కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈనెల 14నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్న రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 244 మంది సభ్యుల్లో 130 మంది 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (87) అందరికంటే పెద్దవారు. తర్వాతి స్థానంలో అకాళీదళ్ ఎంపీ సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా (84), తెరాస నేత కె.కేశవరావు (81), ఏఐఏడీఎంకె సభ్యుడు ఎస్.ఆర్.బాలసుబ్రహ్మణ్యన్ (81) ఉన్నారు.