దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1463మంది వైరస్ బారినపడ్డారు. 60మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 8068మందికి వైరస్ సోకింది. 342మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
భారత్‌లో కరోనా విజృంభణ.. 886కు చేరిన మరణాలు - coronavirus disease
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 28వేలు దాటింది. వైరస్ ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు 8068 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 342గా ఉంది.
భారత్‌లో కరోనా విజృంభణ
కేసుల సంఖ్య గుజరాత్లో 3301, దిల్లీలో 2918, మధ్యప్రదేశ్‌లో 2168, రాజస్థాన్‌లో 2185, తమిళనాడులో 1885కు పెరిగింది. మరణాల్లో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గుజరాత్లో 151మంది, మధ్యప్రదేశ్‌లో 106మంది వైరస్‌తో అసువులు బాశారు.
ఇదీ చూడండి:నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా?