దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 48,512కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,31,669కు చేరుకుంది. మరో 768 మంది కరోనా బారిన పడి మరణించారు.
దేశంలో కొత్తగా 48,512 కేసులు.. 768 మరణాలు - కరోనా తాజా వార్తాలు
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 48,512 వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 768 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
భారత్లో కొవిడ్ కేసులు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, మంగళవారం దేశవ్యాప్తంగా 4,08,855 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
- యాక్టివ్ కేసులు: 5,09,447
- మరణాలు: 34,193
- కోలుకున్నవారు: 9,88,029
ఇదీ చూడండి:ఆర్థిక అంతరాలకు అంతమెన్నడు?
Last Updated : Jul 29, 2020, 11:03 AM IST