భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,964 మందికి వైరస్ సోకింది. మరో 265 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మృతుల సంఖ్య 4,971కు పెరిగింది.
దేశంలో 24 గంటల్లోనే 7964 కేసులు, 265 మరణాలు
భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,964 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధిక పెరుగుదల. మరో 265 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌లో కరోనా వైరస్
కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 73 వేలకు చేరువైంది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది.
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,098 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 62,228కి చేరింది. మొత్తం గుజరాత్లో 15,934, మధ్యప్రదేశ్‌లో 7,645 మంది వైరస్ బారినపడ్డారు.
Last Updated : May 30, 2020, 9:41 AM IST