తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 1250 దాటిన కరోనా కేసులు - coronavirus latest news

corona-live
కరోనా పంజా

By

Published : Mar 30, 2020, 9:09 AM IST

Updated : Mar 30, 2020, 11:12 PM IST

23:09 March 30

1250 ప్లస్​...

దేశంలో కరోనా విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. సోమవారం మరో 227 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1251కి చేరినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 102 మంది కోలుకోగా.. 32 మరణాలు సంభవించినట్లు స్పష్టం చేసింది. 

20:52 March 30

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్​

కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  92కు చేరింది.    

20:43 March 30

సంక్షోభంలో ఉన్నప్పటికీ అత్యవసర సేవలు అందించాలి: డబ్ల్యూహెచ్​ఓ

ప్రపంచం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ, అవసరమైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందించాలన్నారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ చీఫ్​​ టెడ్రోస్. ఇతర వ్యాధుల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు చికిత్స అవసరం అన్నారు. 

20:33 March 30

దిల్లీలో 25 కొత్త కేసులు

దేశ రాజధాని దిల్లో 25 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిపి మొత్త కేసుల సంఖ్య దిల్లో 97కు చేరుకుంది. 

20:14 March 30

జమ్ముకశ్మీర్​లో మరో మూడు కరోనా కేసులు

జమ్ముకశ్మీర్​లో మరో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో  కేసుల సంఖ్య48కి చేరుకున్నట్లు వెల్లడించారు. 11,  644మందిని వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు. 

20:10 March 30

అహ్మదాబాద్​లో 154 మంది ఖైదీల విడుదల

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్​లోని అహ్మదాబాద్​ జైలునుంచి 154మంది ఖైదీలను  అధికారులు పెరోల్​పై విడుదల చేశారు. తొలుత వారిని పరీక్షించిన తర్వాతే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.    

19:59 March 30

130 దేశాల్లోని భారత దౌత్యవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా వైరస్​ విషయంలో దౌత్య వేత్తల పనితీరు అభినందనీయమన్నారు మోదీ. కరోనా విపత్తు విషయంలో భారత్​ తొందరగానే మేల్కొన్నదన్నారు. ఐక్యత, అప్రమత్తతే దేశాన్ని భవిష్యత్​లో కాపాడుతాయన్నారు మోదీ.  

19:45 March 30

రిలయన్స్​ రూ. 500 కోట్ల విరాళం

పీఎం కేర్స్​ నిధికి రిలయన్స్​ ఇండస్ట్రీస్​ భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరాడేందుకు రూ. 500కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. 

19:33 March 30

ముంబయిలో మరో 47మందికి కరోనా పాజిటివ్​

ముంబయి మెట్రోపాలిటన్ సిటీలో మరో 47మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.  తాజా కేసులతో కలిపి మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో ఇప్పటివరకు  170మంది వైరస్​ బారిన పడినట్లు వెల్లడించారు.

19:25 March 30

పంజాబ్​లో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3కు చేరింది. 

19:03 March 30

  • లాక్‌డౌన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకే భల్లా
  • లాక్‌డౌన్‌ను లోటుపాట్లు లేకుండా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు
  • వలస కార్మికులకు వెంటనే ఆశ్రయం కల్పించాలి
  • ఒక నెల అద్దె వసూలు చేయవద్దని ఇంటి యజమానులకు సూచించాలి
  • అద్దెదారుల పట్ల సానుకూలంగా ఉండేలా ఇంటి యజమానులకు సూచించాలి
  • ఇటీవల గ్రామాలకు చేరుకున్న వలస కార్మికులకు క్వారంటైన్
  • 14 రోజులు తప్పనిసరి నిర్బంధంలోకి పంపాలి
  • వలస కార్మికులను ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా చర్యలు చేపట్టాలి

19:00 March 30

రూ. 100 చొప్పున విరాళం ఇవ్వండి: నడ్డా

కరోనాపై పోరాడేందుకు కేంద్రానికి సాయంగా భాజపా శ్రేణులు ఒక్కరు రూ. 100 చొప్పున విరాళం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.  

