భారత్లో కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 194 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,566 మంది వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య లక్షా 58 వేలు దాటింది.
భారత్లో ఒక్కరోజే 6566 కేసులు, 194 మరణాలు - మహారాష్ట్ర
దేశంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 194 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో ఒక్కరోజే 6566 కేసులు, 194 మరణాలు
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1897 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 56,948కి చేరింది. గుజరాత్లో 938, మధ్యప్రదేశ్లో 313 మంది కొవిడ్-19 ధాటికి ప్రాణాలు కోల్పోయారు.