తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు - Covid-19 pandemic in india

కరోనా కేసుల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. 24 గంటల్లోనే 1,383 కొత్త కేసులు నమోదయ్యాయి. 50 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 640కి పెరిగింది.

corona cases in india rises to almost 20k
24 గంటల్లో 1,383 కొత్త కేసులు-50మరణాలు

By

Published : Apr 22, 2020, 8:49 AM IST

Updated : Apr 22, 2020, 9:44 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. 24 గంటల్లోనే 1,383 కొత్త కేసులు నమోదు కాగా, 50మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 19,984కు పెరిగింది. మృతుల సంఖ్య 640కి చేరింది.

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 5,218కి చేరింది. దిల్లీ, గుజరాత్​లో 2,100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి

ఇదీ చూడండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

Last Updated : Apr 22, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details