18:47 March 30

చమురు సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి ఎక్స్​గ్రేషియా

చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం  కీలక ప్రకటన చేశాయి. గ్యాస్​ పంపిణీలో భాగంగా సిబ్బందికి కరోనా సోకి మరణిస్తే కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించనున్నట్లు చమురు సంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి. 

18:44 March 30

కేరళలో మరో 32 కరోనా కేసులు

కేరళలో మరో 32 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయ్​ విజయన్​ తెలిపారు. అందులో 17మంది విదేశాల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరినట్లు పేర్కొన్నారు.  

17:42 March 30

చండీగఢ్​లో మరో 5 కరోనా కేసులు

చండీగఢ్​లో మరో 5 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య మొత్తం 13కు చేరింది. 

17:32 March 30

ఇజ్రాయెల్​ ప్రధాని సహాయకుడికి కరోనా పాజిటివ్​

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు సహాయకుడికి కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయ్యింది. దీంతో ప్రధాని క్వారంటైన్​లో ఉన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

17:25 March 30

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఆర్మీలోని మెడికల్​ సిబ్బందితో ఆయుష్మాన్ భారత్ వర్గాలు చర్చలు చర్చించాయి. దాదాపు 5వేల బోగీలను ఐసోలేషన్​ వార్డులుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. 

17:16 March 30

నోడల్​ ఆఫీసర్ల నియామకం

కరోనాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నోడల్​ ఆఫీసర్లను నియమించనున్నట్లు కేంద్ర  సిబ్బంది మంత్రిత్వ శాఖ తెలిపింది.  

17:11 March 30

జేఎన్​యూ ప్రవేశ పరీక్షల గడువు పొడగింపు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జేఎన్​యూ ప్రవేశ పరీక్ష గడువును యంత్రాంగం పొడించింది. ఎప్పుడు నిర్వహించేది మళ్లీ తెలియజేస్తామని పేర్కొంది.  

17:01 March 30

బంగాల్​లో బీమా రూ. 10లక్షలకు పెంపు

కరోనా వైరస్​ను అరికట్టడంలో కీలకంగా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, కొరియర్​ సర్వీస్​లో పనిచేసే వారు, తదితర వర్గాలకు బీమాను పెంచుతున్నట్లు పశ్చిమ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు బీమాను పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.

16:51 March 30

పోలీసుల రక్తదానం

లాక్​డౌన్ నేపథ్యంలో దేశంలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ సమయంలో ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండగా.. అతడి ప్రాణాలు కాపాడటానికి రక్తం అత్యవసమైంది. ఈ క్రమంలో వృద్ధుడి ప్రాణాలను కాపడటానికి పోలీసులు రక్తదానం చేసి అతడి ప్రాణాలను కాపాడారు.

16:45 March 30

38,442 మందికి కరోనా పరీక్షలు  

దేశంలో ఇప్పటి వరకు 38,442 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదివారం నాడే 3,501 పరీక్షలను చేసినట్లు వెల్లడించింది. గత 3 రోజుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లలో 1,334 పరీక్షలను జరిపినట్లు కేంద్రం పేర్కొంది.

16:27 March 30

హెచ్​ఏఎల్ రూ. 20కోట్ల విరాళం

పీఎం  కేర్స్​ నిధికి రూ. 20 కోట్లను విరాళంగా అందజేయనున్నట్లు ప్రముఖ ఎయిర్​ స్పేస్​ సంస్థ హిందుస్థాన్​ ఎరోనాటికల్​ లిమిటెడ్​( హెచ్​ఏఎల్​) ప్రకటించింది.  

16:14 March 30

కరోనాపై పోరాడేందుకు పీఎం కేర్స్​ నిధికి రూ. 25కోట్లను తన పతంజలి సంస్థ ద్వారా విరాళం అందించనున్నట్లు యోగా గురు రామ్​దేవ్​ బాబా ప్రకటించారు.

16:12 March 30

దేశంలో కరోనా వైరస్​ కొత్త కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24గంటల్లో 92 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం 1,071 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 29మంది మృతి చెందారు. 

