అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 30,990కి చేరింది. ఇప్పటి వరకు 6,45,922 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్‌పై కరోనా పంజా... 13 వేలకు చేరువలో కేసులు
While sharing the Indian experience in tackling the COVID-19 outbreak, Nirmala Sitharaman told G20 leaders that the transfers were made to 320 million people with a special focus on direct benefit of transfer through digital technology so that the exposure of beneficiaries to public places is minimised.
20:20 April 16
అమెరికాలో 30,000 దాటిన కరోనా మరణాలు
20:12 April 16
గుజరాత్లో 929కి చేరిన కేసులు
గుజరాత్లో ఈరోజు 163 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 929కి పెరిగింది.
20:11 April 16
మధ్యప్రదేశ్‌లో 142 కొత్త కేసులు
మధ్యప్రదేశ్‌లో ఇవాళ 142 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 1,120కి పెరిగింది. మరణాల సంఖ్య 53కు చేరింది.
19:42 April 16
బ్రిటన్‌లో 13,729కు చేరిన కరోనా మరణాలు
బ్రిటన్‌లో 24 గంటల్లో 861 మంది వైరస్ కారణంగా మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 13,729కి పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 103,093కు చేరింది.
19:24 April 16
325 జిల్లాలు కరోనా ఫ్రీ
దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పుదుచ్చేరిలోని మాహేలో గత 28 రోజులుగా కేసులు సున్నా. కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కేసు రిజిస్టర్ కాలేదని కేంద్రం ప్రకటనలో తెలిపింది.
19:13 April 16
పుణెలో 47కు చేరిన కరోనా మరణాలు
మహారాష్ట్ర పుణెలో కరోనా సోకి చికిత్స పొందుతున్న 55ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో మరణాల సంఖ్య 47కు పెరిగింది.
18:51 April 16
పంజాబ్‌లో 11 కొత్త కేసులు
పంజాబ్‌లో ఇవాళ కొత్తగా 11 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 197కు చేరింది. 14 మంది మరణించారు.
18:35 April 16
ముంబయిలో కరోనా వ్యాప్తి ఉద్ధృతం
దేశంలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న ముంబయిలో కేసుల సంఖ్య 2,000 దాటింది. ఈ రోజు కొత్తగా 107 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 3,081కి చేరింది.
18:27 April 16
ఇరాన్లో 4,869కి చేరిన మరణాలు
ఇరాన్లో 24 గంటల్లో 92మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,869కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 77,995కి పెరిగింది.
18:16 April 16
కేరళలో ఏడు కొత్త కేసులు
కేరళలో ఇవాళ ఏడు కరోనా కేసులు నమోదైనట్లు సీఎం పినరయి విజయన్ వెల్లిడించారు. వీరిలో ఐదుగురు ఇటీవలే విదేశాల్లో పర్యటించినవారు, ఇద్దరు స్థానికులని తెలిపారు.
18:01 April 16
దేశంలో 12,759కి పెరిగిన కరోనా కేసులు
కరోనా వైరస్ సోకి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 420మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 12,759కి పెరిగినట్లు పేర్కొంది. వైరస్ బారిన పడి 1,515మంది కోలుకున్నట్లు వెల్లడించింది
17:40 April 16
కర్ణాటకలో 315కు చేరిన కేసులు
కర్ణాటకలో 24 గంటల్లో 36 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 315కు పెరిగినట్లు పేర్కొన్నారు. 13 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
17:27 April 16
మధ్యప్రదేశ్‌లో 1,115 కేసులు
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,115కు పేరిగింది. ఇండోర్‌లో 701, భోపాల్‌లో 196 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
17:18 April 16
కరోనాపై పోరుకు కేంద్రం మరో భారీ ప్యాకేజి!
