భారత్లో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా మాస్క్లు లేకుండా బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. పరిశుభ్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు అంతర్జాల ఆహార సంస్థలు సైతం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.
కరోనా కట్టడికి ఆన్లైన్ సంస్థల సరికొత్త ఆలోచన..!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అలాగే అంతర్జాల ఆహార సంస్థలు ఆర్డర్లతో పాటు శానిటైజర్లను కూడా డెలివరీ చేస్తున్నాయి.
కరోనా నియంత్రణలో ఆన్లైన్ సంస్థలు.. సానిటైజర్ల డెలివరీ
ఆహారాన్ని డెలివరీ చేయడమే కాకుండా శానిటైజర్లను ఉచితంగా వినియోగదారులను అందిస్తున్నాయి. డెలివరీ బాయ్స్ కూడా.. ఆహారాన్ని అందించిన తర్వాత చేతులు బాగా శుభ్రం చేసుకొని తినాలని చెబుతున్నారు. ఇలా శానిటైజర్లను అందించడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:బ్రెజిల్ వరదల్లో 46 మంది ఆచూకీ గల్లంతు