దేశంలో 1981కి పెరిగిన కరోనా మరణాలు
భారత్లో గడిచిన 24 గంటల్లో మరో 95 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 731 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 19 వేల 63కు చేరాయి. మరో 3470 మంది కోలుకున్నారు.
గుజరాత్లో 7 వేలకుపైగా కేసులు, 449 మరణాలు సంభవించాయి.