16:04 March 30

అఫ్ఘనిస్థాన్​ నుంచి దిల్లీ చేరుకున్న భారతీయులు  

ఆఫ్ఘనిస్తాన్​ కాబూల్ నుంచి 35మంది భారతీయులు ప్రత్యేక విమానంలో  దిల్లీకి చేరుకున్నారు. ఇండో-టిబెటన్ సరిహద్దులోని  పోలీస్ క్యాంప్‌లో వీరిని క్వారంటైన్​లో ఉంచనున్నారు.

15:57 March 30

మధ్యప్రదేశ్​లో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు అ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్​ మరణాల సంఖ్య 4కు చేరింది.

15:53 March 30

పేదల సేవే దేశ సేవ: ప్రధాని మోదీ  

సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.  వైరస్​ను ఎదుర్కోవడంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని, ప్రజలు గొప్ప సహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేయడం అంటే పేదలకు సేవ చేయడం అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు మోదీ. మానవత్వంతో సేవ చేసే సామాజిక సంస్థలను మోదీ ప్రశంసించారు.

15:34 March 30

  • కరోనా ను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న 22.12 లక్షల సిబ్బందికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిన ద న్యూ  ఇండియా అస్యూరెన్స్ కంపెనీ.
  • కోవిడ్ నియంత్రణకు పాటుపడుతున్న వైద్య, మున్సిపల్, పారా మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్స్ కు  ప్రధాన మంత్రి గరీభ్​ కళ్యాణ్ యోజన కింద రూ. 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తూ ప్రకటన చేసిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.
  • కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో మార్గదర్శకాలు విడుదల చేసిన సంస్థ.

15:28 March 30

ఇరాన్​లో ఒక్కరోజులో కరోనాకు 117మంది బలి

ఇరాన్​లో కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 117మంది వైరస్​ బారిన పడి చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. తాజా మరణాలతో ఇరాన్​లో మృతుల సంఖ్య 2,757కు చేరింది.

15:22 March 30

జమ్ముకశ్మీర్​లో మరో నాలుగు పాజిటివ్​ కేసులు

జమ్ముకశ్మీర్​లో మరో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. షాపియాన్​, శ్రీనగర్​లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు.

15:15 March 30

రాజస్థాన్​లో మూడు కొత్త కేసులు

రాజస్థాన్​లో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బిళ్వారాలో  ఒకటి, జైపుర్​లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది.

15:09 March 30

వలస కార్మికులకు కరోనా పరీక్షలు

బీహార్​లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు రోహతాస్​లోని ససారాం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.  

15:04 March 30

మూడు ప్రత్యేక పార్శిల్​ రైళ్లు..

నిత్యావసర వస్తువులను తరలించేందుకు కేంద్రం మూడు ప్రత్యేక పార్శిల్​ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.  పశ్చిమ బెంగాల్​,  మహారాష్ట్ర, అసోం మధ్య ఈ మూడు రైళ్లను నడపనున్నారు.

14:54 March 30

గౌతమ్‌ బుద్ధనగర్‌లో 32 కేసులు

ఉత్తరప్రదేశ్ గౌతమ్‌ బుద్ధనగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు 32కు చేరుకున్నాయి. 

14:46 March 30

సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశం

సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కరోనా వైరస్​ ఎదుర్కొనేందుకు అవసమైన సూచనలను వారి నుంచి  మోదీ  కోరారు.

14:33 March 30

10వేల శానిటైజర్​ బాటిళ్ల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 10వేల శానిటైజర్​ బాటిళ్లను ముంబయి పోలీసులు పట్టకున్నారు. బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్​ చేశారు.  

14:28 March 30

పాటతో పుణె పోలీసుల అవగాహన  

కరోనా వైరస్​పై పుణె పోలీసులు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. పాట పాడుతూ ప్రజలకు వైరస్​ చేసే నష్టాన్ని తెలియజేస్తున్నారు. 

