కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 5వేల కేసులు - కేరళ కరోనా
కేరళలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 5వేల 22 కేసులు నమోదయ్యాయి. మరో 21మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మరో 5,016మందికి పాజిటివ్‌గా తేలింది. తమిళనాడులో కొత్తగా 3,536మంది వైరస్ బారినపడ్డారు.
కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. కేరళలో కొత్తగా 5,022మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 21మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 92,731గా ఉంది.
- కర్ణాటకలో మరో 5,018 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 64మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,70,604కి చేరగా..మరణాల సంఖ్య 10,542కి పెరిగింది.
- తమిళనాడులో కొత్తగా 3,536 మంది వైరస్ బారినపడ్డారు. మరో 49మంది వైరస్ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,90,936కి పెరిగింది. మరణాల సంఖ్య 10,691గా ఉంది. 6,42,152 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- దిల్లీలో కొత్తగా నమోదైన 2,154 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 3,33,171కి చేరింది. ఇప్పటివరకు 6,040మంది మరణించారు.
- రాజస్థాన్ మరో 1,960 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 15 మంది చనిపోయారు. 20,893 యాక్టివ్ కేసులున్నాయి.
- జమ్ముకశ్మీర్‌లో ఒక్కరోజులో 427 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 88,369కి పెరిగింది. మరణాల సంఖ్య 1,388కి చేరింది.
- మణిపుర్లో 315 కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,778కి చేరగా.. మరణాల సంఖ్య 117గా ఉంది.