తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట లక్ష దాటిన కరోనా కేసులు - తమిళనాడులో లక్ష కరోనా కేసులు

Corona cases in Tamilnadu cross 1 lakh
తమిళనాట లక్ష దాటిన కరోనా కేసులు

By

Published : Jul 3, 2020, 6:09 PM IST

Updated : Jul 3, 2020, 7:40 PM IST

18:40 July 03

తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య లక్ష దాటింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,329 కేసులు నిర్ధరణ అయినట్లు తమిళనాడు వైద్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. కొత్త కేసుల్లో 2,082 మంది బాధితులను చెన్నైలోనే గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  

కరోనా కారణంగా గత 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,385కి చేరినట్లు వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,955 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.  

18:06 July 03

తమిళనాట లక్ష దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,329 కేసులు నమోదయ్యాయి. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో 2,082 చెన్నైలోనే ఉన్నాయి. 

  • మొత్తం కేసులు: 1,02,721
  • మరణాలు: 1,385
  • యాక్టివ్ కేసులు: 42,955
Last Updated : Jul 3, 2020, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details