భారత్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 206 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
దేశంలో 7 వేలు దాటిన కరోనా మరణాలు - covid news
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 9983 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 206 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో 24 గంటల్లోనే 9983 కరోనా కేసులు
మహారాష్ట్రలో అత్యధికంగా 3060 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 85 వేలు దాటింది. గుజరాత్లో 1249 మంది, మధ్యప్రదేశ్లో 412, బంగాల్లో 396 మంది మరణించారు.
Last Updated : Jun 8, 2020, 11:56 AM IST