దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల మార్కు దాటిపోయింది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11,458 మంది వైరస్ బారినపడ్డారు. మరో 386 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.
3 లక్షలు దాటిన కేసులు- 24 గంటల్లో 11,458 మందికి కరోనా రాష్ట్రాల వారీగా..
కొత్తగా నమోదైన 386 కరోనా మరణాల్లో.. దిల్లీ- 129, మహారాష్ట్ర- 127, గుజరాత్- 30, ఉత్తర్ప్రదేశ్- 20, తమిళనాడు- 18, బంగాల్- 9, తెలంగాణ- 9, మధ్యప్రదేశ్- 9, కర్ణాటక- 7, రాజస్థాన్- 7, హరియాణా- 6, ఉత్తరాఖండ్- 6, పంజాబ్- 4, అసోం- 2; కేరళ, జమ్ము కశ్మీర్, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటి వరకు కరోనా వ్యాధి నుంచి 49.9 శాతం మంది కోలుకున్నారు.
ఇదీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!