తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా చికిత్స మార్గదర్శకాలపై ఐసీఎంఆర్​దే తుది నిర్ణయం'

corona death toll in india rises to 1074
భారత్​లో కరోనా విజృంభణ.. 1074కు పెరిగిన మరణాలు

By

Published : Apr 30, 2020, 8:41 AM IST

Updated : Apr 30, 2020, 2:54 PM IST

12:45 April 30

'కరోనా చికిత్స మార్గదర్శకాలపై ఐసీఎంఆర్​దే తుది నిర్ణయం'  

కరోనా చికిత్స మార్గదర్శకాలపై ఐసీఎంఆర్​దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైడ్రాక్సీ క్లోరిక్విన్​, అజిత్రోమైసిన్ వాడకంపై పిటిషన్​ దాఖలు కాగా.. సుప్రీంకోర్టు విచారించింది. కరోనాతో ఆరోగ్యం విషమించిన వారికి ఇచ్చే చికిత్స మార్గదర్శకాలను మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఐసీఎంఆర్ కు సూచించింది.

11:21 April 30

దుబాయ్​లోని భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు

కరోనా నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. స్వదేశానికి వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ను ఏర్పాటు చేసింది దుబాయ్​లోని భారత రాయబార కార్యాలయం. ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

08:39 April 30

భారత్​లో కరోనా విజృంభణ.. 1074కు పెరిగిన మరణాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1718 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

మొత్తం కేసులు: 33050

యాక్టివ్ కేసులు: 23651

మరణాలు: 1074

కోలుకున్నవారు: 8324

వలస వెళ్లిన వారు: 1

Last Updated : Apr 30, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details