సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా - corona latest news
11:32 May 02
సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా
మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా ముంబయిలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ బంగ్లా వెలుపల గస్తీ కాసే ముగ్గురు పోలీసులకు కరోనా సోకడం యంత్రాంగాన్ని కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు చికిత్స కోసం వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల మాతోశ్రీ భవనం సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం నివాసం వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న 130 మంది ఆ స్టాల్లోనే టీ తాగారు. అధికారులు వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వారి స్థానంలో కొత్తగా నియమించిన పోలీసుల్లో ముగ్గురికి ఇప్పుడు కరోనా సోకింది.