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్‌డౌన్ పొడిగించిన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం సహా మరో ప్యాకేజీపై చర్చించినట్లు సమాచారం. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా ఇబ్బంది పడుతున్న బడుగు, బలహీన వర్గాల కోసం నిర్మలా సీతారామన్ ఇటీవల రూ.1,75,000 వేల కోట్ల విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించారు. ఐతే ఇందులో కొత్తగా ఇచ్చింది రూ.70 వేల కోట్లేనని మిగిలినదంతా బడ్జెట్‌లో ప్రకటించినదేనని ఆర్థిక వేత్తలు పెదవి విరిచారు. పరిశ్రమ వర్గాలు కూడా ఈ ప్యాకేజీపై సంతృప్తికరంగా లేవు.
ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే లక్ష కోట్లకు పైగా విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించనుందని సమాచారం. సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలకు వడ్డీ రాయితీలు, స్థిరాస్తి రంగానికి మినహాయింపులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధన సమీకరణకు ప్యాకేజీలో ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.
17:06 April 16
విదేశాల్లోని 3,336 భారతీయులకు కరోనా
ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో 3,336 మంది భారతీయులు కరోనా బారిన పడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఇప్పటి వరకు 25 మంది మరణించినట్లు పేర్కొన్నాయి.
16:54 April 16
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఇద్దరు మృతి
కరోనా సోకి ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 773కు చేరింది.
16:23 April 16
ఒక్క రోజులో 941 కొత్త కేసులు
దేశంలో 24 గంటల్లో 941 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 12,380కి చేరగా, మృతుల సంఖ్య 414కు పెరిగినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 2,90,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.
15:51 April 16
స్పెయిన్‌లో మరో 551 మంది మృతి
కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన స్పెయిన్‌లో ఒక్క రోజులో 551 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 19,130కి పెరిగింది. ఇప్పటి వరకు 1,82,816 మందికి వైరస్ సోకింది
15:37 April 16
రాజస్థాన్‌లో 28 కేసులు
రాజస్థాన్‌లో ఇవాళ 28 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,104కి చేరింది.
14:51 April 16
మధ్యప్రదేశ్‌లో 1,090 కేసులు
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,090కి పెరిగింది. వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 55కు చేరింది.
14:48 April 16
తమిళనాడులో 25 కొత్త కేసులు
తమిళనాడులో ఈరోజు కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,267కి పెరిగింది. ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు.
14:42 April 16
రాహుల్ 'లాక్డౌన్' వ్యాఖ్యలపై భాజపా సెటైర్
కరోనా నియంత్రణకు లాక్డౌన్ పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. అలాంటప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాక్డౌన్ గడువును కేంద్ర కంటే ముందే ఎందుకు పొడిగించారని భాజపా జాతీయ నేత బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు.
14:07 April 16
హరియాణాలో మరో 9 మందికి కరోనా
హరియాణాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో పంచకులలో 8, పల్వాల్లో 1 నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. అందులో 14 మంది ఇటలీ దేశస్థులు ఉన్నారు.
13:38 April 16
పుణెలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి
మహారాష్ట్ర పుణెలో 65 ఏళ్ల వృద్ధురాలు కరోనా సోకి బుధవారం రాత్రి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మృతుల సంఖ్య 44కి పెరిగినట్లు చెప్పారు.
13:23 April 16
రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు గణనీయంగా పెంచాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
- ర్యాండమ్ పద్ధతిలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలి: రాహుల్
- కరోనా వైద్య పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు: రాహుల్
- కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది: రాహుల్
- కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదు: రాహుల్‌గాంధీ
- కేరళ వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోంది: రాహుల్
13:19 April 16
విమాన టికెట్ల రద్దు రీఫండ్‌పై కేంద్రం దృష్టి
- విమాన టికెట్ల రద్దుకు తిరిగి చెల్లింపుల విషయంపై దృష్టి సారించిన కేంద్రం.
- లాక్డౌన్ పెరగడంతో విమాన టికెట్ల రద్దు చేసుకుంటున్న ప్రయాణీకులు.
- రైలు, బస్సు టికెట్ల విషయంలో... టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం.
