దేశంలో మరో 14,933 కరోనా కేసులు, 312 మరణాలు - covid -19 news
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 14,933 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనా కాటుకు బలయ్యారు.
కరోనా
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్ కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 14,933 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 312 మంది వైరస్‌కు బలయ్యారు.
- మహారాష్ట్ర, దిల్లీల్లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య మొత్తంగా 1,35,796కు చేరింది. 6,283 మంది మహమ్మారికి బలయ్యారు.
- గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 27,880కి పెరిగింది. మరణాలు 1,685కు చేరాయి.
- దిల్లీలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 62,655కు పెరిగింది. చనిపోయినవారి సంఖ్య 2,223కు చేరింది.
- తమిళనాడులో బాధితుల సంఖ్య 62,087కి పెరిగింది. వైరస్ సోకి మొత్తం 794 మంది మరణించారు.
Last Updated : Jun 23, 2020, 9:58 AM IST