దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 54 వేల 736 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసులు 17 లక్షల 50 వేలు దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
దేశంలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు - corona latest news
భారత్లో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. రోజూ 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 54 వేల 736 కేసులు వెలుగుచూశాయి. మరో 853 మంది చనిపోయారు.
దేశంలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు
మహారాష్ట్రలో లక్షా 49 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 15 వేల 316 మంది మరణించారు.
- గుజరాత్, కర్ణాటకల్లోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
- తమిళనాడులో మొత్తం 4034, దిల్లీలో 3989 మరణాలు నమోదయ్యాయి.
Last Updated : Aug 2, 2020, 11:24 AM IST