- అదే రీతిలో విమాన టికెట్లకు అనుసరించాలని డిమాండ్ చేసిన ప్రయాణీకులు.
- గతంలో ఒకసారి నిబంధనలు సడలించి ప్రయాణీకులకు లబ్ది చేకూరేలా చూడాలని విమానయాన సంస్థలు సూచించిన కేంద్ర పౌర విమానయాన శాఖ.
- లాక్డౌన్ పొడిగింపు తరువాత అనుసరించాల్సిన విధానం పై అన్ని సంస్థల సీఈఓలతో సమావేశం నిర్వహించిన పౌర విమానయాన శాఖ.
- టికెట్ల రుసుం తిరిగి చెల్లింపులపై మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొన్న మాంత్రిత్వ శాఖ.
- త్వరలో మార్గదర్శకాలపై ప్రకటన చేయనున్నట్లు వెల్లడి.
13:03 April 16
కర్ణాటకలో 34 కొత్త కేసులు..
కర్ణాటకలో ఈరోజు 34 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 312కు పెరిగింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
12:29 April 16
మహారాష్ట్రలో 165 కొత్త కేసులు
మహారాష్ట్రలో ఈరోజు 165 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మంబయికి చెందినవి 107. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 3,081కి పెరిగింది.
12:22 April 16
కానిస్టేబుల్‌కు కరోనా
ముంబయి జుహు పోలిస్ స్టేషన్‌లోని కానిస్టెబుల్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. అతన్ని కలిసిన ఏడుగురు అధికారులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
11:22 April 16
ఇండోర్‌లో 110 కొత్త కేసులు
ఇండోర్‌లో ఇవాళ 110 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 696కి చేరింది. మృతుల సంఖ్య 39కి పెరిగింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1000 దాటింది. 50మందికి పైగా మరణించారు.
10:58 April 16
గుజరాత్లో కొత్తగా 105 కేసులు
గుజరాత్లో కొత్తగా 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాలు కాల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 871కి పెరిగింది.
10:51 April 16
పిజ్జాబాయ్కి కరోనా..
దక్షిణ దిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. అతను కలిసిన మరో 17మంది డెలివరీ బాయ్స్‌ను, ఆ ప్రాంతంలోని 72 ఇళ్లలోని వారందరినీ స్వీయ నిర్భంధంలో ఉండాలని అదేశించారు.
10:37 April 16
యూపీలో మరో మరణం
కరోనా కారణంగా ఆగ్రాలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 730కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మరణించారు.
10:19 April 16
భారత్‌కు 6.5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు..
చైనా నుంచి 6.5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు భారత్‌కు బయలు దేరాయి. వీటిలో 3 లక్షలు రాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు లక్ష ఉన్నాయి. వీటి ఎర్పాటులో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం, గ్వాంగ్జోవ్లోని కాన్సులేట్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
10:11 April 16
ఒకే కుటుంబంలో...
హరియాణా పంచకులాలో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటింది. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.
09:35 April 16
రాజస్థాన్‌లో మరో 25 కేసులు
రాజస్థాన్‌లో ఈరోజు మరో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,101కి పెరిగింది.
09:19 April 16
కర్ణాటకలో మరో వ్యక్తి మృతి
కరోనా సోకి బెంగళూరులో 66ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైరస్ కారణంగా కర్ణాటకలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
08:42 April 16
ఇండోర్‌లో మరో 42 కేసులు
ఇండోర్‌లో మరో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధరణ అయింది. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 980కి చేరింది.
08:31 April 16
దేశంలోని 325 జిల్లాల్లో కరోనా కేసులు సున్నా
కరోనా కారణంగా దేశంలో గత 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 721 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. 183 మంది కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈమేరకు వెల్లడించింది.
- మొత్తం కేసులు: 12,380
- యాక్టివ్ కేసులు: 10,477
- కోలుకున్నవారు: 1,488
- మరణాలు: 414
- వలస వెళ్లిన వారు: 1