భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 మందికి వైరస్ సోకింది. మరో 175 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 66వేలకు చేరువైంది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మరణాల్లో చైనాను దాటేసిన భారత్.. పదమూడో స్థానానికి వెళ్లింది.
దేశంలో కరోనా రికార్డు.. 24 గంటల్లో 7466 కేసులు
భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 175 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌లో ఒక్కరోజులో 7466 కేసులు, 175 మరణాలు
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1982 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 59,546కి చేరింది. మొత్తం గుజరాత్లో 15,562, మధ్యప్రదేశ్‌లో 7,453 మంది వైరస్ బారినపడ్డారు.
ఇదీ చూడండి:దారుణం: కరోనా పోవాలని నరబలి!
Last Updated : May 29, 2020, 10:58 AM IST