తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డ్: ఒక్కరోజులో 24 వేల 850 కేసులు, 613 మరణాలు - కరోనా తాజా వార్తలు

ఆంక్షల సడలింపుల తరువాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24 వేల 850 కొవిడ్​ కేసులు, 613 మరణాలు సంభవించాయి.

corona cases in india
భారత్​లో కరోనా విజృంభణ

By

Published : Jul 5, 2020, 9:56 AM IST

Updated : Jul 5, 2020, 10:34 PM IST

దేశంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24 వేల 850 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 613 మంది ప్రాణాలు కోల్పోయారు.

రికార్డ్: ఒక్కరోజులో 24 వేల 850 కేసులు, 613 మరణాలు
  • మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,00,064చేరింది. వీరిలో 8,671 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,07,001మందికి వైరస్​ సోకగా.. మరణాలు 1,450కి చేరాయి.
  • గుజరాత్​లో 1,925 మంది కరోనా కారణంగా చనిపోయారు. కేసులు 35,312 దాటాయి.
  • దిల్లీలో మొత్తం కేసులు 97,200కు, మృతుల సంఖ్య 3,004కి చేరింది.
Last Updated : Jul 5, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details