భారత్‌లో కరోనా కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు విడిచినట్లు అధికారులు ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లో మరో 20మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇండోర్‌లో 19మందికి, ఖర్గావ్లో ఒకరికి వ్యాధి ఉన్నట్లు తేలింది. తాజా బాధితులతో కేసుల సంఖ్య 86కు చేరింది. ఇండోర్‌లో గుర్తించిన వైరస్ బాధితుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ముంబయికి చెందిన 16 మందికి, పుణె వాసులు ఇద్దరికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాజిటివ్‌గా తేలినవారి సంఖ్య 320కి చేరుకుంది. రాష్ట్రంలో 12 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 35 మంది మరణించారు. 1,238 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 123 మంది కోలుకున్నారు.
ఇదీ చూడండి:కరోనా సమర వ్యూహంలో.. వలస జీవులకు ఆసరాగా నిలవాలి