తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 17వేల మందికి వైరస్- 'మహా'లో అధికం

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 17, 265మంది మహమ్మారి బారిన పడ్డారు. 543మంది చనిపోయారు. 4200 పైగా కేసులతో మహారాష్ట్ర వైరస్ బాధిత రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉంది.

india corona
దేశవ్యాప్తంగా 17వేలమందికి వైరస్

By

Published : Apr 20, 2020, 9:51 AM IST

Updated : Apr 20, 2020, 12:35 PM IST

దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. 24 గంటల్లోనే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,553 మందికి వైరస్ సోకింది.

భారత్​లో కరోనా గణాంకాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 4,203 కేసులు నమోదయ్యాయి. 223 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత స్థానంలో 2003 కేసులతో దిల్లీ ఉంది.

గుజరాత్​లో కొత్తగా 108మందికి..

గుజరాత్​లో కొత్తగా 108 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 1851కి చేరింది. రాష్ట్రంలో మరో నలుగురు వైరస్​కు బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 67కు పెరిగింది.

బిహార్​లో..

బిహార్​లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 96కు చేరింది. ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో 1478, తమిళనాడులో 1477, మధ్యప్రదేశ్​లో 1407 మంది వైరస్ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో 1084 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:వాడిన మాస్కులను రీసేల్​ చేసే యత్నంలో మళ్లీ..?

Last Updated : Apr 20, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details