కరోనా ప్రభావం పద్మ పురస్కారాల ప్రదానోత్సవంపై పడింది. ఈ పురస్కారాలను ఏప్రిల్ 3న రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ప్రదానం చేయనున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడింది.
కరోనా ఎఫెక్ట్: 'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా - Padma awards
పద్మ పురస్కారాల ప్రదోనాత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.
'పద్మ' పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా
కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:కరోనాపై పోరుకు నేడు సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్