భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో మరో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 266 మంది మరణించారు.
దేశంలో 24 గంటల్లో 9,987 కేసులు, 266 మరణాలు - covid-19
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు.
![దేశంలో 24 గంటల్లో 9,987 కేసులు, 266 మరణాలు corona-cases-in-india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7537178-thumbnail-3x2-toll.jpg)
దేశంలో కరోనా వివరాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 3169 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 88 వేలు దాటింది. గుజరాత్లో 1280 మంది, మధ్యప్రదేశ్లో 414, బంగాల్లో 405 మంది మరణించారు.
Last Updated : Jun 9, 2020, 10:29 AM IST