14:11 March 30

వృద్ధ దంపతులకు పోలీసుల సాయం

డయాబెటిస్​, బీపీతో బాధపడుతున్న వృద్ధ దంపతులకు సాయం అందించారు దిల్లీ పోలీసులు. వారి పిల్లలు అమెరికాలో నివసిస్తుండగా.. ఇంట్లో భార్యాభర్తులు ఇద్దరే ఉంటున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో వారు బయటికి వెళ్లలేని పరిస్థితి. డయాబెటిస్​, బీపీతో బాధపడుతున్న వారికి కొన్ని అత్యవసర వస్తువులు అవసరం వచ్చింది. దీంతో వెంటనే స్థానిక ఎస్​హెచ్ఓకు ఫోన్​ చేసి విషయం చెప్పగా వారు వచ్చి.. పోలీసులే కావల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇచ్చారు.  

13:48 March 30

కరోనా కారణంగా మహారాష్ట్రలో మరో వ్యక్తి మృతి చెందాడు. పుణెకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఫలితంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కొవిడ్​-19 మృతుల సంఖ్య 9కి చేరింది.

13:31 March 30

తమిళనాడులో మరో 17 కేసులు

తమిళనాడు మరో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల సంఖ్య 67కు చేరింది.

13:24 March 30

రంగంలోకి డీఆర్​డీఓ

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్​ల తయారీకి రంగంలోకి దిగింది దేశీయ రక్షణ, పరిశోధన సంస్థ డీఆర్​డీఓ. వచ్చే వారం నుంచి డీఆర్​డీఓ రోజుకు 20వేల ఎన్​-99 మాస్కులు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

13:01 March 30

  • వలస కూలీలకు వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ వేసిన సుప్రీం కోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ
  • వలస కూలీలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
  • ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపిన సోలిసిటర్ జనరల్
  • అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరిన సోలిసిటర్ జనరల్
  • స్టేటస్ రిపోర్ట్​తో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

12:55 March 30

వలస కూలీల పిటిషన్​ విచారణను రేపటికి వాయిదా వేసిన సుప్రీం

వలస కూలీలకు వసతులు కల్పించడంపై న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్​ను సీజేఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా స్వీకరించింది. ఈ అంశంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. అలాగే దీనిపై  అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరగా.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

12:41 March 30

  • దేశంలో 1071కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
  • మొత్తం 29 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడి
  • 99 మంది కోలుకున్నట్లు కేంద్రం ప్రకటన
  • 942 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స
  • మహారాష్ట్రలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • మహారాష్ట్రలో 215కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
  • మహారాష్ట్ర సాంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి సోకిన కరోనా
  • మధ్యప్రదేశ్‌లో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • మధ్యప్రదేశ్‌లో మొత్తం 47కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
  • బంగాల్‌లో కరోనాతో 54ఏళ్ల మహిళ మృతి
  • బంగాల్‌లో 2కి చేరిన కరోనా మృతుల సంఖ్య
  • బంగాల్‌లో మొత్తం 22కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
  • పంజాబ్‌లో మొత్తం 39కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
  • మొహలీలో కొత్తగా 65 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ
  • గుజరాత్‌లో కరోనాతో మరొకరు మృతి
  • గుజరాత్‌లో 6కు చేరిన కరోనా మృతుల సంఖ్య
  • గుజరాత్‌లో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • గుజరాత్‌లో మొత్తం 69కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

12:30 March 30

రంగలోకి బంగాల్​ మంత్రి

పశ్చిమ బంగాల్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆ రాష్ట్ర మంత్రి స్వపన్ దేబ్​నాథ్​ రంగలోకి దిగారు. బర్దేవాన్​లో రక్షణ దుస్తులను ధిరంచి లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.

12:22 March 30

మధ్యప్రదేశ్​లో 60రోజులకు పెరోల్​ పొడగింపు

దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో ఖైదీలను పెరోల్​పై విడుదల చేయాలని ఇటీవల సుప్రీకోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగానే మధ్యప్రదేశ్​లో జైలులో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు దాదాపు 60రోజుల పాటు పెరోల్​పై విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది.

12:11 March 30

పసుపు, వేప ఆకుల మిశ్రమంతో శానిటైజేషన్​

శానిటైజర్ల కొరత నేపథ్యంలో తమిళనాడు రామనాథపురం జిల్లాలో ఆయుర్వేద పద్ధతిని అనుసరిస్తున్నారు. కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు పసుపు, వేప ఆకుల మిశ్రమాన్ని వీధుల్లో పిచికారీ చేస్తున్నారు.

12:04 March 30

కరోనాపై వినూత్న ప్రచారం

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. రహదారులపై కరోనా వైరస్​ ఆకృతులను గీసి.. కరోనా ప్రమాదకరమైనదని, దానికి దూరంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నారు.

11:40 March 30

కరోనా ఆస్పత్రిగా దిల్లీ ఎయిమ్స్‌  

దిల్లీ ఎయిమ్స్‌ ట్రామా కేర్ సెంటర్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

11:29 March 30

కార్గో విమానాల ద్వారా సరఫరా  

వైద్య పరికరాలు, పరీక్షలు, రక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వాటిని కార్గో విమానాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది.

11:23 March 30

గుజరాత్​లో ఆరు కొత్త కేసులు

గుజరాత్​లో ఆరు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 69కి చేరుకుంది.

11:02 March 30

పంజాబ్​లో మరొకరికి కరోనా నిర్ధరణ

పంజాబ్​లో మరొకరికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య39కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

10:54 March 30

దేశంలో కరోనా మరణాలు 29కి చేరుకున్నాయి. మొత్తం కేసులు 1, 071 నమోదయ్యాయి. అందులో యాక్టివ్​ కేసులు 942, 99 డిశ్చార్జ్​, 29 మరణాలు ఉన్నాయి..  

10:36 March 30

గుజరాత్​లో కరోనాతో మరొకరు మృతి చెందారు. వైరస్​ సోకి చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు ఆ  రాష్ట్ర వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో వైరస్​ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6కి చేరింది.  

10:30 March 30

రాజస్థాన్​లో మరో కరోనా కేసు నమోదు

రాజస్థాన్ జోధ్​పుర్​లో మరో కరోనా కేసు నమోదైంది. అతడు ఇటీవల ఇరాన్​ నుంచి వచ్చాడు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60కి చేరింది.

10:06 March 30

21రోజుల పాటు విధించిన లాక్​డౌన్​ను పొడగిస్తారనే వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.  అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని, ఆ వార్తలు అవాస్తవమని కేబినెట్​ కార్యదర్శి కొట్టిపారేశారు.

10:00 March 30

దిల్లీలో లాక్​డౌన్ కట్టుదిట్టం  

దిల్లీలో లాక్​డౌన్​ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు  చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టి విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసమైన పరిస్థితుల నేపథ్యంలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. దిల్లీ-గురుగావ్​ సరిహద్దులో సరైన పత్రాలు, ఐడీ కార్డులు, పాస్​లను చూపిస్తే తప్పా అనుమతించడం లేదు. 

09:52 March 30

85మంది కరోనా అనుమానితులు ఆస్పత్రిలో చేరిక

85మంది కరోనా అనుమానితులు దిల్లీలోని లోక్​నాయక్​ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆ ఆస్పత్రిలో చేరిన అనుమానితుల సంఖ్య 106కు చేరింది.

09:21 March 30

మహారాష్ట్రలో కొత్తగా 12 కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. పుణెలో 5, ముంబయిలో 3, నాగ్​పుర్​లో 2, కొల్హాపుర్​లో 1, నాసిక్​లో ఒక కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 215కి చేరిందని తెలిపింది. 

09:05 March 30

దేశంలో 1250 దాటిన కరోనా కేసులు

కరోనా కారణంగా దేశంలో మరొకరు మృతిచెందారు. బంగాల్​లో ఓ రోగి ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. దీనితో బంగాల్​లో మొత్తం మరణాల సంఖ్య రెండుకు చేరింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం... దేశంలో ఇప్పటివరకు 27 మంది కరోనా కారణంగా చనిపోయారు. 901 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 95 మంది కోలుకున్నారు.

Last Updated : Mar 30, 2020, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details