దేశంలో 2109కి పెరిగిన కరోనా మరణాలు
భారత్లో గడిచిన 24 గంటల్లో మరో 128 మంది కరోనాతో మరణించారు. బాధితుల సంఖ్య 63 వేలకు చేరువైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 779 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. కేసులు 20 వేలు దాటాయి. ఇప్పటివరకు 3800 మంది కోలుకున్నారు.