కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటంపై దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు 200 మందితో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లతో ఫోన్ కాల్స్ ద్వారా చర్చించనున్నారు. వివిధ ప్రాంతాల డాక్టర్లు,వైద్య సిబ్బందితోనూ మాట్లాడి కొవిడ్-19 కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అభిప్రాయాలను తెలుసుకుని.. వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలపనున్నారు.
కరోనా కట్టడికి ముఖ్యమంత్రులు, గవర్నర్లతో మోదీ భేటీ - కరోనా కట్టడికి దేశ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ
కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. డాక్టర్లు, వైద్య సిబ్బంది, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతరులతో కలిపి మొత్తం 200 మందితో చర్చించనున్నారు.
కరోనా కట్టడికి దేశ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ
కరోనా వైరస్ సోకిన రోగులతో, కోలుకున్న వారితోనూ మోదీ సంభాషించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, పలువురు అధికారులతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోనున్నారని.. ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఇదీ చూడండి :కరోనా పంజా: శ్రీలంకలో తొలి మరణం