00 April 21

మరో నాలుగు జిల్లాల్లో కేసులే లేవు!

23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 61 జిల్లాల్లో.. గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. తాజాగా ఆ జాబితాలో మహారాష్ట్రలోని మరో 4 జిల్లాలు చేరాయి. ఇందులో లాతుర్​, ఒస్మానాబాద్​, హింగోలి, వాషిమ్​ ప్రాంతాలు ఉన్నాయి.  

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18,985 కేసులు నమోదవగా.. 3260 మంది డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం 17.48గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

18:46 April 21

తమిళనాడులో వైరస్​ కేసులు...

తమిళనాడులో మరో 76 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1596కు చేరింది. ఇప్పటివరకు 18 మంది చనిపోయారు.

18:44 April 21

కేరళలో కోరనా...

కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 19 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

18:05 April 21

వేసవి సెలవులు రద్దు

మే 3 తర్వాత లాక్​డౌన్​ ఎత్తివేస్తే.. వేసవి సెలవులను రద్దు చేసుకోనున్నట్లు ప్రకటించింది బొంబాయి హైకోర్డు. మే 7 నుంచి జూన్​ 7 వరకు సెలవులు లేకుండా పనిచేయనున్నట్లు తెలిపింది.

18:03 April 21

బంగాల్​లో 3 మరణాలు...

బంగాల్​లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 15కు చేరింది.

17:31 April 21

భారత్​లో మృతుల సంఖ్య @ 603

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి పెరుగుతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 18,985కి చేరింది. ఇందులో 3,260 మంది కోలుకోగా.. 603 మంది చనిపోయారు.

17:11 April 21

రికవరీ రేటు 17.47 శాతం...

దేశంలో కరోనా బారినపడిన వారిలో రికవరీ రేటు 17.47 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి సోకిన వారిలో 3252 మంది కోలుకున్నారని స్పష్టం చేసింది.

16:32 April 21

  • కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు రెండ్రోజులు వాడవద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ
  • కరోనా ర్యాపిడ్ కిట్లను ఇప్పటికే రాష్ట్రాలకు అందించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • కరోనా ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను వెనక్కి తీసుకుంటాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • నకిలీ కిట్ల ఆరోపణలపై విచారణ జరుపుతాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • ఇప్పటివరకు 4.49 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • సోమవారం ఒక్కరోజే 35,852 నమూనాలు పరీక్షించాం: కేంద్ర ఆరోగ్యశాఖ
  • ఇప్పటివరకు 3,252 మంది రోగులు కోలుకున్నారు: కేంద్ర ఆరోగ్యశాఖ

15:30 April 21

కరోనా పంజా...

ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి చనిపోయిన వారి సంఖ్య 171,241కి చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 25 లక్షలకు చేరువలో ఉంది.

15:07 April 21

కరోనా పంజా...

స్పెయిన్​లో మళ్లీ కరోనా వైరస్​ పుంజుకుంది. గత 24 గంటల్లో 430 మంది ప్రాణాలు కోల్పోయారు.

14:10 April 21

చెన్నైలో ఓ టీవీ ఛానల్​లో పనిచేసే 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వీరిలో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని క్వారంటైన్ చేస్తున్నారు.

13:08 April 21

ఛాన్స్​ ఇస్తే లైన్లు కట్టేశారు!

దిల్లీ-ఘజియాబాద్​ సరిహద్దు వద్ద భారీగా వాహనాల రద్దీ​ ఏర్పడింది. వందలాది మంది అత్యవసర సేవలు, నిత్యవసర వస్తువుల కొనుగోళ్ల పాస్​లతో బయటికి వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనికిి తెచ్చేందుకు రాకపోకలను నిషేధించారు పోలీసులు.

12:56 April 21

ఉల్లంఘనులకు గుంజీల శిక్ష...

మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్​ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ నిబంధనలు పక్కాగా అమలు చేస్తోంది. అయితే కొంతమంది నియమాలను పట్టించుకోవట్లేదు. రోడ్ల మీదకు వచ్చి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. తాజాగా కొంతమందికి గుంజీల శిక్ష విధించారు. పుణెలోని సింగడ్​ రోడ్డు వద్ద ఉల్లంఘనులకు ఎలా శిక్ష వేశారో చూడండి. 

12:52 April 21

లోక్​సభ సెక్రటేరియట్​ ఉద్యోగికి కరోనా

లోక్​సభ సెక్రటేరియట్​లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో అతడికి పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

12:42 April 21

ఛత్తీస్​గఢ్​లో తొలి మరణం

కొవిడ్​-19 కారణంగా ఛత్తీస్​గఢ్​లో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రాష్ట్రంలో వైరస్​ తొలి మరణం ఇదే.

12:36 April 21

కర్ణాటకలో 7 కేసులు

కర్ణాటకలో కొత్తగా 7 కరోనా వైరస్​ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్​ కేసుల సంఖ్య 415కి చేరింది. ఇప్పటివరకు 114 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 17 మంది మృతిచెందారు.

12:25 April 21

వైరస్​తో పోలీసు మృతి...

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఓ పోలీసు కరోనా బారిన పడి మరణించాడు. ఉజ్జయిని స్టేషన్​ ఇంఛార్జిగా పనిచేస్తున్న అతడు.. గత 12 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇతడి మృతితో జిల్లాలో మరణాల సంఖ్య 52కి చేరింది.

12:20 April 21

19 మంది నర్సులకు కరోనా

పుణెలో 25 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్​ సోకింది. ఇందులో 19 మంది నర్సులు ఉన్నారు. వీరందరికీ కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

11:51 April 21

గుజరాత్​లో కరోనా కేసులు...

గుజరాత్​లో మరో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 2,066కి చేరింది. తాజాగా మరో ఆరుగురు చనిపోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది.

11:16 April 21

సివిల్​ సర్వీసెస్​పై రాష్ట్రపతి ప్రశంసలు..

భారతీయ సివిల్​ సర్వీసెస్​ సేవలపై ప్రశంసలు కురిపించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కొవిడ్​-19 మహమ్మారి సమయంలోనూ అధికారులు తమ కర్తవ్యం కోసం పాటుపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటి అమలులో కీలకంగా వ్యవహరిస్తున్నారని కోవింద్​ అభిప్రాయపడ్డారు. నేడు 'సివిల్​ సర్వీసెస్​ డే' సందర్భంగా వారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. అంతేకాకుండా మాజీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

11:13 April 21

రాజస్థాన్​లో 52 కేసులు

రాజస్థాన్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 52 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. మొత్తం బాధితుల సంఖ్య 1,628కి చేరింది. 25 మంది మృతిచెందారు.

11:06 April 21

'మహా' కరోనా

మహారాష్ట్రలో రోజురోజుకు వైరస్​ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 472 పాటిజివ్​ కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4676కి చేరింది. మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 232కు చేరింది.

08:38 April 21

దేశంలో 18,601 కేసులు

దేశంలో కరోనా కేసులు సంఖ్య 18,601కి పెరిగింది. మరణాల సంఖ్య 590కి చేరింది. 24 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 4,666 కేసులు నమోదయ్యాయి.

08:17 April 21

అమెరికాకు వలసలు బంద్!

అమెరికాలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. 24 గంటల్లో 1,433మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 42,500 దాటింది. కేసుల సంఖ్య 7,93,000కు చేరువైంది.

ట్రంప్ సంచలన నిర్ణయం:

కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంపాటు అగ్రరాజ్యానికి ఎవరూ వలస రాకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే... ఆయన సంతకం చేయబోయే ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు.

08:00 April 21

కరోనా కలవరం: 24 గంటల్లో మహారాష్ట్రలో 552 కేసులు

రాష్ట్రపతి భవన్​లో ఒకరికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా 125 కుటుంబాలను సెల్ఫ్​ క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

Last Updated : Apr 21, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details